MLG: జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని గురువారం రాష్ట్ర మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్ టిఎస్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రవిచందర్, శ్రీనగర్ సర్పంచ్ మల్లేష్ ఉన్నారు.
TPT: నాయుడుపేట మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సూళ్లూరుపేట ఆర్డీవో వీ.దేవేందర్ ఇవాళ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నేత నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తనంతరం శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ నాయకులు ఉన్నారు.
నిహారిక కొణిదెల ప్రొడక్షన్స్‌లో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌లో వరుణ్ తేజ్ ‘బరి’ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ గురించి నిహారిక ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా రూ.60 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తెలిపింది. తన బ్యానర్ నుంచి రాబోతున్న హైయ్యెస్ట్ బడ్జెట్ మూవీ ఇదేనని, ఇందులో తెలుగు హీరోయిన్ నటిస్తుందని వెల్లడించింది.
ATP: అనంతపురంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో పదవీ విరమణ పొందిన ముగ్గురు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ పి.జగదీష్ బుధవారం ఘనంగా సన్మానించారు. ఏఆర్‌ఎస్‌ఐ గంగన్న, హెడ్ కానిస్టేబుల్ షాజాద్ బాషా, సీనియర్ అసిస్టెంట్ సుధారాణి సేవలను ఎస్పీ కొనియాడారు. విధి నిర్వహణలో శాంతిభద్రతల పరిరక్షణకు వీరు చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లా నూతన వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శశిభూషణ్ రెడ్డి ఇవాళ ఉదయం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
MNCL: CPI ప్రజా పోరాటాలకు ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు శంకర్ కోరారు. రామకృష్ణాపూర్‌లో 10 రోజుల పాటు సాగే ‘ఇంటింటికి సీపీఐ’ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతామన్నారు.
BDK: ఇల్లందు కూరగాయల మార్కెట్ ప్రాంతంలో విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు. కరెంట్ స్తంభంపై నుంచి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగలడంతో సదరు యువకుడు కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయమై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కోనసీమ: అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం, పోతుకుర్రు, మాగాం గ్రామాలలో ఉన్న వేప చెట్లు ఎండిపోతున్నాయి. దీంతో ఇది అరిష్టమని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాలలో వేప చెట్టును దేవత గా భావించి పూజలు చేస్తారు. అంతేకాకుండా వేప చెట్లు చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. అటువంటి చెట్లు ఒక్కసారిగా ఎండిపోయి మోడుగా మారుతున్నాయని స్థానిక ప్రజలు అంటున్నారు.
TPT: తుంబురు తీర్థ ముక్కోటి పర్వదినం తిరుమలలో వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు తుంబురు తీర్థంలో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
పల్నాడు: రెంటచింతల మండలం పాలువాయి గేటు సమీపంలో ట్రాక్టర్‌పై ప్రయాణిస్తున్న దంపతులు మధ్య జరిగిన వాగ్వాదం ప్రమాదానికి దారితీసింది. ఈ ఘటంలో మంచికల్లు గ్రామానికి చెందిన నాగలక్ష్మి ట్రాక్టర్ పైనుంచి కిందపడి గాయాల పాలయ్యింది. ఆమెను స్థానికులు వెంటనే నరసరావుపేట హాస్పటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
KRNL: గోనెగండ్ల బాలికల సంక్షేమ వసతి గృహాన్ని కర్నూలు కలెక్టర్ డా. సిరి తనిఖీ చేశారు. వంటశాల పరిశుభ్రతపై సూచనలు ఇచ్చారు. స్టోర్‌లో బియ్యం, కూరగాయలు పరిశీలించగా ఎండిన పచ్చిమిర్చిపై అసహనం వ్యక్తం చేశారు. అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని ఇవాళ హెచ్చరించారు.
WGL: నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో 2025-26విద్యా సం.కి అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రొ.మల్లం నవీన్ తెలిపారు. కళాశాలలో అర్థశాస్త్ర విభాగంలో, చరిత్ర విభాగంలో ఒక్కో గెస్ట్ పోస్టు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో ఏప్రిల్ 2సాయంత్రంలోపు కళాశాలలో సంప్రదించాలన్నారు.
MDCL: మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అల్వాల్‌లో కార్మికులకు లేబర్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్మికుల సంక్షేమం ప్రభుత్వాల బాధ్యతని, లేబర్ కార్డు ద్వారా పలు పథకాలు అందుతాయని తెలిపారు. అర్హులైన కార్మికులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు, కార్మికులు ఉన్నారు.
IPL 2026లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ విజయం వెనుక హెడ్ కోచ్ రికీ పాంటింగ్ మాస్టర్ ప్లాన్ ఉంది. సాధారణంగా PBKS తరఫున వన్‌డౌన్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వస్తాడు. కానీ అనూహ్యంగా కూపర్ కనోలీ బరిలోకి దిగి కీలక ఇన్నింగ్స్‌తో పంజాబ్‌ను గెలిపించాడు. పాంటింగ్ ప్రయోగించిన ‘నంబర్ 3’ అస్త్రం విజయవంతమైంది.
NRML: కార్మిక వ్యతిరేక కోడ్‌ను అమలు చేయరాదని వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ, టీయూసీఐ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట నల్ల జెండాలతో నిరసన చేపట్టారు. వారు మాట్లాడుతూ.. కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న ఈ కోడ్‌లను అమలు చేయవద్దని దేశవ్యాప్తంగా 25 సమ్మెలు చేశామని అన్నారు. విలాస్, శ్రీనివాస చారి, రామ లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.