మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నారని స్వచ్ఛంద పౌర సేవా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు మల్లయ్య, మధుసూదన్ రావు అన్నారు. బుధవారం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. విచ్చలవిడిగా పర్మిట్ రూములు ఏర్పాటు చేశారని, బెల్ట్ షాపుల్లో నిరంతరం మద్యం అమ్మకాలు చేస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.