• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఆహార భద్రతపై అప్రమత్తంగా ఉండాలి: MLA

HNK: ఆహార భద్రతపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్‌లో EAT RIGHT WALK కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.

April 6, 2026 / 01:18 PM IST

వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవలో పాల్గొన్న ఎమ్మెల్యే

SKLM: శ్రీకాకుళంలోని గల శ్రీభూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి 16వ వార్షికోత్సవ తిరుకళ్యాణ మహోత్సవం లో ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు. ఈ మేరకు స్వామివారి ని దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో చేశారు. ఆలయం అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ప్రాంగణం అంతా మంగళవాయిద్యాలతో మార్మోగి ,ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

April 6, 2026 / 01:17 PM IST

‘ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నాం’

KMR: బిక్కనూర్ మండలంలోని ఇసన్న పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు , ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నామని, పంచాయతీ కార్యదర్శి సుమేధ చెప్పారు. సోమవారం గ్రామంలో ఇందిరమ్మ పథకం ద్వారా, ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారుడి ఇంటిని, స్థానిక సర్పంచ్ మేకల రాములుతో కలిసి ఆమె ప్రారంభించారు.

April 6, 2026 / 01:17 PM IST

కొత్త కార్యదర్శుల బాధ్యతల స్వీకరణ

BPT: కర్లపాలెం మండలం యాజలి గ్రేడ్-2 పంచాయతీ కార్యదర్శిగా జి.అమర్నాథ్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. బుచ్చిరెడ్డిపాలెం నుంచి బదిలీపై వచ్చిన ఆయన తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవోలను మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే ఏట్రవారిపాలెం గ్రేడ్-2 కార్యదర్శిగా ఎం.చలపతి బాధ్యతలు స్వీకరించారు. ఆయన ముత్తుకూరు మండలం పంటపాలెం నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారు.

April 6, 2026 / 01:17 PM IST

రూ.225 కోట్లతో బాసర ఆలయ అభివృద్ధికి శ్రీకారం

TG: బాసర జ్ఞానసరస్వతి ఆలయ అభివృద్ధికి CM రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. రూ.225 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. 2 వేల చదరపు అడుగుల్లో ప్రస్తుత గర్భాలయం, అర్ధ మండపం, 5 వేల చదరపు అడుగులకు పెంచేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఉత్తరం వైపు 9 అంతస్తుల రాజగోపురం, మిగిలిన 3 దిక్కుల్లో 7 అంతస్తుల గోపురాలు నిర్మించనున్నారు. శృంగేరి పీఠాధిపతులను సంప్రదించి నమూనా తయారు చేశారు.

April 6, 2026 / 01:16 PM IST

‘విద్యార్థినిలు వేధింపులపై నిర్భయంగా సంప్రదించాలి’

SRCL: విద్యార్థినిలు వేధింపులపై నిర్భయంగా సంప్రదించాలని ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. మార్చి నెలలో షీ టీంకు అందిన ఫిర్యాదులపై మూడు FIRలు, 4 పెట్టి కేసులు నమోదు చేశామన్నారు. మహిళలు, విద్యార్థినిలను వేధిస్తున్న వ్యక్తులను గుర్తించి వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చామని పేర్కొన్నారు.

April 6, 2026 / 01:16 PM IST

బావిలో పడి యువకుడి ఆత్మహత్య

SDPT: బెజ్జంకి మండలం వీరాపూర్ గ్రామంలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. మెరుగు భాగ్యరెడ్డి (35) ఆదివారం సాయంత్రం తనకు చెందిన వ్యవసాయ బావిలో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. సోమవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దాచారం గ్రామానికి చెందిన గజఈతగాళ్లతో శవాన్ని బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

April 6, 2026 / 01:15 PM IST

మరికల్‌లో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

NRPT: మరికల్ మండల కేంద్రంలో సోమవారం బిజెపి ఆవిర్భావ దినోత్సవం పార్టీ మండల శాఖ అధ్యక్షుడు వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాత బస్టాండ్ దగ్గర పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. బీజేపీ ద్వారానే గ్రామలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేష్, రాజేష్,మోహన్ రెడ్డి, బాలరాజుగౌడ్, శివకుమార్, రాము, అశోక్, శ్రవణ్, తదితరులు పాల్గొన్నారు6.

