• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కార్యకర్తలే పార్టీకి బలం: శైలజానాథ్

ATP: శింగనమల మండలం లోలూరులో ‘మన గ్రామానికి మన శైలజానాథ్’ కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ కార్యకర్తలు, నాయకులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో పథకాలు అందక ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఆయన విమర్శించారు. కేవలం రాజధాని ముసుగులో సొంతవాళ్లకు లబ్ధి చేకూరుస్తున్నారని ఆరోపించారు.

April 18, 2026 / 10:00 AM IST

‘చెత్త సేకరణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు’

అన్నమయ్య: పంచాయతీ అభివృద్ధి అధికారులందరూ శిక్షణ జరిగే సమయంలో గ్రీన్ అంబాసిడర్లతో కలిసి తప్పనిసరిగా పనిచేయాలని కడప జెడ్పీ సీఈవో రామచంద్రారెడ్డి సూచించారు. రాజంపేట మండలం కూచివారిపల్లెలో పీడీవోలకు శిక్షణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. రోజూ చెత్త సేకరించాలని ఆదేశించారు. 3 లేదా 4 రోజులకు ఒకసారి తూతూ మంత్రంగా చెత్త సేకరించి, చేతులు దులుపుకొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

April 18, 2026 / 10:00 AM IST

ఈనెల 30 నుంచి వీరాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు

W.G: మైదుకూరు సమీపంలోని కొత్తపాలెంలో ఈ నెల 30వ తేదీ నుంచి మూడు రోజులపాటు వీరాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ధర్మ కర్త సుబ్బరాయుడు తెలిపారు. 30న వీరాంజనే యస్వామికి ప్రత్యేక పూజలు, పంచామృతాభి షేకం, కుంకుమార్చన పూజలు ఉండనున్నాయి. మే 1న జిల్లా స్థాయి కోలాట ప్రదర్శన, అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించనున్నారు.

April 18, 2026 / 10:00 AM IST

స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో శ్రమదానం

ELR: జిల్లా వ్యాప్తంగా ఉన్న అని పోలీస్ స్టేషన్‌లలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ ప్రధాన కార్యాలయం చుట్టుప్రక్కల మరియు పెరేడ్ గ్రౌండ్ పోలీస్ క్వార్టర్లలో సిబ్బంది శ్రమదానం చేశారు. పనిచేసే వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని దీని కారణంగా విషజ్వరాలు వ్యాప్తి చెందకుండా ఉంటాయని వివరించారు.

April 18, 2026 / 10:00 AM IST

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

TG: HYD పంజాగుట్ట పీఎస్‌లో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి యత్నించగా.. ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యశోదా ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతుంది. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్‌లో ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 18, 2026 / 09:59 AM IST

ఆ దర్శకుడికి UV క్రియేషన్స్ సినిమా..?

‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో విజయం అందుకున్న దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ మరో ప్రాజెక్టు చేసేందుకు సిద్ధమయ్యాడు. తన రెండవ సినిమాను కూడా UV క్రియేషన్స్ బ్యానర్‌లో చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా లాక్ అయినట్లు, ఆ కథకు తగిన హీరో కోసం మూవీ బృందం వెతుకులాటను ప్రారంభించినట్లు సమాచారం. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

April 18, 2026 / 09:52 AM IST

రైతులను మోసం చేసిన వ్యాపారి అరెస్ట్

WGL: ఏనుమాముల మార్కెట్‌లో అడ్డిదారులను మోసం చేసిన గాయత్రి చిల్లీస్ కంపెనీ వ్యాపారి లడే తిరుపతిని పోలీసులు అరెస్ట్ చేశారు. 49 మంది నుంచి మిర్చి కొనుగోలు చేసి, అదే సరకును ఇతరులకు విక్రయించి సుమారు రూ. 2.5 కోట్లు మింగి పరారీలో ఉన్నాడు. ఈ నెల 2న విషయం వెలుగులోకి రావడంతో కేసు నమోదు చేశారు. దేశాయిపేట వద్ద అతడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.

