MBNR: కారు, బైకు ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలైన సంఘటన భూత్పూర్ మండలంలో జాతీయ రహదారి(44)పై అర్ధరాత్రి జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కర్నూల్‌కు చెందిన పరశురాం, హుస్సేన్ టైల్స్ మేస్త్రీలు పని చేస్తున్నారు. అన్నాసాగర్ గ్రామంలో పని ముగించుకుని జడ్చర్లకు బైక్‌పై వెళ్తుండగా వెనక నుంచి కారు ఢీకొట్టి వెళ్ళిపోయింది. బైక్ పైనుంచి కింద పడడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.