• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఎర్రవరంలో ఘనంగా అమ్మవారి పండుగ మహోత్సవం

AKP: అచ్చుతాపురం మండలం ఎర్రవరం గ్రామంలో శ్రీశ్రీశ్రీ పిల్లేలమ్మ అమ్మవారి పండుగ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఆలయ కమిటీ సభ్యలు ఇవాళ నిర్వహించారు. ఈ సందర్బంగా అమ్మవారికి దూప, దీప నైవేద్యాలు సమర్పించి, పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం అన్నసమారాధనను ఏర్పాటు చేశారు.

April 7, 2026 / 12:44 PM IST

‘విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట’

NRML: దిలావర్‌పూర్ మండల కేంద్రంలో మంగళవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ‘ప్రజా బాట’ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని తక్షణ పరిష్కారం అందించడమే లక్ష్యమని ఏఈ శంకర్ తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్న విద్యుత్ తీగలు, వంగిన స్తంభాలను మరమ్మతులు చేస్తున్నామని చెప్పారు. సమస్యలు ఉంటే నేరుగా అధికారులకు తెలియజేయాలని సూచించారు.

April 7, 2026 / 12:44 PM IST

తమిళనాడు ఎన్నికలు.. స్టార్ క్యాంపెయినర్‌గా రేవంత్

TG: తమిళనాడు ఎన్నికల స్టార్ క్యాంపెయినర్లను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్లను ఖరారు చేసింది. కాగా, తమిళనాడులో 234 స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే దశలో ఎన్నికలు జరగనుండగా.. మే 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. 

April 7, 2026 / 12:44 PM IST

విజయ్‌పై ఐశ్వర్య రాజేష్ ప్రశంసలు

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్‌పై హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రశంసలు కురిపించింది. యువతకు ఆయన ఒక గొప్ప రోల్ మోడల్ అని పేర్కొంది. ‘విజయ్ ఎవరి గురించి తప్పుగా మాట్లాడరు. తన పని తాను చేసుకుంటూ వెళ్తారు. కానీ, బయట చాలామంది ఆయన గురించి విమర్శలు చేస్తుంటారు. అయినా సరే, ఆయన అవేమీ పట్టించుకోరు. అభిమానులే ఆయనకు ప్రపంచం’ అని చెప్పుకొచ్చింది.

April 7, 2026 / 12:42 PM IST

రాంజల చెరువుకు జలకళ.. రైతులు హర్షం

KRNL: ఆదోని జీవనాడి అయిన రాంజల చెరువు ఒకప్పుడు వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రధాన వనరు. ప్రస్తుతం వర్షాకాలంలో ఈ చెరువు నిండటం వల్ల భూగర్భ జలాలు పెరిగి, పరిసర ప్రాంతాల్లోని బావులు, బోర్లు జలకళను సంతరించుకుంటున్నాయి. తద్వారా అటు వ్యవసాయానికి, ఇటు తాగునీటి అవసరాలకు ఈ చెరువు ఎంతో ఆసరాగా నిలుస్తోంది.

April 7, 2026 / 12:42 PM IST

అయ్యన్నపేటలో ‘ప్రపంచ ఆరోగ్య దినోత్సవ’ కార్యక్రమం

VZM: అయ్యన్నపేట జంక్షన్ వద్ద ‘ప్రపంచ ఆరోగ్య దినోత్సవం’ కార్యక్రమాన్ని మున్సిపల్ నడక మైదానంలో అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు సీహెచ్ రమణ నిర్వహించారు. ఈ సంవత్సరం ‘ఆరోగ్యం కోసం కలిసికట్టుగా.. విజ్ఞానానికి అండగా నిలబడదాం’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నమన్నారు. ఈ కార్యక్రమంలో డా డివిజి శంకరరావు, ఎ.తిరుపతిరావు, బాలు, తదితరులు పాల్గొన్నారు.

