• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ధూమపానం ఆరోగ్యానికి హానికరం అంటూ వేషధారణతో ప్రచారం

SRPT: ధూమపానం ఆరోగ్యానికి హానికరమంటూ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సామాజికవేత్త ప్రభాకర్ బుధవారం ‘నేషనల్ నో స్మోకింగ్ డే’ సందర్భంగా సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ వద్ద ప్రజలకు అవగాహన కల్పించారు. ధూమపానం సేవించడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్, మరియు శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు.

March 11, 2026 / 12:09 PM IST

పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే

KMM: వైరా మున్సిపాలిటీలో ’99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ గారు చురుగ్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వార్డుల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను స్వయంగా పర్యవేక్షించి, పట్టణ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యంగా ఈ ప్రణాళిక కొనసాగుతుందని తెలిపారు.

March 11, 2026 / 12:08 PM IST

ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేత

KMM: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు సత్తుపల్లి పట్టణంలో ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి బుధవారం ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేశారు. ముస్లిం సోదరులకు రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సీఎం ఈ మంచి తోఫాను ప్రజలకు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు.

March 11, 2026 / 12:08 PM IST

దానం ఎంపీగా పోటీ చేసింది కనపడలేదా: BRS

HYD: ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ పార్టీ మారారని వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ డిస్మిస్ చేశారని BRS నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ బీ ఫామ్‌పై సికింద్రాబాద్ ఎంపీగా దానం పోటీ చేసినా స్పీకర్‌కు కనపడలేదా, పార్టీ మారారనటానికి ఇంతకు మించిన ఆధారాలు కావాలా అని ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు.

March 11, 2026 / 12:07 PM IST

సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన

NLG: గుడిపల్లి మండలం సింగరాజుపల్లి, కోదండాపురం గ్రామాలలో రూ.20లక్షలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బాలునాయక్ అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో రాజీ పడకుండా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.

March 11, 2026 / 11:59 AM IST

‘కేసీఆర్‌కు క్షమాపణలు చెబితే రాజీనామాకు సిద్ధం’

WGL: పార్టీ ఫిరాయింపుల కేసులో MLA కడియంకి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై స్పందించిన కడియం.. మాజీ సీఎం KCRకు సవాల్ విసిరారు. ఫిరాయింపుల విషయంలో కేసీఆర్ క్షమాపణలు చేబితే రాజీనామాకు సిద్ధమన్నారు. ‘స్పీకర్ తీర్పును స్వాగతిస్తున్నా. నాపై వేసిన పిటిషన్లు చట్టబద్ధం కావు. పార్టీ పరంగా ఎందుకు పిటిషన్ వేయలేదని KCRను ప్రశ్నిస్తున్నా’ అని పేర్కొన్నారు.

March 11, 2026 / 11:57 AM IST

‘కేసీఆర్‌ క్షమాపణలు చెబితే రాజీనామాకు సిద్ధం’

WGL: పార్టీ ఫిరాయింపుల కేసులో MLA కడియంకి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై స్పందించిన కడియం.. మాజీ సీఎం KCRకు సవాల్ విసిరారు. ఫిరాయింపుల విషయంలో కేసీఆర్ క్షమాపణలు చేబితే రాజీనామాకు సిద్ధమన్నారు. ‘స్పీకర్ తీర్పును స్వాగతిస్తున్నా. నాపై వేసిన పిటిషన్లు చట్టబద్ధం కావు. పార్టీ పరంగా ఎందుకు పిటిషన్ వేయలేదని KCRను ప్రశ్నిస్తున్నా’ అని పేర్కొన్నారు.

March 11, 2026 / 11:57 AM IST

ఎమ్మెల్యేను సన్మానించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులు

NGKL: అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణను బుధవారం అచ్చంపేట పట్టణంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ప్రజాసేవ చేస్తున్నందుకు అభినందిస్తూ ఈ సన్మానం చేసినట్లు క్లబ్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపిరెడ్డి, రఘుపతి రెడ్డి, యాదయ్య గౌడ్, భరత్, రాజు, ప్రశాంత్ రెడ్డి, జూలూరి సురేశ్, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

March 11, 2026 / 11:56 AM IST

కమిషనరేట్ పరిధిలో 89 కేసులు నమోదు

WGL: వరంగల్ కమిషనరేట్ పరిధిలో మంగళవారం రాత్రి ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ &తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ట్రాఫిక్ విభాగంలో అత్యధికంగా 54 కేసులు, సెంట్రల్ జోన్‌లో 18, వెస్ట్ జోన్‌లో 11, ఈస్ట్ జోన్‌లో 6 కేసులు నమోదయ్యాయి. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, జైలు శిక్ష తప్పదని పోలీసులు హెచ్చరించారు.

March 11, 2026 / 11:55 AM IST

క్రీడా పోటీలను ప్రారంభించిన అంతర్జాతీయ కోచ్

SRD: సంగారెడ్డి పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మైదానంలో కబడ్డీ పోటీలను అంతర్జాతీయ కోచ్ శ్రీనివాస్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. కబడ్డీ ఆడుతున్న విద్యార్థులతో కరచాలనం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ పాల్గొన్నారు.

March 11, 2026 / 11:55 AM IST

తూము ద్వారా నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే

BDK: బూర్గంపాడు మండలం నకిరేపేట పరిధిలోని దోమల వాగును సీతారామ ప్రాజెక్ట్‌కు అనుసంధానం చేస్తూ మినీ రిజర్వాయర్‌గా తీర్చిదిద్దేలా ఎమ్మెల్యే పాలెం వెంకటేశ్వర్లు ఇవాళ తూము ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నకిరేపేట నుంచి వేపలగడ్డ వరకు సుమారు 800 ఎకరాల వ్యవసాయ భూమికి నీరు అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.

March 11, 2026 / 11:54 AM IST

‘మహబూబ్‌నగర్‌లో డ్రైనేజీ సమస్యలు ఉండకూడదు’

MBNR: మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో డ్రైనేజీ సమస్యలు ఉండకూడదని డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని 47, 48 డివిజన్లో డిప్యూటీ మేయర్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఈ, ఏఈతో మాట్లాడుతూ.. సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

March 11, 2026 / 11:52 AM IST