ADB: పోలీస్ సిబ్బందికి విధులతో పాటు మానసిక ఉల్లాసం తప్పనిసరి అని SP అఖిల్ మహాజన్ తెలిపారు. బుధవారం జిల్లాలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇండోర్ స్పోర్ట్స్ ప్రాంగణాన్ని SP శాస్త్రోక్తంగా ప్రారంభించారు. సిబ్బంది శారీరక దృఢత్వంపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు SP సురేందర్ రావు, ASP మౌనిక, తదితరులు ఉన్నారు.