• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కార్యకర్తలే నా బలం: మాజీ మంత్రి

KMM: కార్యకర్తలే తన బలమని, ఏ కష్టం వచ్చినా అరగంటలో మీ ముందుకు వస్తానని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం వైరాలో నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మంతో సమానంగా వైరా నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. నాయకులు, కార్యకర్తల మధ్య బంధాన్ని బలోపేతం చేసేందుకే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

April 16, 2026 / 06:26 PM IST

180 పోస్టులు.. దరఖాస్తులు ఆహ్వానం

ముంబైలోని LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్.. దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 180 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఏదైనా ఒక నగరంలోని ఖాళీకి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అభ్యర్థులు 1996 ఏప్రిల్ 2 కంటే ముందు, 2005 ఏప్రిల్ 1 తరువాత జన్మించి ఉండకూడదు.

April 16, 2026 / 06:22 PM IST

బాలికల పాఠశాలలో చిత్రలేఖన పోటీలు

ASR: పాడేరు మండలం కందమామిడి జీటీడబ్ల్యూఏ బాలికల పాఠశాలలో ప్రపంచ కళాదినం సందర్భంగా చిత్రలేఖన పోటీలు గురువారం నిర్వహించారు. ఈ పోటీలలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు 6 నుంచి 9వ తరగతి వరకు సుమారు 30 మంది విద్యార్థినులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల్లో పాల్గొన్న అందరికీ జనపరెడ్డి అప్పారావు స్వఖర్చులతో బహుమతులు అందజేశారు.

April 16, 2026 / 06:22 PM IST

ఆవులు ఢీ కొట్టడంతో మహిళ తలకు తీవ్ర గాయాలు

మార్కాపురంలో ఆవులు పరిగెత్తుకుంటూ వచ్చి ఓ గుర్తుతెలియని మహిళను బలంగా ఢీ కొట్టడంతో మహిళ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆవుల బెడద ఎక్కువైందని పలుమార్లు వార్తా కథనాలు ఇచ్చిన.. మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంపై స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన స్థలం మున్సిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలో జరిగింది.

April 16, 2026 / 06:22 PM IST

ఇండ్లు కట్టుకోలేని వారికి ఇండ్లను నిర్మించి ఇచ్చేది కాంగ్రెస్

MBNR: ఇండ్లు కట్టుకోలేని వారికి ఇండ్లను నిర్మించి ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. ఇవాళ  హన్వాడ మండలం ఇబ్రహీంబాద్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గడచిన పది సంవత్సరాల కాలం పేదలు సొంత ఇల్లు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు.

April 16, 2026 / 06:22 PM IST

పోలీసులకు బారికేడ్లను అందజేసిన మెడికల్ ఫార్మసీ

SDPT: హుస్నాబాద్ పట్టణంలో ప్రజా సేవే లక్ష్యంగా పని చేస్తున్న హుస్నాబాద్ మెడికల్ ఫార్మసీ, తమ సంస్థ ప్రారంభమై ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సామాజిక బాధ్యతను చాటుకుంది. పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు, పోలీసుల విధుల నిర్వహణకు తోడ్పడేలా మెడికల్ ఫార్మసీ యాజమాన్యం 15 చెక్‌పోస్ట్ బారికేడ్లను స్థానిక పోలీసులకు అందజేసింది. ​

April 16, 2026 / 06:21 PM IST

‘గంజాయి వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించము’

VZM: నెల్లిమర్ల మండలంలో గంజాయి వినియోగం, రవాణా, నిల్వలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని నెల్లిమర్ల ఎస్సై గణేష్ ఇవాళ హెచ్చరించారు. గంజాయి సేవిస్తూ పట్టుబడిన పలువురు విద్యార్థులు కేసుల్లో ఇరుక్కుని కోర్టుల చుట్టూ తిరుగుతూ తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. గంజాయి వల్ల ఆర్థిక, సామాజిక, ఆరోగ్య పరమైన తీవ్ర నష్టాలు కలుగుతాయన్నారు.

April 16, 2026 / 06:21 PM IST

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్.. హైకోర్టు ఆదేశాలు

TG: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్‌ సహా 9 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు ఆదేశించింది. BRS నుంచి 9 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు.. ఈ వ్యవహారంపై స్పీకర్ సహా ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను మే 6కి వాయిదా వేసింది.

April 16, 2026 / 06:21 PM IST

తాడిపత్రి మున్సిపాలిటీలో కీచకుడు?

ATP: తాడిపత్రి మున్సిపాలిటీలో ఓ ఉన్నతాధికారి మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బాధితులు పలుమార్లు హెచ్చరించినా ఆయన తీరు మార్చుకోకపోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ కీచక పర్వంపై సమగ్ర విచారణ జరిపి, సదరు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

April 16, 2026 / 06:20 PM IST

గురు శిష్య బంధానికి నిదర్శనం ఎమ్మెల్యే పాయం

BDK: పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తనకు హైస్కూల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా విద్య నేర్పిన ఎర్రాప్రగడ రామమూర్తి ఇంటికి గురువారం సందర్శించారు. తన ఇంటికి వచ్చిన శిష్యుడిని రామమూర్తి పుష్పగుచ్చం అందించి, శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం గురువు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉప సర్పంచ్లు పాల్గొన్నారు.

April 16, 2026 / 06:20 PM IST

రాంగ్ రూట్లో వస్తే వాహనాలను సీజ్ చేయాలి: కలెక్టర్

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు రాంగ్ రూట్ ప్రయాణాలపై కఠినంగా వ్యవహరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. ఇవాళ కలెక్టరేట్లో జరిగిన రోడ్డు భద్రత సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, రేడియం పెయింటింగ్, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

April 16, 2026 / 06:20 PM IST

రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు..!

BDK: రాష్ట్ర వ్యాప్తం‌గా ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటగా, రానున్న మూడు రోజుల్లో ఇవి మరో 1 నుంచి 2 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎండలతో పాటు వడ గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఖమ్మం, మెదక్, జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యాయి.

April 16, 2026 / 06:19 PM IST

ప్రభుత్వ పథకాలలో భాగస్వాములు కావాలి: నిర్మల రెడ్డి

SRD: ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని టీజీఐసీ ఛైర్ పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. కంది లోని రైతు వేదికలో ఇవాళ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని పేర్కొన్నారు.

April 16, 2026 / 06:18 PM IST

జలాల పెంపుపై కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్‌

పల్నాడు జిల్లాలో ‘నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు. గ్రామాల్లో నీటి నిల్వలు, భూగర్భ జలాల పెంపుపై చేపట్టాల్సిన పనులపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ‘జలధార’ తరహాలో కరువు నివారణకు చర్యలు వేగవంతం చేయాలని సూచించారు.

April 16, 2026 / 06:18 PM IST

రామకోటి రామరాజు రామభక్తి అమోఘం

SDPT: భద్రాచల సీతారాముల కళ్యాణం అనంతరం అక్కడి దేవస్థానం నుండి వచ్చిన 100 కిలోల ముత్యాల తలంబ్రాలకు గజ్వేల్‌లో ఘన స్వాగతం లభించింది. శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపకులు రామకోటి రామరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఏ సంస్థకు ఇవ్వని విధంగా 100 కిలోల తలంబ్రాలను రామరాజు భక్తిని చాటుకున్నారు.

April 16, 2026 / 06:16 PM IST