• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఘనంగా ఛత్రపతి శంభాజీ మహారాజ్ వర్ధంతి

NGKL: కల్వకుర్తి పట్టణంలో శంభాజీ యువసేన ఆధ్వర్యంలో ఛత్రపతి శంభాజీ మహారాజ్ 337వ వర్ధంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. శంభాజీ చిత్రపటానికి యువసేన నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 1689లో తీవ్రమైన మొఘల్ హింసను ధిక్కరించి ధర్మం, స్వరాజ్యం కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేశాడని వారు గుర్తు చేశారు.

March 11, 2026 / 12:30 PM IST

ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి మహీంద్రా సంస్థ తోడ్పాటు

SRD: హద్నూర్ ప్రభుత్వ పాఠశాలలో మహీంద్రా సంస్థ సౌజన్యంతో రూ.17 లక్షల వ్యయంతో నిర్మించిన మరుగుదొడ్లు, వంటశాల గదిని సర్పంచ్ ప్రవీణ్, ఎంఈవో మారుతీ రాథోడ్ కలిసి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తమ సంస్థ తోడ్పాటునందిస్తుందని మహీంద్రా జీఎం అనిల్ కుమార్ తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలను మరిన్ని చేపట్టాలని, సంస్థ తరఫున కృషి చేస్తామని తెలిపారు.

March 11, 2026 / 12:29 PM IST

రోడ్డుపై విద్యుత్ స్తంభం.. పొంచి ఉన్న ప్రమాదం

వనపర్తి పట్టణ పరిధిలోని హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఇనుప స్తంభం రోడ్డుకు అంచున ఉంది. రోడ్డు అతి సమీపంలో ఉండడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వెంటనే విద్యుత్ అధికారులు చొరవ చూపి విద్యుత్ స్తంభం తొలగించే అంశంపై సమీక్ష చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

March 11, 2026 / 12:29 PM IST

రైతులకు వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేసిన మంత్రి

SDPT: కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతుల ప్రభుత్వమని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం రైతులకు మంజూరైన వివిధ వ్యవసాయ పనిముట్లను వ్యవసాయ అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.

March 11, 2026 / 12:24 PM IST

సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

MDCL: 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా అల్వాల్‌లోని హై టెన్షన్ రోడ్‌పై సుమారు 2 కిలోమీటర్ల మేర కొనసాగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి పరిశీలించారు. మే నెలాఖరు నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించారు.

March 11, 2026 / 12:24 PM IST

అమీర్‌పేట్ మెట్రో- పంజాగుట్ట X రోడ్ వరకు భారీ ట్రాఫిక్

HYD: అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ నుంచి పంజాగుట్ట X రోడ్స్ వరకు వాహనాల రద్దీ అధికంగా ఉంది. ట్రాఫిక్ కదలిక చాలా నెమ్మదిగా సాగుతోందని నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ మార్గంలో ప్రయాణించేవారు సమయానికి చేరలేకపోవచ్చని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని పోలీసులు సూచించారు. డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలు నడపాలని, ట్రాఫిక్ సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.

March 11, 2026 / 12:20 PM IST

అమీర్‌పేట్ మెట్రో- పంజాగుట్ట X రోడ్ వరకు భారీ ట్రాఫిక్

HYD: అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ నుంచి పంజాగుట్ట X రోడ్స్ వరకు వాహనాల రద్దీ అధికంగా ఉంది. ట్రాఫిక్ కదలిక చాలా నెమ్మదిగా సాగుతోందని నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ మార్గంలో ప్రయాణించేవారు సమయానికి చేరలేకపోవచ్చని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని పోలీసులు సూచించారు. డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలు నడపాలని, ట్రాఫిక్ సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.

March 11, 2026 / 12:20 PM IST

లక్ష్యం ఉంటేనే విజయం తథ్యం: కలెక్టర్

JN: లక్ష్యం ఉంటేనే విజయం తథ్యమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను బుధవారం సందర్శించి మాట్లాడారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణను పరిశీలించారు. 6, 8, 9, 10వ తరగతి గదుల్లో జరుగుతున్న బోధన విధానాన్ని గమనించి, విద్యార్థులతో మాట్లాడారు. ఇలాంటి ఇబ్బందులు ఉన్న వారికి తెలియజేయాలన్నారు.

