ATP: జిల్లాలోని రైతులకు అన్నదాత సుఖీభవ మూడో విడత, పీఎం కిసాన్ 22వ విడత నిధులు మంజూరయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 2,75,642 మంది రైతులకు మొత్తం ₹163.26 కోట్ల నిధులు ఈనెల 13వ తేదీన రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఇందులో సింగనమల నియోజకవర్గానికి అత్యధికంగా ₹31.52 కోట్లు, కళ్యాణదుర్గానికి ₹30.27 కోట్లు కేటాయించారు.