April 6, 2026 / 01:13 PM IST

మోసపూరి పథకాలపై అవగాహన కల్పించిన సీఐ

NTR: జి.కొండూరు మండలం చెమటూరులో పోలీసుల ఆధ్వర్యంలో మోసపూరిత పథకాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. సీఐ కిషోర్ బాబు మాట్లాడుతూ.. అధిక లాభాల పేరుతో మోసాలు పెరుగుతున్నాయని హెచ్చరించారు. ఫోన్ కాల్స్ ద్వారా బ్యాంక్ వివరాలు, OTP ఇవ్వరాదని సూచించారు. కష్టార్జిత డబ్బును అవసరాలకు వినియోగించుకోవాలని, ఖరీదైన బైకులు ప్రమాదాలకు దారి తీస్తాయని తెలిపారు.

April 6, 2026 / 01:12 PM IST

మృతుని కుటుంబానికి అండగా మిత్రులు

NLG: చిట్యాల పట్టణ 9వ వార్డుకు చెందిన మునుగోటి వెంకన్న అకాల మరణంతో వారి 2006-07 పదో తరగతి మిత్రులు మానవత్వాన్ని చాటుకున్నారు. అందరూ కలిసి రూ.1,23,000 సేకరించి, వెంకన్న కుమార్తె రేణుక పేరున పోస్టాఫీసులో ‘సుకన్య సమృద్ధి యోజన’ కింద డిపాజిట్ చేశారు. ఆ పత్రాలను కుటుంబ సభ్యులకు సోమవారం అందజేసి భవిష్యత్తులోనూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

April 6, 2026 / 01:12 PM IST

కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌.. అర్జీల స్వీకరణ

PLD: జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులు అర్జీలను స్వీకరించారు. జిల్లాలోని పలు మండలాల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను వివరించగా, సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

April 6, 2026 / 01:12 PM IST

తలుపులు పగలగొట్టి మరీ చోరీ

ప్రకాశం: సంతమాగులూరులో హైస్కూల్ వెనకవైపు ఉన్న కర్ణ నాగిరెడ్డి ఇంట్లో గుర్తు తెలియని దుండగులు తలుపులు పగలగొట్టి బీరువాలో ఉన్న కొద్దిపాటి బంగారన్ని తీసుకెళ్లారని పోలీసులు చెప్పారు. ఇంటియజమాని వైజాగ్‌లో నివాసం ఉంటారని స్థానికులు తెలిపారు. ఇంటికి తాళం వేసి ఉంటుందని, ఎప్పుడో వచ్చి వెళ్తుంటారని అన్నారు.

April 6, 2026 / 01:12 PM IST

‘పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి’

అల్లూరి: బీజేపీ సిద్ధాంతాలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పీఏసీఎస్ డైరెక్టర్ రీమల చంద్రరావు, గిరిజన మోర్చా జిల్లా నేత అరిమెల రాజు కార్యకర్తలకు సూచించారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం (మన ఊరు మన జెండా) సందర్భంగా సోమవారం కొయ్యూరు మండలంలోని రత్నంపేట గ్రామంలో బీజేపీ జెండాను ఎగురవేశారు. దేశసేవ, సుపరిపాలన, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా బీజేపీని స్థాపించారన్నారు.

April 6, 2026 / 01:12 PM IST

ఘనంగా BJP ఆవిర్భవ దినోత్సవ వేడుకలు

BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలో BJP 46వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు BJP భూత్ ఇంఛార్జ్ రంగినేని కమలాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమలాకర్ జెండా ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా BJP మండల అధ్యక్షుడు విష్ణు యాదవ్ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. BJP నేతలు తదితరులు పాల్గొన్నారు.

April 6, 2026 / 01:11 PM IST

నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి 5వ విడుత నీటి విడుదల

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా పంట సాగు కోసం 5వ విడతలో భాగంగా సోమవారం 1,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈఈ అక్షయ్ కుమార్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.887 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు వెల్లడించారు. ఈ నీటితో ఆయా పరిధిలోని రైతులు నీటిని పొదుపుగా పంట సాగుకు ఉపయోగించుకోవాలన్నారు.

April 6, 2026 / 01:10 PM IST