• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

చెస్ పోటీల ద్వారా మేధాశక్తి పెంపొందుతుంది: ఎమ్మెల్యే

JGL: చెస్ పోటీల ద్వారా మేధాశక్తి పెంపొందుతోందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ పురాతన ఉన్నత పాఠశాల విద్యార్థులకు బుధవారం గ్రేటర్ అట్లంట తెలంగాణ సొసైటీ, చెస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో చెస్ బోర్డులను పంపిణీ చేశారు. విద్యార్థులు చెస్ పోటీల్లో రాణించి జగిత్యాలకు పేరు తీసుకురావాలన్నారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ వాణి, తదితరులు పాల్గొన్నారు.

March 11, 2026 / 01:18 PM IST

‘మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి’

MNCL: జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో రూ. స30 లక్షల నిధులతో మూడు మహిళా సంఘ భవనాలకు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి కృషి చేస్తోందని తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు.

March 11, 2026 / 01:17 PM IST

ముప్కాల్‌లో ఘనంగా మహిళా దినోత్సవం

NZB: ముప్కాల్ మండల కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. స్థానిక కస్తూర్భా మహిళా మండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా పోలీసు సిబ్బందిని మరియు మహిళా సంఘాల నేతలను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళా సాధికారత, సమాజ అభివృద్ధిలో వారి కీలక పాత్రపై చర్చించారు.

March 11, 2026 / 01:16 PM IST

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో పాల్గొన్న ఎమ్మెల్యే

NGKL: నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలోని 8వ వార్డులో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి బుధవారం పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం వార్డులోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్ కౌన్సిలర్ పాల్గొన్నారు.

March 11, 2026 / 01:15 PM IST

తస్కానిగూడెంలో ‘ప్రజాపాలన – పారిశుద్ధ్య’ కార్యక్రమం

NLG: చండూరు తస్కానిగూడెంలో ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. పారిశుద్ధ్య కార్మికుల సహకారంతో వార్డుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. గ్రామ పరిశుభ్రతపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రాంబాబు, గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేశారు.

March 11, 2026 / 01:15 PM IST

‘కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు’

MHBD: కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి పట్టుకొమ్మలు అని BRS జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవిత అన్నారు. క్యాంపు ఆఫీసులో కార్యకర్తలు, ప్రజా సమస్యలను కవిత అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు విస్తృతంగా తీసుకెళ్తూ.. రాబోయే అన్ని ఎన్నికల్లో గులాబీ జెండా గెలుపు కోసం కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

March 11, 2026 / 01:15 PM IST

మిషన్ భగీరథ త్రాగునీరు అందించాలని విజ్ఞప్తి

NLG: చింతపల్లి మండలం రాయినిగూడెం గ్రామానికి గత నాలుగు రోజులుగా మిషన్ భగీరథ త్రాగునీరు సరఫరా నిలిచిపోయిందని గ్రామస్థులు బుధవారం తెలిపారు. ప్రైవేట్ వాటర్ ప్లాంట్లను ఆశ్రయించి నీటిని కొనుగోలు చేసి దాహార్తిని తీర్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నారు.

March 11, 2026 / 01:14 PM IST

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి: మున్సిపల్ ఛైర్మన్

SRPT: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని మున్సిపల్ ఛైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి అన్నారు. బుధవారం తిరుమలగిరిలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా కౌన్సిలర్లతో కలిసి మొక్కలు నాటి మాట్లాడారు. మొక్కలు మానవ మనుగడకు జీవనాధారం అన్నారు. నాటిన మొక్కలను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

March 11, 2026 / 01:13 PM IST

రేపు పాలకుర్తిలో మహిళా దినోత్సవ వేడుకలు

JN: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈనెల 12న వేట ఫౌండర్, చైర్మన్ ఝాన్సిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మండలంలోని శ్రీ సోమేశ్వర్ కల్యాణ మండపంలో ఉ.9:00 గం.కు జరిగే ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పాలకుర్తి MLA యశస్విని రెడ్డి హాజరుకానున్నారు. మహిళల సాధికారత, వారి ప్రతిభను ప్రోత్సహించే వివిధ కార్యక్రమాలు ఉండనున్నాయి.

March 11, 2026 / 01:12 PM IST

గోడౌన్‌లను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్

KMM: నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్‌లోని గోడౌన్‌లను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు ఆకస్మికంగా బుధవారం తనిఖీ చేశారు. గోడౌన్‌లలో నిల్వ చేస్తున్న సన్న బియ్యాన్ని పరిశీలించి వాటి నాణ్యతను, రేషన్ దుకాణాలకు సరఫరా చేయాల్సిన బియ్యం సరిగ్గా ఉందా లేదా అని తనిఖి చేశారు. బియ్యం నిల్వల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

March 11, 2026 / 01:12 PM IST

పెండింగ్‌లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలి: MPO

NRML: కుబీర్ మండలం శివుని తండా గ్రామపంచాయతీని MPO అష్టం భీమేష్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ పంచాయతీ కార్యాలయం, రికార్డులను తనిఖీ చేశారు. గ్రామంలోని నర్సరీని సందర్శించారు. శ్మశాన వాటిక పనులను పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు.

March 11, 2026 / 01:10 PM IST

విద్యార్థులతో చెత్త శుభ్రం.. తల్లిదండ్రుల ఆగ్రహం

PDPL: జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో వివాదం చోటుచేసుకుంది. పాఠశాల పైకప్పుపై ఉన్న చెత్తను ఐదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులతో ఉపాధ్యాయులు శుభ్రం చేయించారని స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులపై ఉన్నతధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

March 11, 2026 / 01:08 PM IST

జిల్లాలో టోర్నమెంట్ నిర్వహించడం వినూత్న ఆలోచన

BDK: భద్రాచలం సమీపంలోని మేడువాయి గ్రామంలోని డా. పాల్–రాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్‌లో భద్రాద్రి యువ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భద్రాద్రి యువ T-10 మెగా యాక్షన్ క్రికెట్ టోర్నమెంట్ 4వ రోజు ఉత్సాహభరితంగా కొనసాగింది. బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు టోర్నమెంట్ మ్యాచ్‌ను వీక్షించారు. టోర్నమెంట్ నిర్వహించడం వినూత్న ఆలోచన అని అన్నారు.

March 11, 2026 / 01:08 PM IST

ఆదివాసి సమావేశానికి తరలి వెళ్లిన పాలకుర్తి నేతలు

JN: హైదరాబాద్ గాంధీభవన్‌లో నేడు నిర్వహించబోయే ఆదివాసి కాంగ్రెస్ సమావేశానికి హాజరయ్యేందుకు పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేతలు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. కొడకండ్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సురేష్ నాయక్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందన్నారు. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ పెద్దపీట వేస్తుందని చెప్పారు.

March 11, 2026 / 01:05 PM IST

పదో తరగతి పరీక్షలకు పూర్తి ఏర్పాట్లు పూర్తి: MEO

BHPL: ఈనెల 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు రేగొండ MEO ప్రభాకర్ ఇవాళ తెలిపారు. మండలంలో మొత్తం 2 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ZPHS రంగయ్యపల్లిలో 120 మంది, ZPHS రేగొండలో 220 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. మొత్తం 340 మంది విద్యార్థలు పరీక్షలు రాయనున్నట్లు MEO ప్రభాకర్ వెల్లడించారు.

March 11, 2026 / 01:05 PM IST