• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘రైతు ఏడ్చిన రాజ్యం నిలవదు’

SRCL: రైతు ఏడ్చిన రాజ్యం నిలవదని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రసమయి బాలకిషన్ అన్నారు. ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్‌లో కాలేశ్వరం 11వ కాలువ పనులను పూర్తి చేయాలని ధర్నా చేస్తున్న రైతులకు ఆయన మంగళవారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాల్వపరులు పూర్తి చేయాలని నెల రోజులుగా రైతులు నిరాహార దీక్షలు చేస్తుంటే పట్టించుకునే వారే లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

March 11, 2026 / 05:01 PM IST

‘పదవ తరగతి పరీక్షలకు ఏర్పాటు పూర్తి’

JGL: ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభంకానున్న పదో తరగతి పరీక్షలకు ఇబ్రహీంపట్నం మోడల్ స్కూల్, గోదూర్ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంఈవో మధు తెలిపారు. మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, మోడల్ స్కూల్, కస్తూరిబాలో కలిపి మొత్తం 304 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

March 11, 2026 / 05:01 PM IST

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది: జగదీష్ రెడ్డి

NLG: దేవరకొండలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య సహా 400 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, పోలీస్ శాఖ కాంగ్రెస్ నేతలకు తొత్తులుగా మారిందని ఆరోపించారు. జిల్లా మంత్రులు ఉండి కూడా సాగర్, ఎస్ఎల్బీసీ కింద నీళ్లివ్వలేదని విమర్శించారు.

March 11, 2026 / 04:55 PM IST

ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

MBNR: మహబూబ్ నగర్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న కల్వకుర్తికి చెందిన రఘుకుమార్ బుధవారం మరికల్ రైల్వే స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రైలు కోసం వేచి చూసిన ఆయన, అది రాకపోవడంతో అక్కడే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించారు. గమనించిన స్థానికులు వెంటనే అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది.

March 11, 2026 / 04:53 PM IST

పాత పద్ధతినే కొనసాగించాలని మంత్రికి వినతి

WGL: మంత్రి కొండ సురేఖ ఆదేశాల మేరకు బుధవారం BC సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు TPCC చేనేత విభాగం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. మెటీరియల్ టెండర్ విధానం ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు కాంట్రాక్టులు ఇవ్వడం వల్ల సుమారు 60,000 చేనేత కుటుంబాలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో పాత పద్ధతినే కొనసాగించాలని మంత్రిని కోరారు.

March 11, 2026 / 04:52 PM IST

ఉపాధి హామీ పనులను పరిశీలించిన సర్పంచ్

BHNG: భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామ పరిధిలో జరుగుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను గ్రామ సర్పంచ్ నీల శిరీష ఓంప్రకాశ్ గౌడ్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ కింద చేపట్టిన పనులు నాణ్యతతో ఉండాలని అధికారులను, ఫీల్డ్ అసిస్టెంట్లను ఆదేశించారు.

March 11, 2026 / 04:51 PM IST

గ్రామ పంచాయతీలో పర్యటించిన జిల్లా కలెక్టర్

BDK: చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామపంచాయతీలో ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు. ముందుగా ప్రాథమిక ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను వీక్షించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.

March 11, 2026 / 04:50 PM IST

అత్యవసర సేవలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు: డీటీ

NLG: గల్ఫ్ యుద్ధంను దృష్టిలో ఉంచుకుని, చమురు సంస్థల ఏజెన్సీలు అతిగా ప్రవర్తిస్తూ అత్యవసర సేవలకు విఘాతం కలిగిస్తే, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని జిల్లా పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ రఘునందన్ హెచ్చరించారు. ప్రజలు భయాందోళనలకు గురి కావాల్సిన అవసరంలేదని ఇప్పటికే చమురు సంస్థలు స్పష్టం చేశాయని గుర్తు చేశారు.

March 11, 2026 / 04:43 PM IST

‘జిల్లాలో జన గణన విధులు పక్కాగా నిర్వహించాలి’

SRD: జిల్లాలో జన గణన విధులను పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శిక్షణ సమావేశం బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 2011లో చివరిసారిగా జనాభా గన్న జరిగిందని తెలిపారు. ఈసారి సాంకేతికతను వినియోగిస్తూ డిజిటల్ విధానంలో జనాభా లెక్కల సేకరణ జరిగేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిందని చెప్పారు.

March 11, 2026 / 04:36 PM IST

పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి: కలెక్టర్

NRML: జిల్లా పొట్టపల్లి (కె) ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ అభిలాష అభినవ్ సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించి, విద్యా ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల భవన మరమ్మత్తులను త్వరగా పూర్తి చేయాలని, మధ్యాహ్న భోజనాన్ని నాణ్యతతో అందించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల హాజరు శాతం పెంచేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

March 11, 2026 / 04:33 PM IST

అడవి జంతువుల భారీ నుంచి పంటల రక్షణకు చీరలు

JGL: ఇబ్రహీంపట్నం మండలంలో మొక్కజొన్న పంటను జంతువుల బారి నుంచి రక్షించుకోవడానికి అన్నదాతలు పంట చుట్టు చీరలను ఏర్పాటు చేస్తున్నారు. అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండే పంటలపై అడవి పందులు, కోతులు దాడి చేసి పంటను ధ్వంసం చేస్తాయి. రైతులు చీరలను ఏర్పాటు చేయడం ద్వారా అడవి జంతువులు భయపడి పంటల వద్దకు రావడం లేదని తెలిపారు. ఇందుకు పాత చీరలను రైతులు కొంటున్నారు.

March 11, 2026 / 04:32 PM IST

జనగణన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

BPHL: IDOC కార్యాలయంలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో బుధవారం జనగణనపై అధికారులతో శిక్షణ కార్యక్రమం, సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. 2027లో జరగనున్న జనగణనను రెండు దశల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి దశలో హౌసింగ్ వివరాలు సేకరించాల్సిందిగా అధికారులకు ఆదేశించారు.

March 11, 2026 / 04:31 PM IST

ఘనంగా ‘చెట్ల కోసం మహిళలు’ కార్యక్రమం

NLG: ప్రజా పాలన.. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా CDMA ఆదేశాల మేరకు, ఇవాళ నల్లగొండ పట్టణంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ‘చెట్ల కోసం మహిళలు’ కార్యక్రమంను 35వ డివిజన్‌లో ఏర్పాటు చేశారు. ఈ మేరకు మొక్కలు నాటి, చెట్ల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, అసిస్టెంట్ కమిషనర్ రవీందర్ రెడ్డి, కార్పొరేటర్ మంగమ్మ ఉన్నారు.

March 11, 2026 / 04:30 PM IST

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

KNR: తిమ్మాపూర్ మండలం మల్లాపూర్‌కు చెందిన బనక చందు అనే యువకుడు కెనాల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో హత్య జరిగి ఉండొచ్చని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

March 11, 2026 / 04:30 PM IST

పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

SDPT: కోహెడ మండలం శనిగరంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె.హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నాణ్యతపై అసహనం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం పోషకాహారం అందించాలని సిబ్బందికి హెచ్చరించారు. అనంతరం తంగళ్లపల్లి కస్తూర్బా పాఠశాలను కూడా తనిఖీ చేశారు.

March 11, 2026 / 04:29 PM IST