సత్యసాయి: వైసీపీ15 వసంతాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా హిందూపురంలో నేడు వేడుకలు నిర్వహించనున్నారు. నియోజకవర్గ ఇంచార్జ్ టీఎన్ దీపిక ఆధ్వర్యంలో ఉదయం 9:30 గంటలకు పార్టీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ జరగనుంది. అనంతరం 10 గంటలకు పరిగి బస్ స్టాండ్ కూడలిలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు.