JN: కేసీఆర్ పై కడియం శ్రీహరి చేసిన దుర్మార్గ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని జనగామ MLA డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం ఆయన మాట్లాడారు. కడియం శ్రీహరి మోసం, ద్రోహం, అవకాశవాదానికి మరోపేరని విమర్శించారు. అన్ని ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే ప్రజలే అతని రాజకీయ జీవితానికి చరమగీతం పాడతారని హెచ్చరించారు.
NZB: పిల్లల చేతికి ఫోన్ ఇచ్చే ముందు తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు పాటించాలని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. చిన్నారులు ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్లో ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉంచాలని హెచ్చరించారు. లేకపోతే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడే ప్రమాదాలు ఉన్నాయన్నారు. పిల్లలకు UPI పిన్, క్రెడిట్ కార్డు వివరాలు చెప్పకూడదని అన్నారు.
WGL: పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ITI కళాశాలలో గురువారం సాయంత్రం షీ టీం RSI స్వాతి ఆధ్వర్యంలో విద్యార్థినులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. స్వాతి మాట్లాడుతూ.. మహిళలపై పెరుగుతున్న సైబర్ నేరాలు, అఘాయిత్యాలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ప్రయాణాల్లో భద్రత కోసం ‘టీ-సేఫ్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి వినియోగించాలని తెలిపారు.
BDK: అశ్వాపురం మండలం జగ్గారం గ్రామానికి చెందిన దుర్గ భవాని రాష్ట్ర స్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచి జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి దివ్యాంగుల క్రీడాపోటీల్లో లెమన్ అండ్ స్పూన్ విభాగంలో రెండవ స్థానం సాధించింది. గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆమెను అభినందించి ప్రశంస పత్రం అందజేశారు.
PDPL: ధర్మారం మండలం మల్లాపూర్ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుడు నిన్న విజ్ఞాన విహార యాత్రలకు వెళ్లారు. ఈ సందర్భంగా పాఠశాల ఇంఛార్జ్ ప్రిన్సిపాల్ అరుణ మాట్లాడుతూ.. విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం ద్వారా ప్రత్యక్ష అనుభూతి పొందుతారని తెలిపారు. విషయాలను బాగా అవగాహన చేసుకోగలుగుతారని పేర్కొన్నారు.
VKB: ఛత్రపతి శివాజీ హిందూ ధర్మ పరిరక్షణకు హిందూ సామ్రాజ్య స్థాపనకు కృషి చేసిన మహనీయుడని BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోటిగారి శివరాజ్ పేర్కొన్నారు. నిన్న వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లి హనుమాన్ దేవాలయం నుంచి వికారాబాద్ పట్టణంలోని జగ్జీవన్ రామ్ చౌరస్తా ఆంజనేయస్వామి ఆలయం వరకు శివాజీ హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు.
SRD: జిల్లా రంజాన్ మాసంలో ప్రపంచంలోని ప్రతి ముస్లీం ఐదు ప్రాతమిక విధులను తప్పనిసరిగా నిర్వహించాలని ఇమామ్ నయ్యర్ అజాం అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఇమాన్, నమాజ్, జకాత్, రోజా, హజ్ అనే విధులను విధిగా నిర్వహించాలి. ఇమాన్ భగవంతుడైన అల్లాహ్‌పై పూర్తిగా విశ్వాసం ఉంచాలని, నమాజ్, ఎనిమిదేళ్లు దాటిన వారు విధిగా 5 సార్లు నమాజ్ చేయాలని తెలిపారు.
KMM: మధిర బోడెపుడి భవన్‌లో సీపీఎం పార్టీ డివిజన్ కమిటీ సమావేశం గురువారం జరిగింది. సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు పాల్గొని మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను ప్రజలు నమ్మి స్థానిక సంస్థల ఎన్నికలలో మంచి విజయాన్ని అందించిందన్నారు. ప్రజల నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ము చేయొద్దని హితవు పలికారు.
BHPL: మొగుళ్ళపల్లి (M) వేములపల్లికి చెందిన సాత్విక్ సీఎం కప్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల BHPL జిల్లాలోని అంబేడ్కర్ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో సాత్విక్ షాట్‌పుట్, జావెలిన్ త్రో విభాగాల్లో అద్భుత ప్రదర్శన చూపించాడు. ఈ రెండు ఈవెంట్‌లలోనూ ఉత్తమ ఫలితాలతో రాష్ట్ర స్థాయికి అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు.
ADB: ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దందా మితిమీరిపోతోందని రైతు హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ యాదవ్ ఆరోపించారు. అదనపు కలెక్టర్, డీఈవో రాజేశ్వర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కరువు కాలంలో రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, ఫీజుల విషయంలో పిల్లలను ఇబ్బంది పెట్టకుండా నేరుగా తల్లిదండ్రులతోనే మాట్లాడేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
KMR: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేడు పాల్వంచ మండలంలో పర్యటించనున్నారు. మండల కేంద్రంలోని రైతు సింగిరెడ్డి బలరాం రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్న ‘ఆయిల్ పామ్ మొక్కల మాస్ ప్లాంటేషన్’ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి, ఉద్యాన అధికారి జ్యోతి హాజరుకానున్నారు.
WNP: రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆత్మకూరు వ్యవసాయ అధికారి అరవింద్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందడానికి ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని తెలిపారు. రైతులు తమ ఆధార్ కార్డులు, భూమి యాజమాన్య పాస్ పుస్తకం, ఆధార్ లింకు చేసిన మొబైల్ ఫోన్‌లో సమీపంలోని వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలని ఆయన చెప్పారు.
HYD: రంజాన్ మాసం సందర్భంగా పాతబస్తీలో షాపింగ్ స్టాల్స్ సందడిగా మారాయి. హోల్ సేల్ వస్త్రాల మార్కెట్‌గా పేరుగాంచిన మదీనాతో పాటు చార్మినార్ పరిసర ప్రాంతాలల్లో దుస్తులు, ఇతర అలంకరణ వస్తువుల కొనుగోళ్లతో షాపులకు రద్దీ పెరిగింది. చార్మినార్‌ను విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించారు.
PDPL: పెద్దపల్లి మండలం చీకురాయి గ్రామంలో సర్పంచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం కొత్త గేట్ వద్ద నుంచి పాత గేట్ వరకు రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్టు కొమ్మలను జేసీబీ సహాయంతో తొలగించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రధాన రహదారులు, రైల్వే గేట్లగుండా ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు.
SRPT: శుభకార్యానికి వెళ్లివస్తూ అదుపు తప్పి కారు పల్టీ కొట్టిన ఘటన గురువారం సాయంత్రం నడిగూడెం,ఆర్సీపురం రహదారిలో చోటుచేసుకుంది. ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్సై గంధమల్ల అజయ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.