WGL: కేసముద్రం అంగన్వాడి సెంటర్‌లో ఆరోగ్య లక్ష్మి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అల్లం రమ నాగేశ్వర్ రావు పాల్గొని మాట్లాడుతూ.. మూడేళ్లు పైబడిన చిన్నారులందరినీ అంగన్వాడి కేంద్రానికి పంపించాలని సూచించారు. చిన్నారులను పౌష్టిక ఆహారంతో పాటు, ఆట పాటలతో, క్రమశిక్షణతో కూడిన విద్యా అందించాలని తెలిపారు.
KMR: జిల్లా పోలీస్ స్టేషన్లలో పారదర్శక సేవలు అందించడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర స్పష్టం చేశారు. సెక్షన్ ఇంఛార్జ్‌ల శిక్షణలో ఆయన మాట్లాడుతూ.. బాధితులకు సకాలంలో న్యాయం అందాలని, ప్రజలతో మర్యాదగా మెలగాలని (సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్) సూచించారు. విధుల్లో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, సమయపాలన పాటించాలని ఆయన పోలీసు సిబ్బందిని ఆదేశించారు.
WGL: నర్సంపేట డిపో నుంచి శ్రీశైలం, మహానంది, బనగానపల్లె, యాగంటి, అలంపూర్ జోగులాంబ అమ్మవారి శక్తి పీఠం & స్వర్ణగిరి దర్శనాల కొరకు సూపర్ లగ్జరి బస్సు ఈ నెల 13న బయలుదేరనున్నట్లు డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. టికెట్ ధర ఒక్కరికి రూ.2500 ఉంటుంది అన్నారు. 3రోజుల ప్రయాణం ఉంటుందని, బుకింగ్ కోసం 9704644543 సంప్రదించాలన్నారు.
VKB: తాళం వేసిన ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడిన ఘటన తాండూరు పట్టణం సాయిపూర్‌లో బుధవారం చోటుచేసుకుంది. ఇంటి యజమాని కుమ్మరి అంజలయ్య బంధువుల వివాహం ఉందని వారం రోజులు వెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలోని 9 గ్రాముల బంగారం, 10 తులాల వెండి, రూ.50,000ల నగదును దొంగలించారని ఇంటి యజమాని తెలిపాడు.
SRCL: తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ నాయకులు హైదరాబాదులో సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డితో కలిసి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను మంగళవారం కలిశారు. మండలంలోని నీటి కొత్త సమస్యలు పరిష్కరించాలని కోరామన్నారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని వివరించారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
SRD: గుమ్మడిదల మండలం బొంతపల్లి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బుధవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఘట్టం ఎల్లయ్య కళాకారుల బృందం యక్షగానం ప్రదర్శించారు. మయసభ నాటకంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ లోక్ భవన్‌లో రాష్ట్ర నూతన గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్య క్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇందులో పాల్గొన్న శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
KMM: హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో జరిగిన తెలంగాణ నూతన గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకార మహోత్సవంలో Dy.CM మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. సుదీర్ఘ అనుభవం కలిగిన శుక్లా మార్గదర్శకత్వం తెలంగాణ అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు.
NZB: నవీపేట్ మండలం కోస్లీ గ్రామపంచాయతీ కార్యాలయంలో నలుగురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను బుధవారం అందజేశారు. సెక్రటరీ రాజేశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జీపీవో సుభాష్, సర్పంచ్ బాబు సింగ్, ఉపసర్పంచ్ సందీప్ పాల్గొన్నారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సాయం ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు.
MBNR: చిన్న చింతకుంట మండలంలోని దమాగ్నాపూర్ గ్రామంలో బుధవారం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని పలు గ్రామాల ప్రజలు కలిసి తమ సమస్యలను విన్నవించారు. అనంతరం బండ్రవల్లి గ్రామానికి చెందిన స్వతంత్ర వార్డు సభ్యుడు గోపాల్, రాజు చారి, రామచంద్రయ్యలతో పాటు అప్పరాల గ్రామానికి చెందిన న్యాయవాది నాగిరెడ్డి తదితరులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
SRPT: తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని 7, 8వ వార్డుల్లో బుధవారం ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ ఛైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి అన్నారు. అనంతరం ఆయా వార్డుల్లో మురికి కాల్వలను పరిశుభ్రం చేసి పిచ్చి మొక్కలను తొలగించారు.
NGKL: ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో మిషన్ భగీరథతో పూర్తిస్థాయిలో శుద్ధి చేసిన తాగునీటినే సరఫరా చేయాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన కల్వకుర్తిలోని 60 ఎంఎల్డీ సామర్థ్యం గల నీటి శుద్ధి కేంద్రాన్ని సందర్శించి పనితీరును పరిశీలించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
NLG: చిట్యాల మండలం వనిపాకలలో స్నేహితుడి జ్ఞాపకార్ధంగా.. పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పూర్వ విద్యార్థి 2014-15 బ్యాచ్‌కు చెందిన పీక మధు జ్ఞాపకార్థం, మిత్ర బృందం టెన్త్ విద్యార్థులకు బుధవారం పరీక్ష ప్యాడ్స్, పెన్నులు, జామెట్రీ బాక్సులను పంపిణీ చేశారు. మధు కుటుంబ సభ్యులు సత్యనారాయణతో పాటు మిత్రులు మధు, రాకేష్, సాయి, శివాజీ పాల్గొన్నారు.
ADB: విగ్రహాల ప్రతిష్టాపనతో గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుందని బోథ్ MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. బుధవారం బజార్ హత్నూర్ మండలంలోని గంగాపూర్ గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భక్తి మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు.
KMR: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ జడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి భౌతిక కాయానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ నివాళులర్పించారు. తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న ఆయన, మృతదేహాన్ని పరిశీలించి నివాళులు అర్పించారు. అనంతరం మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.