April 7, 2026 / 12:42 PM IST

ఇబ్రహీంపట్నంలో భారీగా రేషన్ బియ్యం స్వాధీనం

RR: ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లిలో ETF- 2 బృందం దాడి చేసి సుమారు 500 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుంది. పాత రైస్ మిల్ వద్ద రెండు వాహనాల్లో బియ్యం నిల్వ, తరలింపు జరుగుతున్నట్లు గుర్తించారు. ఒక వాహనంలో 35 క్వింటాళ్లు లోడ్ కాగా, మరో వాహనం అన్‌లోడ్ అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

April 7, 2026 / 12:41 PM IST

జిల్లా కేంద్రంలో ఆరోగ్య చైతన్య ర్యాలీ

NGKL: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవా సంస్థ, వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా అవగాహన ర్యాలీ నిర్వహించాయి. పాత కలెక్టరేట్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు సాగిన ఈ కార్యక్రమంలో అధికారులు మధుసూదన్ రావు, శ్రీరామ్ ఆర్య పాల్గొన్నారు. పోషకాహారం, నిత్య వ్యాయామంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు.

April 7, 2026 / 12:39 PM IST

టీపీసీసీ అధ్యక్షునికి ఘన స్వాగతం

NGKL: నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా కల్వకుర్తికి వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌‌కు స్థానిక నాయకులు మంగళవారం ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో పాటు మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్ తదితర ముఖ్య నాయకులు పట్టణంలోని మహబూబ్‌ నగర్ చౌరస్తాలో గజమాలతో ఘన స్వాగతం పలికారు.

April 7, 2026 / 12:39 PM IST

మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు.

MDK: మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై నిజాంపేట పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. నిజాంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన చౌహన్ బాలాజాకి, మొబైల్ కోర్టు న్యాయమూర్తి శ్రీ సాయి ప్రభాకర్ గారు రూ. 10,000 జరిమానా విధించారు.​ ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం చేట్టరిత్యా నెేరమన్నారు.

April 7, 2026 / 12:38 PM IST

‘సీసీ కెమెరాలతో పొదిలి ప్రాంతాన్ని పరిశీలిస్తున్నాం’

ప్రకాశం: పొదిలి పట్టణంలో నేర నియంత్రణకు ఎస్సై రాజేష్ వినూత్న చర్యలు చేపట్టారు. ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ నిఘా వ్యవస్థతో చైన్ స్నాచింగ్, దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. ట్రాఫిక్ ఉల్లంఘనలపై కూడా చర్యలు తీసుకుంటున్నామని ఎస్సై తెలియజేశారు.

April 7, 2026 / 12:36 PM IST

పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గండ్ర

BHPL: మహిళల్లో గర్భాశయ (సర్వైకల్) క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పించే పోస్టర్లను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 9 నుంచి 14 ఏళ్లలోపు బాలికలకు HPV వ్యాక్సిన్ వేయించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే గర్భాశయ క్యాన్సర్‌ను సమర్థవంతంగా నివారించవచ్చని, అవగాహన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

April 7, 2026 / 12:36 PM IST

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వ్యక్తికి జైలుశిక్ష

WNP: మద్యం సేవించి వాహనాలు నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన ముగ్గురిని కోర్టు జైలు శిక్ష జరిమానా విధించినట్లు వీపనగండ్ల ఎస్సై నరేష్ తెలిపారు. ఈ సందర్భంగా వనపర్తి అదనపు న్యాయమూర్తి శ్రీలత నిందితులకు జైలు శిక్ష, జరిమాణాలు విధించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమని తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

April 7, 2026 / 12:35 PM IST

జలసాధన కమిటీ నాయకులు ముందస్తు అరెస్ట్

MHBD: మున్నేరు-పాలేరు లింకు కెనాల్ నిర్మాణ సర్వేను అడ్డుకుంటారనే అనుమానంతో జలసాధన కమిటీ నాయకులను గార్ల పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఇవాళ దుబ్బగూడెంలో సర్వే నిర్వహిస్తుండగా, నిరసనలకు దిగకుండా కమిటీ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. నాయకులు మాట్లాడుతూ.. అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదని అన్నారు.

April 7, 2026 / 12:35 PM IST

ప్రారంభమైన HRAAP ఇంటర్ హోటల్స్ క్రికెట్ లీగ్

విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని జీవీఎంసి క్రికెట్ స్టేడియంలో ఇవాళ ఉదయం HRAAP ఇంటర్ హోటల్స్ క్రికెట్ లీగ్ -2026 ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ అతిథులు, హాస్పిటాలిటీ రంగానికి చెందిన సభ్యులు, సీపీ డా.శంకబ్రత బగ్చి హాజరు అయ్యారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని సీపీ ప్రారంభించారు.

April 7, 2026 / 12:35 PM IST