• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

చిన్న దిమిలిలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

PPM: భామిని మండలం చిన్న దిమిలి గ్రామంలో సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయం, రేషన్ షాపును పరిశీలించి రికార్డులు, సరుకుల పంపిణీపై ఆరా తీశారు. ప్రజలకు సేవలు సకాలంలో అందేలా చూడాలని, నిర్లక్ష్యం వహించవద్దని సిబ్బందిని ఆదేశించారు.

April 9, 2026 / 07:04 PM IST

‘గత ఆరు నెలల్లో 85 మంది అరెస్ట్’

VZM: గంజాయి రవాణా, విక్రయం, వినియోగానికి యువత దూరంగా ఉండాలని SP దామోదర్ గురువారం సూచించారు. (NDPS) చట్టం ప్రకారం గంజాయి కేసుల్లో పట్టుబడితే 20 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. గత 6 నెలల్లో జిల్లాలో 20 కేసులు నమోదు చేసి 85 మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించామని పేర్కొన్నారు. అలాగే, సుమారు 300 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

April 9, 2026 / 07:04 PM IST

ముగిసిన బెజ్జంకి స్వామివారి బ్రహ్మోత్సవాలు

SDPT: బెజ్జంకి శ్రీ లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరి రోజు ఉత్సవ మూర్తులను ప్రత్యేక వాహనంపై గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్లగా భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి కొబ్బరికాయలు కొట్టి ప్రార్థనలు చేశారు. ఈనెల 25న ప్రారంభమైన ఉత్సవాలు నేటితో సంపూర్ణంగా ముగిశాయి.

April 9, 2026 / 07:03 PM IST

పిడుగు పడి పాడి గేదె మృతి

PLD: పెదకూరపాడు లగడపాడు గ్రామానికి చెందిన పళ్లెం ఏసుబాబు గేదె గురువారం కురిసిన వర్షం, పిడుగుపాటుకు గురై మృతి చెందిందని తెలిపాడు. అకాల వర్షం రావడంతో చెట్టుకు గేదెను కట్టాడని, ఒక్కసారిగా పిడుగుపడటంతో గేదె చనిపోయిందని పాడి రైతు కంటతడి పెట్టుకున్నాడు. సంఘటన స్థలానికి వీఆర్వో సిల్వరాజ్ పరిశీలించారు.

April 9, 2026 / 07:03 PM IST

‘ఐకేపీ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి’

SRPT: పెన్‌పహాడ్‌ మండలం అనాజీపురంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్‌ రెడ్డి ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరతో పాటు సన్నరకాలకు రూ.500 బోనస్‌ పొందాలని సూచించారు. కేంద్రాల్లో తూకం,తేమ యంత్రాలు సిద్ధంగా ఉంచాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని చెప్పారు.

April 9, 2026 / 07:03 PM IST

పోచంపల్లిని సందర్శించిన జపాన్ దేశస్తులు

BHNG: చేనేత ఇక్కత్ వస్త్రాల తయారీ ప్రక్రియను తెలుసుకునేందుకు జపాన్ దేశస్తులు గురువారం పోచంపల్లిని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక టూరిజం పార్కులోని మగ్గాలు, నూలు దారం, రంగులు అద్దకం, మగ్గంపై నేసే చీర తయారీ ప్రక్రియను పరిశీలించారు. చేనేత కళాకారులు కళాత్మకంగా తయారు చేస్తున్న చీరలను చూసి అభినందించారు. చేనేత కళాకారుల కళా నైపుణ్యం అద్భుతం అని కొనియాడారు.

April 9, 2026 / 07:01 PM IST

BREAKING: టాస్ గెలిచిన లక్నో

ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. అలాగే ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. అందుకే ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని కోల్‌కతా జట్టు వ్యూహాలు రచిస్తోంది.

April 9, 2026 / 07:01 PM IST

భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి: కలెక్టర్

WNP: జిల్లాలో భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని ఎన్ఐసీ హాల్లో జిల్లా కలెక్టర్ భూభారతి పెండింగ్ అప్లికేషన్లుపై అన్ని మండలాలు తహసీల్దార్లతో సమీక్షించారు. భూభారతి పెండింగ్ ఫైల్స్‌ను కలెక్టర్ లాగిన్‌కు పంపడంతో పాటు వాటి యొక్క ఫిజికల్ ఫైల్స్ కూడా పంపాలని సూచించారు.

