• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం కుట్ర’

MNCL: ఆర్టీసీ కార్మికులు చేస్తున్న న్యాయమైన సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ ఇవాళ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

April 23, 2026 / 12:15 PM IST

రెన్యూ 3డీ ప్లాంట్‌ను సందర్శించిన సీఎం

AKP: రాంబిల్లి మండలం జెడ్. చింతువ గ్రామంలో రెన్యూ 3డీ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. అక్కడ వారికి రెన్యూ సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ ప్రతినిధులు 3డీ మోడల్ గురించి వివరించారు. అనంతరం బృందంతో కలిసి ముఖ్యమంత్రి గ్రూప్ ఫోటో దిగారు. దీనికి శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. దీని ద్వారా పలువురికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని అన్నారు.

April 23, 2026 / 12:15 PM IST

ప్రతి మహిళా నిజమైన సూపర్ ఉమెన్

కుటుంబం కోసం మగాడు బయట కష్టపడితే, గృహిణి ఇంట్లో అన్నీ తానై బాధ్యతలు మోస్తుంది. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం, వ్యక్తిగత స్వేచ్ఛను పోగొట్టుకుంటుంది. కానీ గృహిణినీ మన సమాజం చులకనగా చూస్తుంది. దీనిని కళ్లకు కట్టినట్లు చూపేలా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కుటుంబం కోసం అహర్నిశలు శ్రమించే ప్రతి మహిళా నిజమైన సూపర్ ఉమెనే.

April 23, 2026 / 12:13 PM IST

విద్యార్థులకు సంస్కారం ఎంతో ముఖ్యం: వెంకయ్యనాయుడు

AP: విశాఖలోని ఆంధ్రా వర్సిటీ వందేళ్ల ప్రస్తానాన్ని పురస్కరించుకుని బీచ్ రోడ్‌లోని AU కన్వెన్షన్ సెంటర్‌లో వేడుకలు నిర్వహించారు. ఇందులో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ పాల్గొన్నారు. కన్నతల్లి, గురువును ఎప్పుడూ మరిచిపోకూడదని వెంకయ్యనాయుడు అన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారం ఎంతో ముఖ్యమన్నారు.

April 23, 2026 / 12:12 PM IST

‘పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత’

MBNR: దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి గ్రామంలో పాలమూరు యూనివర్సిటీ పీజీ కాలేజ్ NSS యూనిట్–1 ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏడు రోజుల ప్రత్యేక వేసవికాల శిబిరం మూడవ రోజుకు చేరుకుంది. గ్రామ ప్రధాన రహదారుల పక్కన పేరుకుపోయిన చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి డంపింగ్ యార్డ్‌కు తరలించారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ లక్ష్మీ ఆంజనేయులు ప్రారంభించి మాట్లాడారు.

April 23, 2026 / 12:11 PM IST

ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే

NLG: నార్కట్‌పల్లి బస్ డిపో వద్ద జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సంఘీభావం తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ తరపున మద్దతు ప్రకటించారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఆర్టీసీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

April 23, 2026 / 12:11 PM IST

పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం

NZB: ధర్పల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ‘బడిబాట’ కార్యక్రమంలో భాగంగా ప్రధానోపాధ్యాయులు రవి రాజు మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందనీ పేర్కొన్నారు.

April 23, 2026 / 12:11 PM IST

రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు

KMR: బిబిపేట్ వాసి హెడ్ కానిస్టేబుల్ రాజనర్సయ్య (56) గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. రామారెడ్డి PSలో విధులు నిర్వహిస్తున్న ఆయన, కామారెడ్డిలో డ్యూటీ ముగించుకుని తిరిగి వెళ్తుండగా రామారెడ్డి సమీపంలోని హెచ్‌పి పెట్రోల్ పంపు వద్ద బైక్ నియంత్రణ కోల్పోయి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయినట్లు తెలిపారు.

