SDPT: అల్వాల ఎక్స్ రోడ్డు వద్ద గల పీఎం శ్రీ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య బుధవారం సందర్శించారు. విద్యార్థులు ఆయనకు మార్చ్ పాస్ట్తో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన, నాణ్యతతో పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.