April 18, 2026 / 09:51 AM IST

‘జనగణన’పై సన్నద్ధత పెంపు

BPT: ప్రభుత్వ బాధ్యతల్లో పారదర్శకత అత్యంత ముఖ్యమని తహసీల్దార్ ఎం.రవి నాయక్ అన్నారు. ప్రజలకు అందించే సేవలు స్పష్టంగా, అవినీతి రహితంగా ఉండాలని సూచించారు. ‘జనగణన’ ద్వారా జనాభా వివరాలు, సామాజిక-ఆర్థిక పరిస్థితులు తెలుసుకోవచ్చని, అభివృద్ధి ప్రణాళికలకు ఇది కీలకమని పేర్కొన్నారు. సిబ్బంది కచ్చితత్వంతో సమాచారం సేకరించి, ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని సూచించారు.

April 18, 2026 / 09:50 AM IST

చారిత్రక అద్భుతం.. నిజాంసాగర్ ప్రాజెక్ట్

KMR: మంజీరా నదిపై నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు అద్భుత ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం.1923లో నిజాంమీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో ప్రారంభమై,నవాబ్ అలీ నవాజ్ జంగ్ పర్యవేక్షణలో 1931లో ఇది పూర్తయింది. దశాబ్దాలుగా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తూ KMR జిల్లా ఆర్థిక జీవనాడిలా నిలుస్తోంది. ఇటువంటి అపురూప చారిత్రక కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది.

April 18, 2026 / 09:48 AM IST

ఈ నెల 29న మెగా జాబ్ మేళా

PLD: ఈ నెల 29న నరసరావుపేటలోని SSN కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు శుక్రవారం తెలిపారు. జాబ్ మేళాకు సంబంధించిన ఎమ్మెల్యే పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేసి ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించారన్నారు.

April 18, 2026 / 09:46 AM IST

నేడు మేడిగడ్డను సందర్శించనున్న నేతలు

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన BRS పార్టీ నేతలు నేడు కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డను సందర్శించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల పర్యటన నేపథ్యంలో స్థానిక BRS నేతలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ, ఇతర బ్యారేజిలను BRS నేతలు సందర్శించి అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు.

April 18, 2026 / 09:46 AM IST

పెట్రోల్ కష్టాలు.. ‘నో స్టాక్’ బోర్డులు

AP: కడప జిల్లా బద్వేల్‌లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని పలు పెట్రోల్ బంకుల్లో ఇంధనం కొరతతో యాజమాన్యాలు ‘నో స్టాక్’ బోర్డులు ఏర్పాటు చేశాయి. కంపెనీల నుంచి సరఫరా నిలిచిపోయిందని, అందుకే స్టాక్ లేదని నిర్వాహకులు చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్ కోసం బంకుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

April 18, 2026 / 09:46 AM IST

సోమవారం నూతన పాలకమండలి సమావేశం..!

NZB: నూతనంగా నియామకమైన తెలంగాణ విశ్వవిద్యాలయ క్లాస్ II పాలకమండలి సమావేశం ఈ నెల 20న సమావేశం కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. టీయూలో అనిశ్చితికి కొత్త పాలక మండలి ప్రక్షాళన చేపడుతుందని, అవినీతి, అక్రమాల విషయాలపై చర్చిస్తారని పలువురు మేధావులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

April 18, 2026 / 09:45 AM IST

మార్కాపురంలో ‘స్వచ్ఛాంద్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమం

మార్కాపురం పట్టణంలో శనివారం ‘స్వచ్ఛాంద్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ వెళ్లే రోడ్లో గల పరిసరాలను, కాలువలో ఉన్న చెత్తాచెదారాన్ని కలెక్టర్ ఎం.విజయ సునీత, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తొలగించారు. ఈ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యులు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

April 18, 2026 / 09:44 AM IST

భారీగా పెరిగిన నిమ్మ ధర

NLG: వేసవి నేపథ్యంలో నకిరేకల్ నిమ్మ మార్కెట్‌కు నిమ్మకాయలు భారీగా తరలివస్తున్నాయి. డిమాండ్ పెరగడంతో పచ్చికాయల బస్తా రూ.2,500 – 3,000, పండ్ల బస్తా రూ.3,000 – 3,500 వరకు పలుకుతోంది. మంచి గిట్టుబాటు ధర పలుకుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిమ్మకాయలకు ఏడాది పొడవునా ఇలాగే స్థిరమైన ధర ఉంటే తాము నష్టపోకుండా ఉంటామని రైతులు పేర్కొంటున్నారు.

April 18, 2026 / 09:42 AM IST