NLG: గుడిపల్లి మండలం సింగరాజుపల్లి, కోదండాపురం గ్రామాలలో రూ.20లక్షలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బాలునాయక్ అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో రాజీ పడకుండా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.