SDPT: బీఆర్ఎస్ నేతలు వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉంటూ అభివృద్ధికి సహకరించాలని బెజ్జంకి మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొంకటి రాములు సూచించారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ప్రజల్లో ఉంటూ ప్రజా మద్దతు పొందాలని, కక్షపూరిత రాజకీయాలకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలపై విమర్శలు చేయడం తగదని, అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.