March 11, 2026 / 12:18 PM IST

GHMC పరిధిలో జనగణనపై ఉన్నత స్థాయి సమీక్ష

HYD: GHMC పరిధిలో జనగణన ప్రక్రియపై నోడల్ ఆఫీసర్ భారతి హోలీకేరి (IAS) ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. GHMC కమిషనర్, జోనల్ కమిషనర్లు పాల్గొన్న ఈ భేటీలో.. ప్రతి ఇంటికి వెళ్లి కచ్చితమైన జనాభా వివరాలు సేకరించాలని ఆదేశించారు. అధికారులకు రెండు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చిన అనంతరం క్షేత్రస్థాయిలో జనగణన ప్రారంభం కానుంది.

March 11, 2026 / 12:17 PM IST

GHMC పరిధిలో జనగణనపై ఉన్నత స్థాయి సమీక్ష

HYD: GHMC పరిధిలో జనగణన ప్రక్రియపై నోడల్ ఆఫీసర్ భారతి హోలీకేరి (IAS) ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. GHMC కమిషనర్, జోనల్ కమిషనర్లు పాల్గొన్న ఈ భేటీలో.. ప్రతి ఇంటికి వెళ్లి కచ్చితమైన జనాభా వివరాలు సేకరించాలని ఆదేశించారు. అధికారులకు రెండు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చిన అనంతరం క్షేత్రస్థాయిలో జనగణన ప్రారంభం కానుంది.

March 11, 2026 / 12:17 PM IST

రైతు కుటుంబాలకు నీరు అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకే తలమానికమైన సీతారామ ప్రాజెక్టు ద్వారా నకిరిపేట పరిధిలోని దోమల వాగును అనుసంధానం చేస్తూ మినీ రిజర్వాయర్ నుంచి తూము ద్వారా దిగువకు బుధవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నీరు విడుదల చేశారు. సుమారు ఎనిమిది వందల ఎకరాల గల వ్యవసాయ భూములకు రైతు కుటుంబాలకు నీరు అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.

March 11, 2026 / 12:16 PM IST

ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం

KNR: వివాదాలను పెంచుకుంటూ శత్రుత్వమే పెరుగుతుందని, రాజీ పడితే ఇద్దరు గెలిచినట్లేనని కేశవపట్నం ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు. వివిధ కేసులతో కోర్టు చుట్టూ తిరుగుతున్న వారు ఈనెల 13న నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు, గొడవలు, మోసపూరిత ఒప్పందాలు, భూతగాదాలు, కేసులపై రాజీ పడితే రాజా మార్గమన్నారు.

March 11, 2026 / 12:10 PM IST

కోతుల బెడదతో ప్రజల ఇక్కట్లు

ఆసిఫాబాద్‌లో కోతుల బెడదతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోతులు గుంపులుగా తిరుగుతూ ఇళ్లపైకి ఎక్కి ఆహార పదార్థాలను దొంగిలించడం, ఇంటి వద్ద ఆడుతున్న చిన్నపిల్లలను భయపెట్టడం వంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. రోజురోజుకీ కోతుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

March 11, 2026 / 12:10 PM IST

‘MLA పాయల్ శంకర్ అసత్య ప్రచారాలు మానుకోవాలి’

ADB: ఆదిలాబాద్ MLA పాయల్ శంకర్ కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న అసత్య ప్రచారాలు సరైనవి కావని గుడిహత్నూర్ మండల PACS మాజీ ఛైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గణేష్, మాధవ్ అన్నారు. మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశమై మాట్లాడారు. స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రైతు భరోసా నిధులకు జాప్యం జరిగిందని పేర్కొన్నారు.

March 11, 2026 / 12:10 PM IST

ధూమపానం ఆరోగ్యానికి హానికరం అంటూ వేషధారణతో ప్రచారం

SRPT: ధూమపానం ఆరోగ్యానికి హానికరమంటూ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సామాజికవేత్త ప్రభాకర్ బుధవారం ‘నేషనల్ నో స్మోకింగ్ డే’ సందర్భంగా సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ వద్ద ప్రజలకు అవగాహన కల్పించారు. ధూమపానం సేవించడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్, మరియు శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు.

March 11, 2026 / 12:09 PM IST