అన్నమయ్య: 2026–27 విద్యా సంవత్సరానికి డి.ఎడ్ కోర్సు ప్రవేశాల కోసం DEECET-2026 నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని డైట్ ప్రిన్సిపల్ డా. కె. సుబ్రహ్మణ్యం తెలిపారు. రాయచోటి బాలిక ఉన్నత పాఠశాలలో పోస్టర్లను ఆవిష్కరించారు. దరఖాస్తుల చివరి తేదీ ఏప్రిల్ 15 కాగా, పూర్తి వివరాలు అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉన్నాయన్నారు.