KNR: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పుదుచ్చేరికి స్టార్ క్యాంపెయినర్, ఎన్నికల పరిశీలకునిగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఏఐసీసీ నియమించింది. నేటి నుంచి మూడు రోజులు ఆయన పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తూ, పార్టీ విజయానికి కృషి చేయనున్నారు. ఆయన వెంట ముఖ్య నాయకులు ప్రచారానికి వెళ్తారు.
ADB: ఉట్నూర్ మండలం వడోని గ్రామానికి చెందిన తోగ్రే గణేష్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న వెడ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆ కుటుంబానికి అండగా నిలిచారు. 10000 రూపాయలు ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో వెడ్మ ఫౌండేషన్ సభ్యులు నగేష్, అక్షయ్, బాధిత కుటుంబసభ్యులు ఉన్నారు.
NTR: నందిగామ ప్రభుత్వ మహిళా కళాశాలలో ఈ నెల 4 నుంచి 24 వరకు పాలిసెట్-2026 ఉచిత కోచింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రమేష్ తెలిపారు. శిక్షణ ప్రతిరోజూ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ కూడా అందజేస్తారు. ఆసక్తి గల విద్యార్థులు మరిన్ని వివరాల కోసం 8309235213 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.
AP: YCP అమరావతికి వ్యతిరేకం కాదని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. కానీ ఈ తరహాలో బిల్లు సరికాదన్నారు. బిల్లులో అమరావతి ఎన్ని ఎకరాల్లో నిర్మాస్తారని.. ఎప్పటిలోగా రాజధాని నిర్మాణం పూర్తి చేస్తారో స్పష్టత లేదని చెప్పారు. అమరావతి రైతుల ప్రయోజనాలను పట్టించుకోవాలని తెలిపారు.
కాకినాడ జిల్లా నూతన కలెక్టరుగా ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ తమ కార్యాలయ ఛాంబరులో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, అసిస్టెంట్ కలెక్టర్ మనీషా జిల్లా అధికారులు, వేదపండితుల పూర్ణకుంభం, మేళతాళాలతో స్వాగతం పలికారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఘన చరిత్ర, ఎన్నో విశిష్టతలు కలిగిన జిల్లాలో పనిచేయడం తనకు లభించిన అపూర్వ అవకాశమని పేర్కొన్నారు.
GNTR: అమరావతి విస్తరణపై వైఎస్ జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మొదటి 50 వేల ఎకరాలకు ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చవుతుందని చెప్పి ఇప్పుడు మరో 50 వేల ఎకరాలను అదనంగా ఎందుకు చేరుస్తున్నారని ప్రశ్నించారు. ఈ విస్తరణ వల్ల మొత్తం లక్ష ఎకరాల్లో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కోసమే దాదాపు రూ.2 లక్షల కోట్లు అవసరమవుతాయని, ఇంత భారీ వ్యయం అవసరమా అని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
SDPT: రూ. లక్ష కోట్లు వృథా అంటూ అవాకులు చెవాకులు పేలే కళ్లులేని కబోదులకు మండుటెండల్లో సైతం గలగలా పారుతున్న కాళేశ్వరం జలాలే సజీవ సాక్ష్యమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మల్లన్న సాగర్ నుంచి సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలకు కాలువల్లో ప్రవహిస్తున్న గోదావరి జలధారలే విమర్శించే వారికి చెంపపెట్టు అని పేర్కొన్నారు. బుధవారం గలగల పారుతున్న కాలువల వద్ద ఆయన సెల్ఫి తీసుకున్నారు.
AP: అమరావతి రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారో బిల్లులో పెట్టాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కోరారు. లేకపోతే ఈ బిల్లుకు అర్థమే లేకుండా పోతుందన్నారు. అమరావతి నిర్మాణం కోసం ఇప్పటికే 54 వేల ఎకరాలు సేకరించారని తెలిపారు. రాజధాని కోసం మరింత భూమి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. అమరావతి చట్టబద్ధత బిల్లుతో రాష్ట్ర ప్రయోజనాలకు ఎలాంటి ఉపయోగం లేదని చెప్పారు.
BDK: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మణుగూరు ఏరియాలో పరిపాలనా వ్యవస్థపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూనవరం పంచాయతీ పరిధిలోని YSR నగర్‌లో కొంతమంది ఇళ్లకు అధికారిక అనుమతులు లేకుండానే విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం యూనియన్ లీడర్ల ప్రభావంతో జరిగిందనే ఆరోపణలు మరింత సంచలనం రేపుతున్నాయి.
KMM: పాముకాటుతో వివాహిత మృతి చెందిన ఘటన కొణిజర్ల మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. అన్నవరంకు చెందిన బానోతువాలి మొక్కజొన్న తోటలో కూలి పనులకు వెళ్లింది. ఈ క్రమంలో ఆమె పనిచేస్తుండగా ఆమె కాలికి పాము కాటు వేసింది. దీంతో గమనించిన తోటి కూలీలు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు చేశారు.
రణ్‌బీర్ కపూర్ హీరోగా నమిత్ మల్హోత్రా నిర్మాణంలో ‘రామాయణ’ మూవీ రూపొందుతోంది. అయితే, నాలుగేళ్ల క్రితమే ఈ ఆఫర్ వచ్చినా తాను తిరస్కరించానని రణ్‌బీర్ వెల్లడించాడు. ఆ పాత్రకు న్యాయం చేయలేనన్న భయంతో అప్పుడు నో చెప్పానని, కానీ తండ్రి అయ్యాక రాహా రాకతో తన ఆలోచన మారిందన్నాడు. శ్రీరాముడి పాత్ర తన వ్యక్తిగత ఎదుగుదలకు తోడ్పడుతుందని ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్లు తెలిపాడు.
ASF: పెంచికల్ పేట్ మండలంలో చుక్కల దుప్పిని హతమార్చిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు FRO అనిల్ కుమార్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం లోడుపల్లి గ్రామానికి చెందిన అర్జయ్య, పెద్దల లక్ష్మయ్య, కొట్రంగి పున్నం ఈనెల 30న ఉచ్చులు బిగించి చుక్కల దుప్పిని హతమార్చినట్లు విచారణలో వెళ్లడైంది. వీరిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
నెల్లూరు రూరల్ 33వ డివిజన్ వెంగళరావునగర్‌లో పింఛన్ల పంపిణీ బుధవారం మొదలైంది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి నగదు అందజేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.4వేలు పింఛన్ అమలు చేసిన మంచి ప్రభుత్వం తమదని ఆయన పేర్కొన్నారు.
ప్రకాశం: బేస్తవారిపేట దర్గా కొండపై జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీవో రంగనాయకులు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి కార్మికుల హాజరును పరిశీలించారు. ఉపాధి హామీ పథకంలో ప్రస్తుతం బయోమెట్రిక్ (ఫేషియల్) అటెండెన్స్ మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్న నేపథ్యంలో ఆ విధానంలో సాంకేతిక సమస్యలు ఉన్నాయా అనే విషయాన్ని ఎంపీడీవో అడిగి తెలుసుకున్నారు.
ప్రకాశం: చిర్రికూరపాడులో జల సురక్ష మిషన్‌లో భాగంగా రూ. 43 లక్షల వ్యయంతో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్‌ను మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ప్రారంభించారు. అనంతరం పైప్‌లైన్ల ద్వారా గ్రామానికి నీటి సరఫరాను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు మ్యారిటైమ్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య తదితరులు పాల్గొన్నారు.