• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పల్లాతో భేటీ పార్టీ బలోపేతంపై చర్చ

KRNL: ఆలూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఇవాళ విజయవాడలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ సమస్యలు, పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన చర్యలు, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల అంశాలపై ఆయనతో చర్చించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమె కుమారుడు, నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

April 8, 2026 / 10:41 AM IST

మాజీ సర్పంచ్‌లకు ఘన సన్మానం

PLD: వినుకొండలో మాజీ సర్పంచ్‌లను ప్రభుత్వ చీఫ్‌ విప్‌ జీవీ ఆంజనేయులు సన్మానించారు. పదవీకాలం ముగిసిన వారిని బుధవారం ఆయన దుశ్శాలువాలతో సత్కరించారు. గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌లది కీలక పాత్ర అని ఆయన కొనియాడారు. గత ఐదేళ్లు వారు చేసిన సేవలు ఎంతో అభినందనీయమన్నారు. పదవులు ముగిసినా భవిష్యత్తులోనూ ప్రజా సేవలో కొనసాగాలని ఆయన సూచించారు.

April 8, 2026 / 10:40 AM IST

పోలీసుల అవగాహన సదస్సు

ELR: జంగారెడ్డిడెంలోని 6, 7, 8 వార్డులకు సంబంధించిన ప్రజలతో నిన్న రాత్రి ఏఎస్పీ సుస్మిత రామనాథన్ ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేవిధంగా అవగాహన కల్పించారు. నేరాల నియంత్రణకు ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ సుభాష్, ఎస్సై ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

April 8, 2026 / 10:38 AM IST

నాకు ఎప్పుడో బ్రేకప్ అయ్యింది: కృతి శెట్టి

నటి కృతి శెట్టి తాజా ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తనకు కొన్నేళ్ల క్రితమే బ్రేకప్ అయ్యిందని, ఆ విషయం తన తల్లికి కూడా తెలుసని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తాను సింగిల్‌గానే ఉన్నానని తెలిపింది. అలాగే సోషల్ మీడియాలో వచ్చే నెగెటివిటీని తాను అస్సలు సహించనని, అసభ్యంగా ప్రవర్తించే వారిని వెంటనే బ్లాక్ చేస్తానని వెల్లడించింది.

April 8, 2026 / 10:38 AM IST

‘సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం’

PLD: సీఎం సహాయనిది పేదల పాలిటి వరమని ప్రభుత్వ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. నియోజకవర్గలోని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 71 మంది లబ్ధిదారులకు రూ.61.36 లక్షల చెక్కులను మంగళవారం ఆయన కార్యాలయంలో DCCB ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావుతో కలిసి చీఫ్ విప్ జీవీ పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.

April 8, 2026 / 10:37 AM IST

శంకరంబాడి సుందరాచార్యులకు ఘన నివాళి

TPT: శంకరంబాడి సుందరాచార్యుల వర్థంతి సందర్భంగా ప్రముఖులు తిరుపతిలో ఇవాళ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గేయంతో తెలుగువారి కీర్తిని చాటిన మహనీయుడిని అభిమానులు స్మరించుకున్నారు. తెలుగు భాషా సాహిత్యాలకు ఆయన చేసిన సేవలను, ముఖ్యంగా రాష్ట్ర గీతం ద్వారా తెలుగువారి గుండెల్లో ఆయన సంపాదించుకున్న స్థానాన్ని ఈ సందర్భంగా కొనియాడారు.

April 8, 2026 / 10:35 AM IST

వింబావిలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

NLG: పశువులు రోగాల బారిన పడకుండా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని పశు వైద్యాధికారి అమరేందర్ రైతులకు సూచించారు. చిట్యాల మండలం, వెంబావిలో ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు బుధవారం, గురువారం రెండు రోజులపాటు వేయనున్నట్లు సర్పంచ్ అలివేలు వెంకన్న వేయనున్నట్లు తెలిపారు. పొనుగోటి సత్యనారాయణ రావు, రైతులు పాల్గొన్నారు.

April 8, 2026 / 10:35 AM IST

మోటార్ ఆన్ చేస్తూ వ్యక్తి మృతి

MDK: విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన నర్సాపూర్ మండలం ఆవంచ గ్రామంలో విషాదం నింపింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. జగ్గంపేట సుధాకర్ (29) బుధవారం ఉదయం ఇంటి నల్లా నీటి కోసం మోటార్ వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ప్రైవేట్ పరిశ్రమలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

