HYD: మూసీ సుందరీకరణలో భాగంగా నిర్మించ తలపెట్టిన ‘గాంధీ సరోవర్’పై NGT పచ్చజెండా ఊపింది. పర్యావరణ అనుమతుల సాకుతో ప్రాజెక్టును అడ్డుకోవాలని BRS నేత వేసిన పిటిషన్‌న్ను ట్రిబ్యునల్ కొట్టేసింది. ఇది కేవలం రాజకీయ దురుద్దేశమేనన్న ప్రభుత్వ న్యాయవాదుల వాదనతో ఏకీభవించింది. దీంతో న్యాయపరమైన అడ్డంకులు తొలగి, మూసీ ప్రక్షాళన పనులకు మార్గం సుగమమైంది.
HYD: సీతాఫల్‌మండిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మీ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు ఈ చెక్కులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ప్రతి పథకం అర్హులైన వారికి చేరేలా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.
ప్రకాశం: ఎవరైనా ప్రభుత్వ భూములు ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మార్కాపురం MRO కే.చిరంజీవి హెచ్చరించారు. గురువారం మార్కాపురం చెరువు కట్ట కొంత స్థలాన్ని కొందరు ఆక్రమించగా.. అధికారులు దాని పరిశీలించి నిర్ధారణ చేసుకుని, వాటిని తొలగించారు. అనంతరం ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
NZB: హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం నిజామాబాద్ నగరంలోని గంజ్ మార్కెట్ యార్డులో వ్యాపార లావాదేవీలు జరగవని మార్కెట్ కమిటీ ఛైర్మన్ గంగారెడ్డి తెలిపారు. తిరిగి శుక్రవారం నుంచి యార్డులో వ్యాపార కార్యకలాపాలు, కొనుగోళ్లు, అమ్మకాలు యథావిధిగా కొనసాగుతాయని ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని వ్యాపారులు, రైతులు గమనించాలని ఆయన సూచించారు.
CTR: పెద్ద పంజాణి మండలానికి చెందిన చెందిన చంద్రమ్మ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన వివరాలను DSP ప్రభాకర్ గురువారం వెల్లడించారు. చంద్రమ్మను సమీప బంధువైన సుబ్రహ్మణ్యం ఆమె దగ్గర అప్పు తీసుకున్నాడు. డబ్బులు అడిగినందుకు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి హత్య చేశాడు. సుబ్రహ్మణ్యాన్ని అరెస్టు చేశామని, మరో ఇద్దర్ని అరెస్టు చేయాల్సి ఉందన్నారు.
జట్టులో కమిన్స్ లేని లోటు ఏ మాత్రం కనిపించడంలేదని SRH కోచ్ డానియెల్ వెటోరీ తెలిపాడు. కమిన్స్ జట్టుకు అందుబాటులో ఉంటూ, కెప్టెన్సీపై ఇషాన్‌ను గైడ్ చేయడం బాగుందని పేర్కొన్నాడు. ఇవాళ KKRతో మ్యాచ్‌లో పుంజుకుని విజయం సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. కాగా కమిన్స్ లేకపోవడంతోనే తొలి మ్యాచ్‌లో 200+ స్కోర్ చేసినా SRH ఓడిందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
VKB: DCC కార్యవర్గాన్ని జిల్లా అధ్యక్షుడు ధారాసింగ్ ప్రకటించారు. జిల్లా స్థాయి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ట్రెజరర్స్, స్పోకె పర్సన్స్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ జాబితాను ప్రకటించారు. మొత్తం మీద 55 మందితో జాబితాను వెల్లడించారు. ఇందులో ఉపాధ్యక్షుడిగా 7 మంది, ప్రధాన కార్యదర్శులుగా 12 మంది, ట్రెజరర్‌గా 1, స్పోక్ పర్సన్స్ 2, సెక్రటరీస్‌గా నియమించారు.
