• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘పశువుల ఆరోగ్యంపై రైతులు అప్రమత్తంగా ఉండాలి’

KNR: గంగాధర మండలంలోని రంగరావుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో బుధవారం సర్పంచ్ దాసరి శంకరయ్య ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా పశు పెంపకందారులు తమ పశువులకు టీకాలు వేయించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. సర్పంచ్ శంకరయ్య మాట్లాడుతూ.. పశువుల ఆరోగ్యంపై రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

March 11, 2026 / 11:44 AM IST

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం 491 మంది అర్హుల గుర్తింపు

MNCL: బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం 491 మంది అర్హులను గుర్తించినట్లు MRO కృష్ణ బుధవారం తెలిపారు. మొత్తం 160 ఇళ్లకు గానూ, ప్రస్తుతం 108 ఇళ్లను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయనున్నారు. అర్హుల జాబితాను మున్సిపల్ కార్యాలయ నోటీస్ బోర్డులో ప్రదర్శించామన్నారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే 7 రోజుల్లోగా రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు.

March 11, 2026 / 11:38 AM IST

రేపు సర్పంచులు, కౌన్సిలర్లకు శిక్షణ కార్యక్రమం

GDWL: జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక ‘పై గురువారం ఒకరోజు జిల్లా స్థాయి ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. స్థానిక సంస్థల బలోపేతం, పాలనలో పారదర్శకత లక్ష్యంగా ఈ శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు.

March 11, 2026 / 11:37 AM IST

ఉమ్మడి జిల్లా రైల్వే గేట్ల వద్ద నిత్యం ట్రాఫిక్ కష్టాలు

NZB:పెరిగిన రైలు సర్వీసులతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైల్వేగేట్ల వద్ద వాహనదారులకు ఇబ్బందులు తప్పడంలేదు. వాటి స్థానంలో ఆర్వోబీ, ఆర్యూబీ నిర్మాణాలు చేపట్టాలని ఇందల్వాయి, సిర్నాపల్లి, డిచ్‌పల్లి, కామారెడ్డి తదితర ప్రాంతాల్లో అధికారులు గతంలో సర్వే పూర్తి చేశారు. కానీ ఇంతవరకు ముందడుగు పడకపోవడంతో ప్రయాణికులు నిత్యం అవస్థలు పడాల్సి వస్తోంది.

March 11, 2026 / 11:35 AM IST

తాగునీటి ట్యాంకుల క్లోరినేషన్ పనులు ప్రారంభం

SDPT: కోహెడ మండలంలోని తంగళ్లపల్లిలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తాగునీటి ట్యాంకుల క్లోరినేషన్ చేపట్టారు. సర్పంచ్ బోయిని సంపత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రపరిచి క్లోరిన్ కలిపి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

March 11, 2026 / 11:30 AM IST

‘స్వచ్ఛ పెద్దపల్లికి ప్రజల సహకారం అవసరం’

పెద్దపల్లి పట్టణంలోని కునారం రోడ్ పబ్లిక్ టాయిలెట్ల వద్ద ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం మున్సిపల్ ఛైర్మన్ నూగిళ్ల మల్లయ్య మొక్కలు నాటారు. చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలన్నారు. స్వచ్ఛ పెద్దపల్లిగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

March 11, 2026 / 11:29 AM IST

ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా నూతన కమిటీ నియామకం

KMM: అట్టడుగు స్థాయి ఉనికిని బలోపేతం చేయడానికి ఖమ్మం జిల్లా కమిటీని నియమిస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ప్రకటించింది. జిల్లా కన్వీనర్‌గా స్వర్ణ సుబ్బారావు, కో కన్వీనర్‌గా పసుమర్తి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా గంధం పుల్లయ్య, సభ్యులుగా రవి కుమార్, నరసింహారావు, నవీన్, సూర్యదేవర సంగమేశ్వర ప్రసాద్, మురళిలను నియమించారు.

March 11, 2026 / 11:26 AM IST

ఖైరీగూడ OCP వద్ద AITUC ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన

MNCL: బెల్లంపల్లి ఏరియా ఖైరీగూడ ఓపెన్ కాస్ట్ వద్ద AITUC ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. 2025 సెప్టెంబర్‌లో అందజేయాల్సిన పంప్ ఆపరేటర్ల ప్రమోషన్లను యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తుందని కార్మికులు ఆగ్రహించారు. మైన్స్ స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో పలుమార్లు విన్నవించినా అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతోనే ఆందోళన చేపట్టామన్నారు.

