• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ప్రైవేట్ హాస్పిటల్స్ తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో

కరీంనగర్ పట్టణంలోని పలు ప్రైవేట్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్‌లు, అల్ట్రా సౌండ్ కేంద్రాలను డీఎంహెచ్‌వో అధికారి డాక్టర్ వెంకటరమణ, జిల్లా హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ అథారిటీ తనిఖీ బృంద సభ్యులతో కలిసి నిన్న తనిఖీ చేశారు. జిల్లాలోని అన్ని ప్రైవేటు హాస్పిటల్స్ & నర్సింగ్ హోమ్ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం-2010 ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలని సూచించారు.

February 20, 2026 / 08:02 AM IST

‘ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి’

పెద్దపల్లి పట్టణంలోని మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ధర్మారం, అంతర్గాం, ఎలిగేడు, జూలపల్లి, రామగిరి, ముత్తారం, మంథని మండలాల నూతనంగా ఎన్నికైన సర్పంచులకు రెండో విడత శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి DPO వీర బుచ్చయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన నూతన సర్పంచులకు సూచించారు.

February 20, 2026 / 08:02 AM IST

ప్రజలతో మమేకమై ఉంటా: కౌన్సిలర్

RR: షాద్‌నగర్ పట్టణ పదవ వార్డు కౌన్సిలర్ శ్రావణిని సీఎస్కే విల్లాస్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలతో మమేకమై ఉంటూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళతానన్నారు.

February 20, 2026 / 08:01 AM IST

నేడు సీజ్ చేసిన వాహనాలు వేలం

NRML: వివిధ ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన వాహనాలను శుక్రవారం వేలం వేస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి రజాక్ తెలిపారు. ఈ వేలం పాట నిర్మల్‌లోని ఎక్సైజ్ కార్యాలయ ఆవరణలో జరుగుతుందని వెల్లడించారు. ఆసక్తి గల వారు ఉదయం 10 గంటలకు హాజరై వేలంలో పాల్గొనాలని ఆయన సూచించారు.

February 20, 2026 / 07:54 AM IST

ఏసీబీ వలలో విద్యాశాఖ సూపరింటెండెంట్‌

HYD: పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ సూపరింటెండెంట్‌తో పాటు రంగారెడ్డి DEO కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ ACB అధికారులకు చిక్కారు. CBSE గుర్తింపునకు సంబంధించి (NOC) ఇచ్చేందుకు రూ. 70 వేలు లంచం డిమాండ్‌ చేయగా, ఆ నగదును స్వీకరిస్తుండగా అధికారులు వారిని పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్‌ చేసి నాంపల్లిలోని ACB కోర్టులో హాజరుపరిచారు. 

February 20, 2026 / 07:44 AM IST

ఉచిత వైద్య శిబిరం విజయవంతం

MBNR: జడ్చర్ల మండలం మాచారం గ్రామంలోని తెలంగాణ గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ విజయమాధురి విద్యార్థులకు హెల్త్ చెక్ అప్ నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థులు రోగాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

February 20, 2026 / 07:43 AM IST

నేటి నుంచి సీఎం కప్ క్రీడలు ప్రారంభం

HNK: తెలంగాణ రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలు శుక్రవారం Jawaharlal Nehru Stadiumలో ప్రారంభమవుతున్నట్లు డీవైఎస్‌వో అశోక్ కుమార్ తెలిపారు. ఈ క్రీడల్లో రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి సుమారు 1,518 మంది అథ్లెటిక్స్ క్రీడాకారులు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. పోటీల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు చెప్పారు.

February 20, 2026 / 07:42 AM IST

నీలాద్రిశ్వర స్వామి ఆలయానికి పెరిగిన ఆదాయం

KMM: పెనుబల్లి మండలంలోని నీలాద్రీశ్వరస్వామి ఆలయ మహాశివరాత్రి జాతర ఆదాయం రూ. 31,18,011 వచ్చినట్లు ఈవో రజనీకుమారి తెలిపారు. భక్తుల కానుకల ద్వారా రూ. 11.20 లక్షలు, బహిరంగ వేలం, ఇతర సేవల ద్వారా మిగిలిన ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆదాయం రూ. 3,54,245 పెరిగిందని అధికారులు వెల్లడించారు. భక్తుల తాకిడి పెరగడంతో ఆదాయం గణనీయంగా పెరిగిందని ఆమె పేర్కొన్నారు.