April 23, 2026 / 12:11 PM IST

ఈనెల 29న ఎల్లమ్మ ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు

CTR: పులిచెర్ల సమీపంలోని కల్లూరు రోడ్డులో వెలసిన ఎల్లమ్మ ఆలయంలో ఈనెల 29న ఆలయ ప్రథమ వార్షికోత్సవం వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ మురళీమోహన్ రెడ్డి తెలిపారు. ఆలయంలో ఉదయం 6 గంటలకే వేడుకలు ప్రారంభమవుతాయన్నారు. ఈ వేడుకల్లో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.

April 23, 2026 / 12:10 PM IST

కేజీబీవీ ఇంటర్ విద్యార్థులను సన్మానించిన ఎమ్మెల్యే

BHNG: మోత్కూరులోని కేజీవీబీ విద్యాలయంలో ఇంటర్ ఫలితాల్లో టాపర్స్‌గా నిలిచిన విద్యార్థులను గురువారం ఎమ్మెల్యే సామేలు శాలువాలతో సన్మానించి అభినందించారు. అనంతరం ఇంటర్ ప్రథమ, దిత్వీయ సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీలో టాపర్స్‌గా నిలిచిన వారికి రూ. 5 వేల నగదు అందించారు. విద్యార్థులు కష్టపడి చదువు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

April 23, 2026 / 12:09 PM IST

తాడిగడపలో భగీరథ మహర్షి విగ్రహావిష్కరణ

కృష్ణా: పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీలో శ్రీ శ్రీ సాగర భగీరథ మహర్షి విగ్రహావిష్కరణ వేడుక గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహర్షి సందేశాలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

April 23, 2026 / 12:09 PM IST

విద్యార్థులకు HPV వ్యాక్సిన్‌పై అవగాహన

VKB: బంట్వారం మండలంలోని KGVB పాఠశాలలో గురువారం HPV వ్యాక్సిన్‌పై అవగాహన కార్యక్రమం జరిగింది. స్పెషల్ ఆఫీసర్ శైలజ ఆధ్వర్యంలో బంట్వారం PHC మెడికల్ ఆఫీసర్ మాజిద్ ఖాన్ ఈ కార్యక్రమం నిర్వహించారు. HPV వ్యాక్సిన్ తీసుకోవడంతో భవిష్యత్తులో వచ్చే ప్రమాదకర క్యాన్సర్లను ముందుగానే నివారించవచ్చని చెప్పారు.

April 23, 2026 / 12:09 PM IST

ప్రజా ప్రభుత్వంలో పేదవారి సొంతింటి కల సాకారం: ఎమ్మెల్యే

RR: షాబాద్ మండలం కొమరబండ గ్రామంలో మంగలి దీప్తి కుమార్‌కి ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యింది. నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ప్రజా ప్రభుత్వంలో పేదవారి సొంతింటి కల సాకారం అవుతుందని అన్నారు.

April 23, 2026 / 12:08 PM IST

మాజీ సీఎం నాదెండ్లకు ఎమ్మెల్యే నివాళి

NDL: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర రావు మృతి పట్ల డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇవాళ HYDలోని నాదెండ్ల నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

April 23, 2026 / 12:05 PM IST

ఐసిఎన్ ఇండియా పోటీలకు.. యువకుడు

MDK: ముంబైలో ఈ నెల 25న జరగనున్న ‘ఐసీఎన్ ఇండియా’ బాడీబిల్డింగ్ పోటీలకు  రామాయంపేట మండలం దామరచెరువుకు చెందిన దండు ప్రసాద్ సిద్ధమయ్యారు. జిమ్ ట్రైనర్ శ్రీకాంత్ వద్ద శిక్షణ పొందిన ఆయన ఇవాళ ముంబై బయలుదేరారు. జాతీయ స్థాయిలో రాణించి మండలానికి పేరు తేవాలని కోరుతూ జిమ్ సభ్యులు ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.

April 23, 2026 / 12:05 PM IST