April 8, 2026 / 10:34 AM IST

గోళ్లమూడిలో CMRF చెక్కు అందజేత

ఎన్టీఆర్: నందిగామ మండలం గోళ్లమూడిలో CMRF చెక్కును బుధవారం పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన రంగమ్మకు మంజూరైన రూ.72,570 చెక్కును టీడీపీ గ్రామ అధ్యక్షుడు శ్రీనివాసరావు అందజేశారు. సీఎం సహాయనిధి పేదలకు కొండంత అండని, ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటుందని ఆయన పేర్కొన్నారు. తమకు ఆర్థిక సాయం అందించిన సీఎం చంద్రబాబుకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

April 8, 2026 / 10:34 AM IST

తిప్పాపూర్ బీజేపీ అధ్యక్షునిగా వంగేటి నర్సారెడ్డి

KMR: బిక్కనూర్ మండలంలోని తిప్పాపూర్ గ్రామ BJP అధ్యక్షుడిగా, వంగేటి నర్సారెడ్డిని ఏకగ్రీవంగా నియమించినట్లు, మండల BJP పార్టీ అధ్యక్షుడు ఉప్పరి రమేష్ చెప్పారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు గ్రామ అధ్యక్షుడిగా వంగేటి నర్సారెడ్డిని నియమించినట్లు, అలాగే కార్యదర్శిగా పైడి దామోదర్ రెడ్డిలను నియమించినట్లు చెప్పారు.

April 8, 2026 / 10:34 AM IST

ఆకట్టుకున్న మార్కెటింగ్ కార్యక్రమం

NRPT: మరికల్ మండల కేంద్రంలోని రెయిన్ బో ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవారం నిర్వహించిన మార్కెట్ డే కార్యక్రమం ఆకట్టుకుంది. రైతుల కష్టాలను స్వయంగా అధ్యయనం చేసేందుకు మార్కెట్ డే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పాఠశాల కరస్పాండెంట్ షాఫి, ప్రిన్సిపల్ అస్మా తెలిపారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు సురేమోన్ రెడ్డి, సర్పంచ్ చెన్నయ్యలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

April 8, 2026 / 10:33 AM IST

చండూరు మున్సిపల్‌ కో- ఆప్షన్ సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్

BHNG: చండూరు మున్సిపాలిటీలో ఇద్దరు కో- ఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం మున్సిపల్ కమిషనర్ మల్లేశం నోటిఫికేషన్ విడుదల చేశారు. రెండు స్థానాల్లో ఒకరు మహిళ అయి ఉండాలని పేర్కొన్నారు. ఇద్దరు సభ్యులు మున్సిపల్ కౌన్సిల్‌లో ఓటరు అయి ఉండాలని, 21 సంవత్సరాలలోపు వయస్సు ఉండరాదని తెలిపారు. ఈనెల 13వ తేదీ సాయంత్రం 5 గంటలకు నోటిఫికేషన్ వేయడానికి అవకాశం ఉందన్నారు.

April 8, 2026 / 10:33 AM IST

డి.ఎడ్ కోర్సుల ప్రవేశాల కోసం దరఖాస్తులకు ఆహ్వానం

అన్నమయ్య: 2026–27 విద్యా సంవత్సరానికి డి.ఎడ్ కోర్సు ప్రవేశాల కోసం DEECET-2026 నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని డైట్ ప్రిన్సిపల్ డా. కె. సుబ్రహ్మణ్యం తెలిపారు. రాయచోటి బాలిక ఉన్నత పాఠశాలలో పోస్టర్లను ఆవిష్కరించారు. దరఖాస్తుల చివరి తేదీ ఏప్రిల్ 15 కాగా, పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్నాయన్నారు.

April 8, 2026 / 10:32 AM IST

‘అనుమతులు లేని స్విమ్మింగ్ పూల్స్‌పై చర్యలు తీసుకోండి’

MDCL: అల్వాల్ సర్కిల్ పరిధిలో అనుమతులు లేకుండా నడుస్తున్న స్విమ్మింగ్ పూల్స్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస భద్రతా ప్రమాణాలు, శిక్షణ పొందిన ట్రైనర్లు, రక్షణ కంచెలు లేకుండానే పూల్స్ నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. జీహెచ్ఎంసీ అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదన్నారు.

April 8, 2026 / 10:32 AM IST

తాండూర్ భావిగి భద్రేశ్వరుని సేవలో అన్నదాతలు

VKB: తాండూర్ భావిగి భద్రేశ్వర బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తులకు నిన్నటి నుంచి 5 రోజుల పాటు అన్నదానం చేస్తున్నారు. ఈ పుణ్యకార్యానికి దాతలు సహకారం అందిస్తున్నారని కమిటీ సభ్యులు తెలిపారు. ఇవాళ MLA బుయ్యని మనోహర్ రెడ్డి భక్తులకు అన్నప్రసాదం అందజేయనున్నారు. ఈ క్రమంలోనే 9, 10, 11,12వ తారీఖున భక్తులకు అన్నదానం చేయనున్నారు.

April 8, 2026 / 10:31 AM IST