• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

నిరుపేద ఆడబిడ్డ పెళ్లికి ఆసరాగా ఓఆర్కే ఫౌండేషన్

NRML: ఖానాపూర్ పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన కిష్టయ్య, లక్ష్మీ దంపతుల కుమార్తె అధితకు ఈ మధ్య వివాహం జరుగనుంది. ఈ నేపథ్యంలో వారిది నిరుపేద కుటుంబం కావడంతో విషయం తెలుకున్న ఓఆర్కే ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఒడ్డె పెల్లి కృష్ణం రాజు బుధవారం వారి స్వగృహానికి వెళ్లి పెళ్ళికొసం రూ. 5 వేలు, ఒక క్వింటాలు బియ్యాన్ని బహుమతిగా అందజేశారు.

March 11, 2026 / 02:36 PM IST

ముప్పిరెడ్డిపల్లిలో ప్రజా ప్రణాళిక పరిశీలన

MDK: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలో వాటర్ ట్యాంక్లు క్లీనింగ్ క్లోరినేషన్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడివో ప్రీతి రెడ్డి పాల్గొని పనులు పరిశీలించారు. అనంతరం గ్రామంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజానర్సింహా పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు.

March 11, 2026 / 02:36 PM IST

సర్పంచులకు ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’పై అవగాహన

జగిత్యాల: జిల్లా కలెక్టరేట్‌లో బుధవారం సర్పంచ్లకు 99 రోజుల “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక”పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ యాక్షన్ ప్లాన్ ద్వారా గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని అధికారులు సూచించారు. ఈ శిక్షణలో పెగడపల్లి మండల సర్పంచ్‌లు పాల్గొని, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అవగాహన పొందారు.

March 11, 2026 / 02:35 PM IST

జనగామ అభివృద్ధికి సహకరించాలని వినతి

JN: రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నరేందర్ రెడ్డిని జనగామ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ కొమ్మూరి ప్రతాపరెడ్డి, నేతలు కలిశారు. జనగామ నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను రాజ్యసభ సభ్యుడికి ప్రతాపరెడ్డి వివరించి జనగామ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

March 11, 2026 / 02:35 PM IST

‘విజయవంతంగా ముగిసిన శిక్షణ’

BHNG: చౌటుప్పల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కుట్టుమిషన్, ఎంబ్రాయిడరీ శిక్షణ మొదటి బ్యాచ్‌కు ముగిసింది. ఈ మేరకు మున్సిపల్ ఛైర్మన్ మొగుదాల పావని రమేష్, స్వామి రామానంద తీర్థ, సంస్థ డైరెక్టర్ విహారి కృష్ణ మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. మహిళా సాధికారతకు ఇలాంటి శిక్షణలు ఎంతో అవసరమని ఛైర్మన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

March 11, 2026 / 02:34 PM IST

’40 మందికి హెల్త్ ప్రొఫైల్ పరీక్షలు’

PDPL: ధర్మారం మండలం మేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతిరోజు సుమారు 40 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ‘హెల్త్ ప్రొఫైల్’ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి డాక్టర్ సుస్మిత ఇవాళ తెలిపారు. ఈనెల 8న ప్రారంభమైన ప్రత్యేక వైద్య శిబిరం 31 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. కావున మండలంలోని మహిళలు అందరూ వినియోగించుకోవాలని సూచించారు.

March 11, 2026 / 02:33 PM IST

స్పా సెంటర్‌పై పోలీసుల దాడి!

RR: భాగ్యనగర్ కాలనీలో గల ‘చామ్ వెల్నెస్’ స్పా సెంటర్‌పై సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడి చేశారు. స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు అందిన పక్కా సమాచారంతో పోలీసులు ఈ సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ దాడిలో నిర్వాహకులు దివ్య, సంగీత, జయప్రకాష్‌లతో పాటు 6 మహిళలను, 1 విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నరు.

March 11, 2026 / 02:32 PM IST

కంటైనర్ టీ స్టాళ్లను తొలగించొద్దని నిరసన

JN: మహిళలను వ్యాపారవేత్తలుగా ప్రోత్సహించే ప్రభుత్వ లక్ష్యాలకు విరుద్ధంగా జనగామలో వనిత టీ స్టాళ్ల తొలగింపులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ బాధిత మహిళలు, సీపీఎం నాయకులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. గతంలో కలెక్టర్ రిజ్వాన్ భాషా కేటాయించిన కంటైనర్ టీ స్టాళ్లను అధికారులు తొలగించడం తగదని, వెంటనే నిలిపివేయాలని 3వ వార్డు కౌన్సిలర్ జ్యోతి డిమాండ్ చేశారు.

