NZB: రైతు తన పొలాన్ని మెరక చేయడానికి అంటూ అధికారుల నుంచి అనుమతి తీసుకుంటున్నారు. వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామంలో చెరువులో 5 వేల క్యూబిక్ మీటర్ల మట్టికి అనుమతి తెచ్చుకుని, ఏకంగా లక్ష క్యూబిక్ మీటర్లకు పైగా తవ్వేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గడువు ముగిసినా తవ్వకాలు ఆపకుండా కొనసాగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.