KMM: ఖమ్మం వెలుగుమట్లలో బాధితుల కోసం అద్భుతమైన ‘మోడల్ కాలనీ’ నిర్మిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్లో భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన 311 మంది బాధితులకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ ఉన్నారు.