అన్నమయ్య: రాజంపేట పట్టణంలో మద్యం బార్లు ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా, తమకు తోచినప్పుడల్లా తెరుస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. చట్ట ప్రకారం నిర్దేశించిన సమయాలను పాటించడం లేదని, ఈ విషయాన్ని పలుమార్లు ఎక్సైజ్ శాఖ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని వారు పేర్కొన్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, నిబంధనలు పాటించేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.