March 11, 2026 / 11:25 AM IST

రేమద్దులలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు

వనపర్తి జిల్లాలో ఎండల తీవ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటలో నమోదైన ఉష్ణోగ్రతలను అధికారులు ప్రకటించారు. అత్యధికంగా పానగల్ మండలం రేమద్దులలో 36.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. వనపర్తి 36.4, వెలుగొండ 36.2, మదనపూర్ 35.8, రేవల్లి 35.7, వీపనగండ్ల, కన్నాయిపల్లి 35.5, గణపూర్ 35.4, గోపాల్ పేట 35.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

March 11, 2026 / 11:24 AM IST

హోటల్‌ను తనిఖీ చేసిన మున్సిపల్ పాలకవర్గం

MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో బుధవారం ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలు భాగంగా ఆరవ రోజు హోటల్‌ను మున్సిపల్ పాలకవర్గం సభ్యులు, అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని హోటల్లు, టిఫిన్ సెంటర్లలో నాణ్యత గల ఆహారాలు విక్రయించే విధంగా ఈ తనిఖీలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. హోటలలో శుభ్రత పాటించాలని సూచించారు.

March 11, 2026 / 11:23 AM IST

పలు హోటల్స్‌ను తనిఖీ చేసిన మున్సిపల్ పాలకవర్గం

MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో బుధవారం ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలు భాగంగా ఆరవ రోజు పలు హోటల్స్‌ను మున్సిపల్ పాలకవర్గం సభ్యులు, అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని హోటల్లు, టిఫిన్ సెంటర్లలో నాణ్యత గల ఆహారాలు విక్రయించే విధంగా ఈ తనిఖీలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. హోటల్‌లలో శుభ్రత పాటించాలని సూచించారు.

March 11, 2026 / 11:23 AM IST

సర్పంచ్ భర్త మృతి.. గ్రామంలో విషాద ఛాయలు

RR: షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం వెంకిర్యాల గ్రామ సర్పంచ్ భర్త జంగయ్య మృతి చెందాడు. లాల్ పాడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలవ్వగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న కొందుర్గు మండల మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ వారి పార్థివ దేహానికి నివాళులర్పించారు. జంగయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

March 11, 2026 / 11:23 AM IST

పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని సెక్స్ ఉద్యోగుల నిరసన

SRCL: పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సెస్ ఉద్యో గులు 72 గంటల విధుల బహిష్కరణ చేపట్టారు. ఈ మేరకు బుధవారం ఉదయం సిరిసిల్ల సెస్ ఆవరణలో నిరసనకు తెలిపారు. ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వాలని, కారుణ్య నియామకాలను రెగ్యులరైజ్ చేయాలని, అసిస్టెంట్ హెల్పర్ అనే పేరును జేఎల్ఎంగా మార్చాలని డిమాండ్ చేశారు.

March 11, 2026 / 11:20 AM IST

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పర్యావరణ కార్యక్రమం

జగిత్యాల పట్టణంలోని గొల్లపల్లి రోడ్ వద్ద సత్యహరిశ్చంద్ర శ్మశాన వాటికలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కల నాటకం, బెంచీల ఏర్పాటు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, మున్సిపల్ ఛైర్మన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ పాల్గొన్నారు. శ్మశాన వాటికకు వచ్చే ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు బెంచీలు ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.

March 11, 2026 / 11:20 AM IST

చర్లపల్లిలో నిలిచిపోయిన ఇంధన వాహనాలు

HYD: ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో చర్లపల్లిలోని హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీఎల్ సంస్థల్లో ఇంధన సరఫరా నిలిచిపోయింది. ఈమేరకు వాణిజ్య సిలిండర్ల వినియోగంపై కంపెనీలు నియంత్రణ విధిస్తున్నాయి. దీనివల్ల కమర్షియల్ గ్యాస్ సరఫరాకు అంతరాయం కలిగి హోటల్, పరిశ్రమలకు గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. దీంతో పలు ట్యాంకర్లు డిపోల వద్దే నిలిచిపోయాయి.

March 11, 2026 / 11:15 AM IST