MHBD: దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం గ్రామంలో ప్రజా పాలన ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం గ్రామసభ నిర్వహించారు. ప్రభుత్వ విప్, డోర్నకల్ MLA డా. జాటోత్ రామచంద్రనాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. గ్రామస్థాయిలో ప్రతి సమస్యకు తక్షణ పరిష్కారం అందేలా అధికారులు కృషి చేయాలని స్పష్టంచేసారు.
SKLM: టెక్కలి మండలం బూరగాం గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పిల్లలను చేర్పించాలని ఇంటింటా ప్రచారాన్ని ప్రధానోపాధ్యాయులు పి.హరిప్రసన్న గురువారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది ఉమేష్ కుమార్, రోజా, వనజాక్షి, అలి వేణి, మాణిక్యం, తదితరులు పాల్గొన్నారు.
కడప: గండికోట జలాశయం నుంచి మైలవరం జలాశయానికి విడుదల చేస్తున్న నీటిని అధికారులు నిలిపివేశారు. ఉన్నతాధికారులు నిర్ణయించిన 2 TMC నీరు ఇప్పటికే మైలవరం జలాశయానికి చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మైలవరం EE రమేశ్ తెలిపారు. ప్రస్తుతం మైలవరం జలాశయం నుంచి ఉత్తర కాలువకు 300 క్యూసెక్కులు, దక్షిణ కాలువకు 160 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. కాగా జలాశయంలో 3.3 TMC నీరు నిల్వ ఉంది.
కోనసీమ: అమలాపురం పట్టణంలో వరుస బైక్ దొంగతనాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి ఆచూకీ తెలపాలని క్రైమ్ పార్టీ ఎస్సై అయితా బత్తుల బాలకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా దొంగకు సంబంధించిన ఫోటోలను గురువారం ఆయన మీడియాకు విడుదల చేశారు. ఇటీవల అమలాపురం కిమ్స్ హాస్పిటల్ వద్ద ఈ వ్యక్తి బైక్ దొంగతనం చేసిన ఆధారాలు లభించాయన్నారు.
VSP: గాజువాక సాయిరాం నగర్‌లోని స్వామి విద్యానికేతన్ హై స్కూల్‌లో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో ‘డే హైక్’ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 5 గం నుంచి సా. 6 గం వరకు సాగిన ఈ సాహసయాత్రలో విద్యార్థులు వివిధ శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.హైక్‌లో భాగంగా అల్పాహారం నుంచి భోజనం వరకు విద్యార్థులే వంటలు తయారు చేసుకుని తమ స్వయంకృషిని చాటుకున్నారు.
AKP: విశాఖ ఉక్కు కర్మాగారం 2025-26లో గణనీయ వృద్ధిని నమోదు చేసింది. కీలక ఉత్పత్తి విభాగాల్లో 52% పెరుగుదల సాధించింది. హాట్ మెటల్ ఉత్పత్తి 5.95 మిలియన్ టన్నులకు, లిక్విడ్ స్టీల్ 5.69 మిలియన్ టన్నులకు చేరాయి. క్రూడ్ స్టీల్ 5.43 మిలియన్ టన్నులతో 51% వృద్ధి నమోదు చేసింది. టర్నోవర్ రూ.22,311 కోట్లకు చేరి 22% పెరిగింది.
SRCL: దేశంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాలకు ఒక రోల్ మోడల్‌గా మారిందని, ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లిలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ గ్రామసభకు ఆయన హాజరై మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ. 1 కోటి 15 లక్షల మంది రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు రూ. 5 లక్షల జీవిత బీమా కల్పిస్తున్నామన్నారు.
TG: రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామచంద్రమూర్తి భక్తుడిగా బలం, జ్ఞానం, వాక్చాతుర్యం అన్నీ కలిసి అరుదైన వ్యక్తిత్వం కలిగిన జ్ఞానిగా, హిందూ పురాణాలు హనుమంతుడిని కీర్తిస్తాయని గుర్తుచేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడాలని కేసీఆర్ ప్రార్థించారు.