SGR: పంచాయతీ కార్మికుల మూడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా ఇంఛార్జ్ పంచాయతీ అధికారి జానకి రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు రహమాన్ మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికులకు మూడు నెలల వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వెంటనే అధికారులు స్పందించి వేతనాలు చెల్లించాలని కోరారు.
MHBD: BRS MLC తక్కళ్లపల్లి రవీందర్ మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు వాసుదేవరావు (ఆశన్న)ను కలిశారు. ప్రస్తుత సామాజిక, రాజకీయ పరిస్థితులపై వారు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. సీనియర్ జర్నలిస్ట్ అశోక్, అంతర్జాతీయ జల నిపుణులు డా.బిక్షం గుజ్జా తదితరులున్నారు. అరణ్యాన్ని వీడి జనజీవనస్రవంతిలోకి వచ్చిన ఆశన్నతో సమావేశం అవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
KMM: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి-ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు మడుపల్లి గ్రామంలో అభివృద్ధి పనులను 5వ వార్డు కౌన్సిలర్ వేమిరెడ్డి లక్ష్మీ తులసి చేపట్టారు. గ్రామ అభివృద్ధి, పరిశుభ్రత, ప్రజలకు సౌకర్యవంతమైన రహదారులు కల్పించాలనే లక్ష్యంతో గ్రామంలోని శుభ్రపరిచే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కౌన్సిలర్ తెలిపారు.
ADB: అంగన్వాడీల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. నేరడిగొండ మండలంలోని అంగన్వాడీలు ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. అంగన్వాడీ టీచర్ల ద్వారానే ప్రీ ప్రైమరీ బోధన కొనసాగించాలన్నారు. కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.
SRPT: హుజుర్నగర్ రామస్వామి గుట్టలో నిర్మిస్తున్న 2,160 సింగిల్ బెడ్ రూమ్ మోడల్ హౌసింగ్ కాలనీలో పాఠశాల, కమ్యూనిటీ హాల్, అంగన్వాడి, షాపింగ్ కాంప్లెక్స్ వంటి మౌలిక సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ విషయం రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు.
SRPT: హుజుర్నగర్ రామస్వామి గుట్టలో నిర్మిస్తున్న 2,160 సింగిల్ బెడ్ రూమ్ మోడల్ హౌసింగ్ కాలనీలో పాఠశాల, కమ్యూనిటీ హాల్, అంగన్వాడి, షాపింగ్ కాంప్లెక్స్ వంటి మౌలిక సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ విషయం రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు.
MBNR: మిడ్జిల్ మండలం రాణిపేటలో ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ మాధవి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలోని చెత్తాచెదారం, పాత వస్తువులను తొలగించి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. పారిశుద్ధ్యానికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని ఆమె తెలిపారు.
MLG: ఈనెల 14 నుంచి తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో పరీక్షలకు సంబంధించి జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు DEO సిధార్ధరెడ్డి చెప్పారు. 102 పాఠశాలల నుంచి 3290 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని, వీరిలో 1696 మంది బాలురు, 1594 బాలికలు ఉన్నారన్నారు. 20 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసామని, నిర్భయంగా పరీక్షలు రాయాలన్నారు.
KNR: గంగాధర మండలంలోని రంగరావుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో బుధవారం సర్పంచ్ దాసరి శంకరయ్య ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా పశు పెంపకందారులు తమ పశువులకు టీకాలు వేయించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. సర్పంచ్ శంకరయ్య మాట్లాడుతూ.. పశువుల ఆరోగ్యంపై రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
MNCL: బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం 491 మంది అర్హులను గుర్తించినట్లు MRO కృష్ణ బుధవారం తెలిపారు. మొత్తం 160 ఇళ్లకు గానూ, ప్రస్తుతం 108 ఇళ్లను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయనున్నారు. అర్హుల జాబితాను మున్సిపల్ కార్యాలయ నోటీస్ బోర్డులో ప్రదర్శించామన్నారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే 7 రోజుల్లోగా రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు.
GDWL: జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక ‘పై గురువారం ఒకరోజు జిల్లా స్థాయి ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. స్థానిక సంస్థల బలోపేతం, పాలనలో పారదర్శకత లక్ష్యంగా ఈ శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు.
NZB:పెరిగిన రైలు సర్వీసులతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైల్వేగేట్ల వద్ద వాహనదారులకు ఇబ్బందులు తప్పడంలేదు. వాటి స్థానంలో ఆర్వోబీ, ఆర్యూబీ నిర్మాణాలు చేపట్టాలని ఇందల్వాయి, సిర్నాపల్లి, డిచ్పల్లి, కామారెడ్డి తదితర ప్రాంతాల్లో అధికారులు గతంలో సర్వే పూర్తి చేశారు. కానీ ఇంతవరకు ముందడుగు పడకపోవడంతో ప్రయాణికులు నిత్యం అవస్థలు పడాల్సి వస్తోంది.
SDPT: కోహెడ మండలంలోని తంగళ్లపల్లిలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తాగునీటి ట్యాంకుల క్లోరినేషన్ చేపట్టారు. సర్పంచ్ బోయిని సంపత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రపరిచి క్లోరిన్ కలిపి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పెద్దపల్లి పట్టణంలోని కునారం రోడ్ పబ్లిక్ టాయిలెట్ల వద్ద ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం మున్సిపల్ ఛైర్మన్ నూగిళ్ల మల్లయ్య మొక్కలు నాటారు. చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలన్నారు. స్వచ్ఛ పెద్దపల్లిగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
KMM: అట్టడుగు స్థాయి ఉనికిని బలోపేతం చేయడానికి ఖమ్మం జిల్లా కమిటీని నియమిస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ప్రకటించింది. జిల్లా కన్వీనర్‌గా స్వర్ణ సుబ్బారావు, కో కన్వీనర్‌గా పసుమర్తి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా గంధం పుల్లయ్య, సభ్యులుగా రవి కుమార్, నరసింహారావు, నవీన్, సూర్యదేవర సంగమేశ్వర ప్రసాద్, మురళిలను నియమించారు.