KMR: డోంగ్లీ, మద్నూర్ మండలాల అడత్ మార్కెట్లో బుధవారం కందుల ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం క్వింటాకు రూ.7,950 ధర పలుకుతోందని అడత్ వ్యాపారులు తెలిపారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సైతం మద్దతు ధర దాదాపు రూ. 8,000 ఉండటంతో, రైతులు తమ పంటను విక్రయించేందుకు ఆసక్తి చూపడం లేదు. రానున్న రోజుల్లో ప్రైవేటు మార్కెట్లో ధరలు పెరుగుతాయన్నారు.