KMM: వైరా మున్సిపాలిటీలో ’99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ గారు చురుగ్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వార్డుల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను స్వయంగా పర్యవేక్షించి, పట్టణ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యంగా ఈ ప్రణాళిక కొనసాగుతుందని తెలిపారు.