• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

నిధులు మంజూరు చేయండి: ఎమ్మెల్యే

SRD: ఖేడ్ నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధులు మంజూరు చేయాలని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి జిల్లా ఇంఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని కోరారు. ఈ మేరకు ఈరోజు హైదరాబాదులో సమావేశమై, ఎమ్మెల్యే వినతి పత్రాన్ని సమర్పించారు. ఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసే దిశగా మంత్రి సానుకూలంగా స్పందించినట్టు ఎమ్మెల్యే తెలిపారు.

March 11, 2026 / 03:28 PM IST

బొలెరో బోల్తా.. ఆరుగురికి గాయాలు

MBNR: దేవరకద్ర మండలం నాగారం స్టేజీ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం సంతలో గొర్రెలు అమ్మి తిరిగి వెళ్తుండగా బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్‌లో బాధితులను మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

March 11, 2026 / 03:27 PM IST

ఆరెగూడెంలో ప్రజా పాలన కార్యక్రమం

NLG: చిట్యాల మండలంలోని ఆరెగూడెం గ్రామంలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ పాల్గొని పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వాటర్ ట్యాంకులను, మురికి కాలువలను శుభ్రపరచారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధిలో తన వంతుగా ఎప్పుడా ముందుంటానని పేర్కొన్నారు.

March 11, 2026 / 03:26 PM IST

‘రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఆధునికీకరణకు చర్యలు చేపట్టాలి’

NZB: నిజామాబాద్ నగర నడిబొడ్డున గల రాజీవ్ గాంధీ ఆడిటోరియం, న్యూ అంబేద్కర్ భవన్‌లను ఇవాళ కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. ఈ సందర్భంగా ఆడిటోరియం హాల్, పరిసరాలను నిశితంగా పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ ఆడిటోరియంను ఆధునికీకరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

March 11, 2026 / 03:25 PM IST

మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

MHBD: మహబూబాబాద్ మున్సిపల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ పరిసరాలు, రికార్డులను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మున్సిపల్ కార్యాలయ పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ అన్నారు.

March 11, 2026 / 03:21 PM IST

గిరిజన పాఠశాలలో ఉచిత నేత్ర శిబిరం

BDK: పినపాక మండలం చిర్రమళ్ళ గిరిజన ఆశ్రమ పాఠశాలలో వంద రోజుల హెల్త్ మిషన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున బుధవారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థులకు సైట్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో సిబ్బంది వారికి వివరించారు. కంటి చూపు మెరుగు పడటానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలో తగు జాగ్రత్తలు సూచించారు.

March 11, 2026 / 03:20 PM IST

ఆలయ అభివృద్ధి దాతలకు సన్మానం

పెద్దపల్లి ఎల్లమ్మ చెరువు వద్ద గల కట్ట మైసమ్మ ఆలయానికి బాకం ఓం ప్రకాష్ సుమలత దంపతుల సహకారంతో చేపట్టిన స్టీల్ రీలింగ్ నిర్మాణ పనులను మున్సిపల్ ఛైర్మన్ నూగిళ్ళ మల్లయ్య ఇవాళ ప్రారంభించారు. కట్ట మైసమ్మ దీవెనలు దాతలు, పట్టణ ప్రజలపై ఉండాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఛైర్మన్ ఓం ప్రకాష్ దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

March 11, 2026 / 03:20 PM IST

కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

ADB: బెజ్జూర్ మండలంలోని సులుగుపల్లి గ్రామ సర్పంచ్ చిన్నయ్య, ఉప సర్పంచ్ గోవర్ధన్, పలువురు బీఆర్ఎస్ నాయకులు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, MLC విటల్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమానికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు.

March 11, 2026 / 03:19 PM IST

విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి: హెచ్ఎం

MHBD: తొర్రూరు మండలంలోని వెలికట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇవాళ పదవ తరగతి విద్యార్థుల ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీను బాబు మాట్లాడుతూ… పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించి, పాఠశాలకు, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు.

March 11, 2026 / 03:14 PM IST

‘గ్రామాల్లో ‘ప్రగతి ప్రణాళిక’ విజయవంతం కావాలి’

NRML: జిల్లా లక్ష్మణచందా మండలం పొట్టపల్లి (కె)లో “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక”ను కలెక్టర్ అభిలాష అభినవ్ పరిశీలించారు. స్వయంగా పారిశుద్ధ్య పనుల్లో పాల్గొన్న ఆమె, 99 రోజుల కార్యాచరణలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. గ్రామంలో త్వరలో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని, పాఠశాల మరమ్మత్తులు చేపడతామని ఆమె భరోసా ఇచ్చారు.

March 11, 2026 / 03:14 PM IST

‘కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి’

JN: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు విస్తృతంగా తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు అన్నారు. రామచందర్ రావును స్టేట్ కౌన్సిల్ మెంబర్ పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, నేతలు కలిశారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కాసేపు రాష్ట్ర అధ్యక్షుడితో నేతలు క్షుణ్ణంగా చర్చించారు.

March 11, 2026 / 03:10 PM IST

డోంగ్లీ మార్కెట్‌లో తగ్గిన కందుల ధర..!

KMR: డోంగ్లీ, మద్నూర్ మండలాల అడత్ మార్కెట్‌లో బుధవారం కందుల ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం క్వింటాకు రూ.7,950 ధర పలుకుతోందని అడత్ వ్యాపారులు తెలిపారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సైతం మద్దతు ధర దాదాపు రూ. 8,000 ఉండటంతో, రైతులు తమ పంటను విక్రయించేందుకు ఆసక్తి చూపడం లేదు. రానున్న రోజుల్లో ప్రైవేటు మార్కెట్‌లో ధరలు పెరుగుతాయన్నారు.

March 11, 2026 / 03:10 PM IST

కొమ్మాల హుండీలో నేపాల్ కరెన్సీ

WGL: గీసుకొండ (M) కేంద్రంలోని ప్రసిద్ధ కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ లెక్కింపులో నేపాల్ దేశానికి చెందిన రూ. 5 కరెన్సీ నోటు హుండీలో లభించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు, అర్చకుల సమక్షంలో పారదర్శకంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

March 11, 2026 / 03:06 PM IST

లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలి: MLA

MBNR: ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని విద్యార్థులు ముందుకు సాగాలని మహబూబ్ నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బోయపల్లి రోడ్డులో ఉన్న IIIT కళాశాలలో ప్రత్యేక ఉచిత శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గడిచిన పది సంవత్సరాల కాలంలో విద్యా రంగాన్ని ఎవరు పట్టించుకోలేదన్నారు.

March 11, 2026 / 03:05 PM IST

శబ్దాలతోకూడిన సైలెన్సర్ బైకులు సీజ్

కరీంనగర్ నగరంలో మితిమీరిన శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న బుల్లెట్ వాహనాలపై పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం కఠిన చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు మార్చి, ‘ఫైర్’ శబ్దాలతో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న ఆకతాయిల వాహనాలను ఆయన స్వయంగా తనిఖీ చేశారు. ఈ మేరకు అధిక శబ్దం చేస్తున్న పలు బైక్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌‌కు తరలించారు.

March 11, 2026 / 03:05 PM IST