SRD: హద్నూర్ ప్రభుత్వ పాఠశాలలో మహీంద్రా సంస్థ సౌజన్యంతో రూ.17 లక్షల వ్యయంతో నిర్మించిన మరుగుదొడ్లు, వంటశాల గదిని సర్పంచ్ ప్రవీణ్, ఎంఈవో మారుతీ రాథోడ్ కలిసి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తమ సంస్థ తోడ్పాటునందిస్తుందని మహీంద్రా జీఎం అనిల్ కుమార్ తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలను మరిన్ని చేపట్టాలని, సంస్థ తరఫున కృషి చేస్తామని తెలిపారు.