NGKL: ఆర్టీసీ కార్మికుల సమ్మెతో నాగర్ కర్నూల్ జిల్లాలో రవాణా సేవలు నిలిచిపోయాయి. అర్ధరాత్రి నుంచే విధులను బహిష్కరించిన కార్మికులు, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట డిపోల ముందు ఈరోజు తెల్లవారుజామున నుంచే బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
SDPT: సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో ఏప్రిల్ 23 నుంచి మే 8 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఈ కాలంలో ర్యాలీలు, సభలు, ధర్నాలు, రాస్తారోకోలు, డీజేల వినియోగంపై నిషేధం విధించారు. ఏవైనా కార్యక్రమాలకు ఏసీపీ ముందస్తు అనుమతి తప్పనిసరని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దర్శకుడు నాగ్ అశ్విన్, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో రాబోతున్న ‘కల్కి 2’ మూవీపై ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం ఓ భారీ సెట్‌ను వేసి ఇంటర్వెల్‌ను షూట్ చేయనున్నారట. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ పాల్గొంటారని సమాచారం. కాగా, లాస్ట్ షెడ్యూల్‌లో అమితాబ్, కమల్ పాత్రలపై కీలక సన్నివేశాలను షూట్ చేశారు.
KMM: డిమాండ్ల సాధనకై సత్తుపల్లి డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు బుధవారం సమ్మెకు దిగారు. 2021, 2025 పీఆర్సీలను వెంటనే అమలు చేయాలని, ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ నినదించారు. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.
KMR: ఈ నెల 23న నిర్వహించనున్న హిందూ సమ్మేళనాన్ని పురస్కరించుకుని దేవునిపల్లిలో మంగళవారం రాత్రి భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక శివాలయం నుంచి దత్తాత్రేయ ఆలయం వరకు సాగిన ఈ ర్యాలీని మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ కాసర్ల గోదావరి, కౌన్సిలర్ వినోద పాటిల్ జెండా ఊపి ప్రారంభించారు. హిందూ కుటుంబాలన్నీ ఐక్యంగా సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.
GDWL: గద్వాల జిల్లాలోని మంగళవారం రాత్రి వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. ఈ అకాల వర్షం కొనుగోలు కేంద్రాల్లోని మొక్కజొన్న రైతులను నిలువునా ముంచేసింది. ప్రభుత్వం కేంద్రాలను ప్రారంభించినా, కొనుగోలు ప్రక్రియలో జాప్యం చేయడం వల్ల ధాన్యం రాశులు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. నేడు.. రేపు అంటూ అధికారులు కాలాన్ని వృథా చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని రైతులు వాపోతున్నారు..
SKLM: నరసన్నపేట సత్యనారాయణ నగర్‌కు చెందిన కోరాడ రామ్ చరణ్ కార్తికేయ జేఈఈ మెయిన్స్ సెషన్-2 ఫలితాల్లో జాతీయ స్థాయిలో 705వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. తండ్రి మధుసూధన స్టీల్ వ్యాపారి కాగా, తల్లి భాగ్యలక్ష్మి గృహిణి. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఐఐటీ ముంబైలో సీటు సాధించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపాడు.
SRD: బొంతపల్లి నుంచి వీరన్న గూడెం వరకు వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారి ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. వర్షాల కారణంగా రోడ్డంతా భారీ గుంతలు పడటంతో వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా పరిశ్రమల ముందున్న గుంతలు ప్రయాణాన్ని నరకప్రాయంగా మార్చాయని స్థానికులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
సత్యసాయి: పుట్టపర్తి విచ్చేసిన కేంద్ర మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి సాయి కుల్వంత్ మందిరంలోని శ్రీ సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో వచ్చిన ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శాంతిభవన్‌లో సత్యసాయి ట్రస్ట్ సభ్యుడు రత్నాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
TG: ఆదివాసీ ప్రజల్లో చైతన్యం నింపడం, వారిని ఆధునిక సమాజంతో మమేకం చేయడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గిరిజన సంక్షేమ శాఖ, పర్యాటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ కార్యక్రమంలో భాగంగా 6 ప్రత్యేక బస్సుల్లో సుమారు 250 మంది ఆదివాసీలు హైదరాబాద్‌కు బయలుదేరారు. రెండు రోజుల పాటు ఇక్కడ పర్యటించనున్నారు.
VSP: జిల్లాలో సైబర్ మోసాలపై ఎప్పటికప్పుడు పోలీసులు అవగాహన కల్గిస్తున్నారు. అయితే సైబర్ కేటుగాళ్లు మాత్రం రోజురోజుకీ రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు. ఏకంగా జీవీఎంసీ కమిషనర్ కేతాన్ గార్గ్ ఫోటోతో నకిలీ వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసి దాని ద్వారా జీవీఎంసీ అధికారులకు డబ్బులు అడుగుతున్నట్టు మెసేజ్‌లు పంపారు.
ASR: అంజలి శనివారం గ్రామానికి చెందిన లైన్‌మైన్ ఎర్రం దొర గుండెపోటుతో కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. జి. మాడుగుల మండలంలో నుర్మతి పరిధిలో లైన్‌మైన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన నర్సీపట్నం తన స్వగృహం వద్ద మంగళవారం రాత్రి ఆకస్మత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి కుటుంబానికి తీరని లోటును మిగిల్చింది.
ప్రకాశం: జరుగుమల్లి మండలం వావిలేటిపాడు వద్ద మంగళవారం రాత్రి చాతుకుపాడు గ్రామానికి చెందిన శిరోమణి అనే మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు బంగారు గొలుసు చోరీ చేశారు. వ్యక్తిగత పనులపై మహిళ ఒంగోలు వెళ్లి వస్తుండగా మార్గం మధ్యలో దొంగలు తన బంగారు గొలుసు చోరీ చేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ATP: ఏపీ ఈసెట్ పరీక్షను రేపు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా మొత్తం 7 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎస్‌ఆర్‌ఐటీ, పీవీకేకే, గేట్స్, ఎస్‌వీఐటీ, తాడిపత్రి ఇంజినీరింగ్ కళాశాలలతో పాటు అనంతపురంలోని అయాన్ టెక్ ఇన్‌ఫోసిస్ సొల్యూషన్స్‌లో ఈ పరీక్ష జరగనుందని అధికారులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పున: పంపిణీకి ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యులన్ విచారణ నిర్వహించనుంది. ఇప్పటికే తెలంగామ వాదనలు పూర్తిచేయగా.. ఏపీ వాదనలు కొనసాగుతున్నాయి. ఈ దఫాలో ఏపీ వాదనలు ముగిస్తే అనంతరం రెండు రాష్ట్రాలు రాత పూర్వక వాదనలు సమర్పించాల్సి ఉంటుంది.