March 11, 2026 / 02:31 PM IST

‘అంజన్న ఆశీర్వాద యాత్ర’

KNR: గన్నేరువరం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు తిప్పర్తి నికేశ్ ఆధ్వర్యంలో మండల సమావేశం జరిగింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 14న ఉదయం 6 గంటలకు మహాశక్తి దేవాలయం కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు పాదయాత్ర జరుగుతుందని తెలిపారు. కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొంటారని తెలిపారు.

March 11, 2026 / 02:30 PM IST

ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని వినతి

GDWL: అయిజలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేసి అగ్ని ప్రమాదాల నివారణకు సహకరించాలని 4వ వార్డ్ కౌన్సిలర్ జ్యోతి పేర్కొన్నారు. బుధవారం మున్సిపల్ ఛైర్మన్ సీఎం సురేష్, వైస్ ఛైర్మన్ నరసింహులు, కమిషనర్ సైదులును కలిసి వినతిపత్రం ఇచ్చారు. గద్వాల రోడ్డులోని సర్వేనెంబర్ 65లో ఉన్న ప్రభుత్వ భూమిలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తే అనువుగా ఉంటుందన్నారు.

March 11, 2026 / 02:30 PM IST

అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన సర్పంచ్

WGL: చెన్నారావుపేట మండలం నౌషతాండ సర్పంచ్ భూక్య ఉమ మోహన్ నాయక్ మాణిక్య తండా అంగన్వాడీ సెంటర్‌ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత, పరిశుభ్రత, మెనూ అమలు విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. వయస్సుకు తగ్గట్టు బరువు, ఎత్తు ఉండాలన్నారు.

March 11, 2026 / 02:29 PM IST

ఆరోగ్య లక్ష్మి కార్యక్రమంలో పాల్గొన్న వైస్ చైర్ పర్సన్

WGL: కేసముద్రం అంగన్వాడి సెంటర్‌లో ఆరోగ్య లక్ష్మి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అల్లం రమ నాగేశ్వర్ రావు పాల్గొని మాట్లాడుతూ.. మూడేళ్లు పైబడిన చిన్నారులందరినీ అంగన్వాడి కేంద్రానికి పంపించాలని సూచించారు. చిన్నారులను పౌష్టిక ఆహారంతో పాటు, ఆట పాటలతో, క్రమశిక్షణతో కూడిన విద్యా అందించాలని తెలిపారు.

March 11, 2026 / 02:28 PM IST

పోలీస్ సేవల్లో పారదర్శకతే లక్ష్యం: ఎస్పీ

KMR: జిల్లా పోలీస్ స్టేషన్లలో పారదర్శక సేవలు అందించడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర స్పష్టం చేశారు. సెక్షన్ ఇంఛార్జ్‌ల శిక్షణలో ఆయన మాట్లాడుతూ.. బాధితులకు సకాలంలో న్యాయం అందాలని, ప్రజలతో మర్యాదగా మెలగాలని (సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్) సూచించారు. విధుల్లో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, సమయపాలన పాటించాలని ఆయన పోలీసు సిబ్బందిని ఆదేశించారు.

March 11, 2026 / 02:27 PM IST

నర్సంపేట నుంచి శ్రీశైలంకు సూపర్ లగ్జరి బస్సు

WGL: నర్సంపేట డిపో నుంచి శ్రీశైలం, మహానంది, బనగానపల్లె, యాగంటి, అలంపూర్ జోగులాంబ అమ్మవారి శక్తి పీఠం & స్వర్ణగిరి దర్శనాల కొరకు సూపర్ లగ్జరి బస్సు ఈ నెల 13న బయలుదేరనున్నట్లు డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. టికెట్ ధర ఒక్కరికి రూ.2500 ఉంటుంది అన్నారు. 3రోజుల ప్రయాణం ఉంటుందని, బుకింగ్ కోసం 9704644543 సంప్రదించాలన్నారు.

March 11, 2026 / 02:26 PM IST

దొంగలు బీభత్సం.. బంగారం మాయం

VKB: తాళం వేసిన ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడిన ఘటన తాండూరు పట్టణం సాయిపూర్‌లో బుధవారం చోటుచేసుకుంది. ఇంటి యజమాని కుమ్మరి అంజలయ్య బంధువుల వివాహం ఉందని వారం రోజులు వెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలోని 9 గ్రాముల బంగారం, 10 తులాల వెండి, రూ.50,000ల నగదును దొంగలించారని ఇంటి యజమాని తెలిపాడు.

March 11, 2026 / 02:25 PM IST