• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘జనగణన పకడ్బందీగా పూర్తి చేయాలి’

SRCL: జనగణన పకడ్బందీగా పూర్తి చేయాలని సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో చార్జ్ ఆఫీసర్లు, అదనపు ఛార్జ్ ఆఫీసర్లకు బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో డిజిటల్ విధానంలో జరిగే మొదటి జనగణన ఇది అని వెల్లడించారు. కార్యక్రమాన్ని అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని స్పష్టం చేశారు.

March 11, 2026 / 07:10 PM IST

పేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్: ఎమ్మెల్యే

NGKL: నిరుపేదల వైద్య ఖర్చుల భారం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నారాయణరెడ్డి అన్నారు. బుధవారం మార్చల్ గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కును ఆయన అందజేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల మెరుగైన వైద్యం తీసుకోలేక ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక గొప్ప వరమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.

March 11, 2026 / 07:05 PM IST

పత్తిపాక విద్యార్థుల క్షేత్ర సందర్శన

PDPL: ధర్మారం మండలం పత్తిపాక ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఇవాళ క్షేత్ర పర్యటనలో భాగంగా గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వారికి దేవాలయాల ప్రాముఖ్యతను వివరించారు. అందరూ కలిసి భోజనాలు చేసి, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. హెచ్ఎం నూతి మల్లన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

March 11, 2026 / 07:05 PM IST

‘మహిళా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి’

SRD: మహిళా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని యుటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జ్ఞానమంజరి డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. మహిళా చట్టాలను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. సమావేశంలో మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ శారద పాల్గొన్నారు.

March 11, 2026 / 07:05 PM IST

శారీరక దృఢత్వంపై దృష్టి సారించాలి: SP

ADB: పోలీస్ సిబ్బందికి విధులతో పాటు మానసిక ఉల్లాసం తప్పనిసరి అని SP అఖిల్ మహాజన్ తెలిపారు. బుధవారం జిల్లాలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇండోర్ స్పోర్ట్స్ ప్రాంగణాన్ని SP శాస్త్రోక్తంగా ప్రారంభించారు. సిబ్బంది శారీరక దృఢత్వంపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు SP సురేందర్ రావు, ASP మౌనిక, తదితరులు ఉన్నారు.

March 11, 2026 / 07:04 PM IST

పీయూలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

MBNR: పాలమూరు యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉమెన్ సెల్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి వీసీ ప్రొఫెసర్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేశ్ బాబు హాజరై మాట్లాడారు. ప్రతి పురుషుని విజయం వెనుక స్త్రీ ఉంటుందని, ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కొనియాడారు.

March 11, 2026 / 07:03 PM IST

‘రాజ్యసభలో సమస్యలను బలంగా ప్రస్తావించాలి’

RR: రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యుడిగా విజయవంతంగా సేవలు అందించి, రాజ్యసభలో తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలను బలంగా ప్రస్తావించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

March 11, 2026 / 07:03 PM IST

విజేతలకు బహుమతులు అందించిన ఎమ్మెల్యే

NGKL: అచ్చంపేట రాజీవ్-ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన ‘సీవీకే ఆల్ స్టార్ ప్రీమియర్ లీగ్’ క్రికెట్ టోర్నమెంట్ బుధవారంతో ముగిసింది. ఫైనల్ మ్యాచ్ అనంతరం విజేతలకు ఎమ్మెల్యే వంశీకృష్ణ బహుమతులు ప్రధానం చేశారు. యువతలో క్రీడా స్ఫూర్తి పెరగాలని, అచ్చంపేట స్టేడియంలో అన్ని రకాల వసతులు కల్పిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.

March 11, 2026 / 07:02 PM IST

‘ఉచిత వైద్య శిబిరం.. సద్వినియోగం చేసుకోండి’

NRPT: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం ఊట్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు డాక్టర్ సంతోషి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ శిబిరంలో గైనకాలజీ, డెంటల్, కంటి, ఎముకల, చిన్నపిల్లల వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 11, 2026 / 07:02 PM IST

గురుకులాన్ని సందర్శించిన బక్కి వెంకటయ్య

SDPT: అల్వాల ఎక్స్ రోడ్డు వద్ద గల పీఎం శ్రీ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య బుధవారం సందర్శించారు. విద్యార్థులు ఆయనకు మార్చ్ పాస్ట్‌తో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన, నాణ్యతతో పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

March 11, 2026 / 07:01 PM IST

ఘనంగా పోచమ్మ తల్లి బోనాల జాతర

కరీంనగర్ నగరంలోని 30వ డివిజన్ కిసాన్ నగర్‌లో మున్నూరు అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మతల్లి బోనాల జాతర జరిగింది. ప్రజల ఆహ్వానం మేరకు నగర మేయర్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తితో బోనాలు సమర్పించారు.

March 11, 2026 / 07:01 PM IST

ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన జానకి రామ్ రెడ్డి

RR: తలకొండపల్లి పోలీస్ స్టేషన్ ఇన్‌సెక్టర్ ఆఫ్ పోలీస్‌గా జానకి రామ్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ.. శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేస్తామని, ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసులకు తెలియజేయవచ్చని సూచించారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని, అసాంఘిక కార్యక్రమాలు, అక్రమ బెల్ట్ షాపులపై ఉక్కు పాదం మోపుతామన్నారు.

March 11, 2026 / 07:00 PM IST

‘మానసిక ఒత్తిడికి లోనవ్వకుండా పరీక్షలు రాయాలి’

BHNG: పదో తరగతి విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవ్వకుండా ఆత్మస్థైర్యంతో బోర్డు పరీక్షలు రాయాలని ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా నాయకుడు దూపటి వెంకటేష్ సూచించారు. బుధవారం ఆలేరులోని ఏకశిల స్కూల్లో ఎస్ఎఫ్ఐ ఆలేరు మండల కమిటీ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన టాలెంట్ టెస్ట్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.

March 11, 2026 / 06:55 PM IST

కేజీబీవీని సందర్శించిన తహసీల్దార్

NRML: దస్తురాబాద్‌లోని కేజీబీవీని తహసీల్దార్ కనక యాదవ్ రావ్ ఆకస్మికంగా ఇవాళ సందర్శించారు. పాఠశాల తరగతి గదులను పరిశీలించి వంటగది, గోదామును తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి మౌలిక సౌకర్యాలపై భోజనంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గిర్దావర్ సంతోష్, జీపీవో కవిత తదితరులున్నారు.

March 11, 2026 / 06:52 PM IST

జిల్లా నుంచి కాంగ్రెస్ శ్రేణులు హాజరు కావాలి: బోడ స్వామి

NLG: కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ స్టేట్ ఛైర్మెన్‌గా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ పదవీ బాధ్యతలు చేపట్టే కార్యక్రమానికి జిల్లా నుంచి కాంగ్రెస్ శ్రేణులు హాజరు కావాలని ఆ విభాగం నల్లగొండ జిల్లా ఛైర్మెన్ బోడ స్వామి కోరారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో గురువారం సాయంత్రం గం.3 లకు జరిగే కార్యక్రమానికి విచ్చేయాలని కోరారు.

March 11, 2026 / 06:52 PM IST