కరీంనగర్ నగరంలో మితిమీరిన శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న బుల్లెట్ వాహనాలపై పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం కఠిన చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు మార్చి, ‘ఫైర్’ శబ్దాలతో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న ఆకతాయిల వాహనాలను ఆయన స్వయంగా తనిఖీ చేశారు. ఈ మేరకు అధిక శబ్దం చేస్తున్న పలు బైక్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.