February 20, 2026 / 07:42 AM IST

రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు జనగాం విద్యార్థినులు

JN: జిల్లా తరిగొప్పుల, స్టేషన్ ఘనపూర్ మండలం పల్లగుట్టకు చెందిన విద్యార్థినులు రాష్ట్ర స్థాయి సీఎం కప్ కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా స్థాయిలో స్వర్ణ పతకాలు సాధించిన ఈ క్రీడాకారిణులను గురువారం కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ పింకేష్ కుమార్, జీసీడీవో గౌసియా బేగం ప్రత్యేకంగా అభినందించారు.

February 20, 2026 / 07:42 AM IST

శివాజీ శోభాయాత్రకు పటిష్ఠ పోలీస్ బందోబస్తు

NRPT: శివాజీ మహారాజ్ శోభాయాత్రకు పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ లింగయ్య తెలిపారు. గురువారం నారాయణపేటలో నిర్వహించిన శోభాయాత్రలో పోలీస్ బందోబస్తును పరిశీలించారు. శోభాయాత్ర జరిగే గణేష్ మార్గ్ గుండా పోలీసులను మోహరించినట్లు చెప్పారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

February 20, 2026 / 07:42 AM IST

ఇసుక ట్రాక్టర్లు సీజ్.. నలుగురిపై కేసు నమోదు

MHBD: నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి శివారు ఆకేరు వాగు నుంచి అక్రమంగా తరలిస్తున్న 3 ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి, నలుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై చిర్రా రమేష్ బాబు తెలిపారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక తరలించినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

February 20, 2026 / 07:38 AM IST

అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనం పట్టివేత

ASF: అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనాన్ని జైనూర్ పోలీసులు పట్టుకున్నారు. జైనూర్ నుంచి పశువులను అక్రమ రవాణా చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు జామ్ గాం వద్ద పోలీసులు తనిఖీలు చేసి పశువులను తరలిస్తున్న ఐచర్ వ్యాన్‌ను పట్టుకున్నారు. ఈ దాడిలో 23 పశువులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రవి తెలిపారు. పశువులను తరలిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేసి నట్లు పేర్కొన్నారు.

February 20, 2026 / 07:36 AM IST

‘యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడా దుస్తుల పంపిణి’

MHBD: జిల్లా గంగారాం మండలం వెంకమ్మగుంపు గ్రామానికి చెందిన క్రీడాకారులకు శుక్రవారం ఉదయం యువ ఫౌండేషన్ సభ్యులు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ.. మారుమూల ఏజెన్సీగుడాలలో మంచి క్రీడానైపుణ్యం కలిగిన యువకులు ఉన్నారని, వారిని ప్రోత్సహించిన ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు. యువతతోనే ఏజెన్సీఅభివృద్ధి సాధ్యమన్నారు.

February 20, 2026 / 07:33 AM IST

సిద్దిపేట ఐటీ హబ్‌లో ఉద్యోగ అవకాశాలు

SDPT: ఐటీ హాబ్ మేనేజర్ నరేందర్ గౌడ్ మహిళా అభ్యర్థులకు సువర్ణావకాశం ప్రకటించారని తెలిపారు. హైదరాబాద్ సోలార్ కంపెనీలో ఉద్యోగాల కోసం 50% మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు, హిందీ భాషలో ప్రావీణ్యం ఉన్నవారు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 20వ తేదీ వరకు https://forms.gle /AoKByEro8EvtckD67 దరఖాస్తు చేసుకోవాలన్నారు.

February 20, 2026 / 07:32 AM IST

గంజాయి కేసులో 20 ఏళ్లు జైలు శిక్ష

SRD: గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ ఇద్దరికి 20 ఏళ్లు జైలు శిక్ష, రూ.2 లక్షల చొప్పున జరిమానా విధించారు. ఈ మేరకు సంగారెడ్డి ఫస్ట్ క్లాస్ అడిషనల్ సెషన్స్ కోర్ట్ న్యాయమూర్తి జయంతి గురువారం తీర్పు వెలువరించారని అందోలు ఎక్సైజ్ స్టేషన్ సీఐ సాగర్ రెడ్డి తెలిపారు. 2020 సెప్టెంబరులో 850 కేజీల గంజాయిని జాదవ్ బన్సీలాల్, రాథోడ్ శంకర్ రవాణా చేస్తుండగా పట్టుకున్నారు.

February 20, 2026 / 07:30 AM IST