April 9, 2026 / 07:01 PM IST

రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతలకు డీఎంహెచ్ఓ సన్మానం

GDWL: జిల్లా వైద్యులు, సిబ్బంది రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటడం గర్వకారణమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DM&HO) డాక్టర్ సంధ్యా కిరణ్మయి కొనియాడారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా అవార్డులు అందుకున్న బృందాన్ని గురువారం ఆమె సన్మానించారు.

April 9, 2026 / 07:00 PM IST

నిలిచినపోయిన తుంగభద్ర ఎక్స్‌ప్రెస్

MBNR: సాంకేతిక లోపంతో తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ దేవరకద్ర రైల్వే స్టేషన్‌లో సుమారు గంటన్నర పాటు నిలిచిపోయింది. సాయంత్రం 5 గంటలకు స్టేషన్‌కు చేరుకున్న రైలు ముందుకు కదలకపోవడంతో ప్రయాణికులు ప్లాట్‌పారమ్ పైనే పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా రైల్వే సిబ్బంది సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో రైలు తిరిగి ప్రయాణమైంది.

April 9, 2026 / 07:00 PM IST

నిలిచినపోయిన తుంగభద్ర ఎక్స్‌ప్రెస్

MBNR: సాంకేతిక లోపంతో తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ దేవరకద్ర రైల్వే స్టేషన్‌లో సుమారు గంటన్నర పాటు నిలిచిపోయింది. సాయంత్రం 5 గంటలకు స్టేషన్‌కు చేరుకున్న రైలు ముందుకు కదలకపోవడంతో ప్రయాణికులు ప్లాట్‌పారమ్ పైనే పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా రైల్వే సిబ్బంది సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో రైలు తిరిగి ప్రయాణమైంది.

April 9, 2026 / 07:00 PM IST

బంగ్లా క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సంచలన నిర్ణయం

బంగ్లా క్రికెట్ బోర్డు నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తమీమ్ ఇక్బాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన తొలి సంతకాన్ని క్రికెటర్లు జీతాల పెంపు ఫైల్‌పై చేయడంతో ఆటగాళ్లు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే 37 ఏళ్ల వయసులోనే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తమీమ్.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించాడు.

April 9, 2026 / 06:56 PM IST

అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన మున్సిపల్ ఛైర్మన్

వనపర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఎమ్మెల్యే మేఘారెడ్డి సౌజన్యంతో అంబలి కేంద్రం, చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గురువారం మున్సిపల్ ఛైర్మన్ మాధవి రమేష్, వివిధ నాయకులతో కలసి కేంద్రాన్ని ప్రారంభించారు. మండుతున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని వివిధ పనుల నిమిత్తం వనపర్తికి వచ్చే వారి దాహార్తిని తీర్చడానికి ఉపయోగపడుతుందన్నారు.

April 9, 2026 / 06:55 PM IST

తాటి ముంజెలకు భారీగా డిమాండ్

గుంటూరులో మండుతున్న ఎండల మధ్య తాటి ముంజెలకు మంచి ఆదరణ లభిస్తోంది. వడదెబ్బ తగలకుండా శరీరానికి చల్లదనాన్ని అందించి, ఆరోగ్యాన్ని కాపాడతాయని పూర్వీకులు చెప్పే ఈ సహజ ఆహారాన్ని ప్రజలు ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు. గంటల వ్యవధిలో ముంజెలు అమ్ముడైపోతుండటంతో వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

April 9, 2026 / 06:54 PM IST

BRSలో చేరాలని నిర్ణయించుకున్నా: జీవన్ రెడ్డి

TG: తాను BRSలో చేరాలని నిర్ణయించుకున్నట్లు మాజీ మంత్రి జీవన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో 27 నెలలుగా చాలా క్షోభ అనుభవించినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో రాష్ట్రం తిరోగమన దిశలో నడిచిందన్నారు. 2014లో కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే అవకాశం వచ్చినా.. కాంగ్రెస్‌లోనే కొనసాగానన్నారు. రాష్ట్ర అవసరాల కోసం ఇప్పుడు BRSతో కలిసి పనిచేస్తానని చెప్పారు.

April 9, 2026 / 06:49 PM IST