GNTR: తెనాలి పట్టణ మాజీ కౌన్సిలర్ సూర్యదేవర సాంబశివరావు 19వ వర్ధంతి సందర్భంగా ఆయన స్మారక చిహ్నం వద్ద SSSR అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజా సేవలను గుర్తుచేసుకుంటూ, సమాజానికి చేసిన సేవలను కొనియాడారు. పలువురు నాయకులు, అభిమానులు పాల్గొని ఆయన ఆదర్శాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.
BPT: రేపల్లె పట్టణ పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా (CI) బి.అశోక్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన గత సీఐ బదిలీ కావడంతో, ఆయన స్థానంలో అశోక్ నియమితులయ్యారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని ఆయన పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
AP: మహిళా బిల్లు పార్లమెంట్ ముందుకు రావడంపై మహిళా నేతలు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌కు ధన్యవాదాలు తెలిపారు. మహిళలకు 33 శాతం అవకాశాలు కల్పించడం గొప్ప విషయమని నేతలు పేర్కొన్నారు.
వరుసగా 2 మ్యాచుల్లో గెలిచి విజయోత్సాహంతో ఉన్న చెన్నై జట్టుకు భారీ షాక్ తగిలింది. KKRతో మ్యాచులో గాయపడిన పేసర్ ఖలీల్ అహ్మద్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతను గాయం నుంచి కోలుకోవడానికి 10-12 వారాలు పడుతుందని వైద్యులు సూచించనట్లు సమాచారం. అటు గాయంతో టోర్నీలో ఇంకా ఆడలేకపోయిన ధోనీ ఎల్లుండి SRHతో మ్యాచ్‌కూ దూరం కానున్నట్లు క్రీడావర్గాలు పేర్కొన్నాయి.
SRCL: బోయినపల్లి మండలం నూతన తహసీల్దార్‌గా ఎండీ షరీఫ్ మొయినుద్దీన్ బాధ్యతలు స్వీకరించారు. ప్రజలు నేరుగా కార్యాలయానికి వచ్చి సమస్యలు తెలియజేస్తే నిబంధనల మేరకు త్వరిత పరిష్కారం చేస్తానని తెలిపారు. పారదర్శక పాలన అందించడమే లక్ష్యమని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
WGL: రాయపర్తి(M)లోని అన్ని గ్రామాల రైతులందరూ తమ మొబైల్ నంబర్లను తక్షణం అప్‌డేట్ చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి (AO) వీరభద్రం ఇవాళ సూచించారు. రైతు భరోసా, ఫార్మర్ రిజిస్ట్రీ, ఫెర్టిలైజర్ యాప్‌లలో ఒకే ఫోన్ నంబర్ ఉండటం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. వేర్వేరు నంబర్లు ఉండటం వల్ల సాంకేతిక సమస్యలు తలెత్తి ప్రభుత్వ పథకాల లబ్ధి అందకపోవచ్చని తెలిపారు.
HNK: తెలుగు చలనచిత్ర రంగానికి చెందిన ప్రముఖ హాస్య నటులు చిత్రం శ్రీను, రఘులు నేడు నగరంలో సందడి చేశారు. ఈ క్రమంలో వేయిస్తంభాల దేవాలయాన్ని వారు సందర్శించారు. ఈ సందర్బంగా రుద్రేశ్వర స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి, ఆశీర్వచనాలు ఇచ్చారు. వారితో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు భక్తులు ఆసక్తి కనబరిచారు.
HYD: హిమాయత్ నగర్‌లోని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు 50% సబ్ కోటా కోరుతూ జయంతి గౌడ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరింది. ఈ దీక్షకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ కార్యదర్శి విజయ్ కుమార్ మద్దతు తెలిపారు. బీసీ జనగణన చేపట్టి, జనాభా నిష్పత్తి ప్రకారం రాజకీయ కోటా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
TG: తన కొడుకును ఇంట్లో చిన్నచూపు చూస్తున్నారని ఓ మహిళ తోడి కోడలి కుమారుడి(4)పై దారుణానికి ఒడిగట్టింది. జ్యూస్ తాగితే చాక్లెట్ ఇస్తానని చెప్పి యాసిడ్ తాగించింది. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాలుడి పరిస్థితి గమనించిన తల్లిదండ్రులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
MBNR: చిన్నచింతకుంట మండలం కురుమూర్తి స్వామి గుట్ట వద్ద మహిళ అనుమానాస్పద మృతి కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరికల్ మండలం వెంకటాపూర్‌కు చెందిన శ్రావణి (26) మృతదేహం లభించింది. అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ స్పృహ కోల్పోయి ఉండగా, ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
TPT: సత్యవేడు మండలంలో శుక్రవారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు చమర్తి కండ్రిగలో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం 10.30 గంటలకు సత్యవేడు వెలుగు కార్యాలయంలో సంఘమిత్రులకు మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు హాజరుకావాలని కోరారు.
ప్రకాశం: బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండం వాసి కర్నాటి గురువారెడ్డి బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి కంభం ఆసుపత్రికి చేరుకుని మృతదేహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బెస్తవారిపేట ఎంపీపీ ఓసూర రెడ్డి, మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
KMR: బీబీపేటలోని వాసవి క్లబ్లో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ స్థాయి అధికారులు పాల్గొని రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కల్యాణ లక్ష్మి, సన్నబియ్యం బోనస్, మహిళా శక్తి బ్యాంక్, పెన్షన్ల వంటి సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. గ్రామాల్లోని ప్రధాన సమస్యలను గుర్తించలన్నారు.
W.G: భీమవరం మావుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో నిత్యాన్నదాన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవనం పూర్తయితే రోజుకు సుమారు 2 వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ నాగభూషణం, అసిస్టెంట్ కమిషనర్ నగేష్, తదితరులు పాల్గొన్నారు.
NDL: టీడీపీ కమిటీలో బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించిన సీఎం చంద్రబాబుకు గురువారం ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వెంకటరామరాజు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులైన కలపటపు బుచ్చి రాంప్రసాద్, పార్టీ జాతీయ అధికార ప్రతినిధులుగా నియమితులైన విజయకుమార్, జ్యోత్స్న, రాష్ట్ర కార్యదర్శి లోహిత్ నియామకం హర్షణీయమన్నారు.