NRML: దస్తురాబాద్లోని కేజీబీవీని తహసీల్దార్ కనక యాదవ్ రావ్ ఆకస్మికంగా ఇవాళ సందర్శించారు. పాఠశాల తరగతి గదులను పరిశీలించి వంటగది, గోదామును తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి మౌలిక సౌకర్యాలపై భోజనంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గిర్దావర్ సంతోష్, జీపీవో కవిత తదితరులున్నారు.