MDK: ముంబైలో ఈ నెల 25న జరగనున్న ‘ఐసీఎన్ ఇండియా’ బాడీబిల్డింగ్ పోటీలకు రామాయంపేట మండలం దామరచెరువుకు చెందిన దండు ప్రసాద్ సిద్ధమయ్యారు. జిమ్ ట్రైనర్ శ్రీకాంత్ వద్ద శిక్షణ పొందిన ఆయన ఇవాళ ముంబై బయలుదేరారు. జాతీయ స్థాయిలో రాణించి మండలానికి పేరు తేవాలని కోరుతూ జిమ్ సభ్యులు ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.