• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘స్పిరిట్’ థియేట్రికల్ హక్కులపై UPDATE

రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబోలో ‘స్పిరిట్’ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకున్నట్లు సమాచారం. వీరికున్న బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ సినిమా వసూళ్లకు పెద్ద ప్లస్ కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇక ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 2027 మార్చి 5న విడుదల కానుంది.

April 12, 2026 / 12:26 PM IST

మొదలైన 146 మందికి శుక్లాల ఆపరేషన్లు

SS: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ధర్మవరంలో నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 479 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 146 మందికి శుక్లాల ఆపరేషన్లు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. మరో 92 మందిని మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని బేస్ హాస్పిటల్‌కు పంపారు.

April 12, 2026 / 12:25 PM IST

భయంతో ఆత్మహత్య.. కానీ పాసయ్యాడు!

TG: ఖమ్మం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోననే భయంతో రాపల్లికి చెందిన ఇంటర్ MPC ఫస్టియర్ విద్యార్థి అక్షంత్ గురువారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ఇవాళ వెలువడ్డ ఫలితాల్లో 347 మార్కులతో పాసయ్యాడు. దీంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.

April 12, 2026 / 12:25 PM IST

గద్వాల జిల్లాలో ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన

GDWL: తెలంగాణ ప్రభుత్వ 99 రోజుల ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు అన్ని గ్రామ సభల్లో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడమే ఈ ప్రత్యేక కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

April 12, 2026 / 12:23 PM IST

ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

SDPT: బెజ్జంకి మండలం క్రాసింగ్ గ్రామంలో రూ.10 లక్షల ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్డు పనులను సర్పంచ్ గాజ రవళి ప్రారంభించారు. గ్రామంలో మెరుగైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యమని తెలిపారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మద్దతుతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

April 12, 2026 / 12:22 PM IST

నేటి నుంచి మరిడి మహాలక్ష్మి జాతర ప్రారంభం

W.G: ముత్యాలపల్లిలోని శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాలు ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. జాతర ముగింపు సందర్భంగా గురువారం సాయంత్రం 6 గంటలకు ఆలయ ప్రాంగణంలో భారీ అఖండ అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు ఈవో అరుణ్ కుమార్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు.

April 12, 2026 / 12:18 PM IST

ఘనంగా హనుమాన్ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన

ADB: బోథ్ మండలం గొల్లపూర్ గ్రామంలో నూతన హనుమాన్ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోథ్ మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు సుధీర్ రెడ్డి, ఇర్ల అఖిల్, తుల శ్రీకాంత్, తుల హరీశ్, రాందాస్, సుగుణాకర్, తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

April 12, 2026 / 12:18 PM IST

‘ప్రతిరోజు నడవడం వల్ల ఆరోగ్యం మెరుగు’

JGL: ప్రతిరోజు నడవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ వాణి పేర్కొన్నారు. పట్టణంలోని వివేకానంద మినీ స్టేడియంలో నిర్వహించిన డెయిలీ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వ సభ్య సమావేశానికి మున్సిపల్ చైర్ పర్సన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం, శారీరక దృఢత్వానికి వాకింగ్ వంటి అలవాట్లు ఎంతో ఉపయోగకరమన్నారు.

April 12, 2026 / 12:18 PM IST

మద్ది ఆంజనేయ స్వామివారిని దరశించుకున్న ఎమ్మెల్యే

ELR: జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారిని ఇవాళ తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఆలయ వేద పండితులు ఆయనను ఘనంగా సత్కరించి ఆశీర్వచనాలు అందజేశారు.

April 12, 2026 / 12:16 PM IST

ఆటో,కారు ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు..!

NRML: కడెం మండలంలోని ఉడుంపూర్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దంతాలపల్లి నుండి కడెంవైపు వస్తున్న ఆటో ఎదురుగా వస్తున్న కారు ఢీకొనగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను ఖానాపూర్ ఆసుపత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 12, 2026 / 12:15 PM IST

‘చంద్రబాబు డైరెక్షన్‌లో రేవంత్ రెడ్డి నడుస్తున్నారు’

TG: చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు మెప్పు పొందడానికే రేవంత్ రెడ్డి కాళేశ్వరం మీద కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ చేయకుండా తెలంగాణ ప్రజలను వంచిస్తున్నారన్నారు. ఎల్‌నినో ప్రభావం పడితే, కరువు వస్తే, మేడిగడ్డ లేని లోటు ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుందన్నారు.

April 12, 2026 / 12:13 PM IST

ఇంటర్ ఫలితాల్లో ప్రభావం చూపలేకపోయిన మానుకోట

MHBD: తెలంగాణలో నేడు ఇంటర్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో మానుకోట జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరుచలేకపోయారు. ఫస్టియర్ ఫలితాల్లో 49.11% ఉత్తీర్ణత మాత్రమే సాధించింది. అలాగే సెకండియర్ ఫలితాల్లో 64.37 శాతం ఉత్తీర్ణతతో జిల్లా వెనుకబడిపోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహబూబాబాద్ జిల్లానే చివరి స్థానం.

April 12, 2026 / 12:13 PM IST

నానబెట్టిన బాదం పప్పును తింటే ప్రయోజనాలు

రాత్రి 4-5 బాదం పప్పులను నానబెట్టి, ఉదయం పొట్టు తీసి తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బాదం పొట్టులోని ‘టానిన్లు’ పోషకాల శోషణను అడ్డుకుంటాయి. నానబెట్టి పొట్టు తీయడం వల్ల విటమిన్లు, ఎంజైమ్‌లు శరీరానికి బాగా అందుతాయి. ఇది జ్ఞాపకశక్తిని, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉండటానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.

April 12, 2026 / 12:12 PM IST

గుక్కెడు నీటికోసం 2 కిమీ నడక .. గిరిజనుల జల కష్టం

PPM: గుమ్మలక్ష్మీపురం(M) తాడికొండ పంచాయతీ శిఖరంపై గ్రామంలో త్రాగునీటి సమస్య తీవ్రంగా మారింది. సుమారు 24 కుటుంబాలు, 200కు పైగా జనాభా ఉన్న ఈ గ్రామంలో గిరిజనులు బిందెడు నీటి కోసం రోజూ 2 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లాల్సి వస్తోంది. కొండ జాలలపై ఆధారపడుతూ తెచ్చుకుంటున్న నీరు శుభ్రంగా లేకపోవడంతో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

April 12, 2026 / 12:11 PM IST

వాలీబాల్ టోర్నమెంట్ పోస్టర్ లను ఆవిష్కరించిన MLA

MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాయ్స్ హై స్కూల్‌లో ఈనెల 18,19వ తేదీల్లో నిర్వహించే వాలీబాల్ టోర్నమెంట్ పోస్టర్‌లను MLA ప్రేమ్ సాగర్ రావు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. టోర్నమెంట్‌లో పాల్గొనే క్రీడాకారులందరికీ భోజన సదుపాయం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ పాల్గొన్నారు.

April 12, 2026 / 12:10 PM IST