PPM: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లతో జీవితాలు నాశనం చేసుకోవద్దని ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి యువతకు పిలుపు ఇచ్చారు. ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో బెట్టింగ్‌లకు పాల్పడేవారు ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొంతమంది సులభంగా అధిక నగదు సంపాదించవచ్చని ప్రలోభాలు పెడతారని వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించారు.
ఇచ్ఛాపురంలో గ్యాస్ సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని తహసీల్దార్‌కు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా బుధవారం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. పట్టణంలో గ్యాస్ సరఫరా పక్కదారి పడుతుందని శ్యాంప్రసాద్ రెడ్డి అన్నారు. గ్యాస్ సరఫరా లేకపోవడంతో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్, టిఫిన్ సెంటర్లు మూతపడ్డాయని తెలిపారు.
MNCL: మందమర్రి ఏరియా గనులు ఈ ఆర్థిక సంవత్సరంలో 71 శాతం ఉత్పత్తి సాధించాయని ఏరియా GM ఎన్. రాధాకృష్ణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. కేకే- 5 భూగర్భ గని ఏకంగా 110% ఉత్పత్తి సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్మికుల సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉందన్నారు. వచ్చే ఏడాది 100% లక్ష్యాన్ని చేరుకోవడమే ధ్యేయంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.
ప్రకాశం: దొనకొండ పోలీస్ స్టేషన్‌లో నూతన ఎస్సైగా రామకృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ నుంచి దొనకొండకు బదిలీ అయ్యారు. గతంలో దొనకొండ ఎస్సైగా పనిచేసిన త్యాగరాజును ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.
MDK: కేంద్రం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ అమలును నిరసిస్తూ తూప్రాన్ మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు ఇవాళ ప్లకార్ట్స్‌తో సీఐటీయు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కార్మిక హక్కులను హరించే 4 లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు బాబు డిమాండ్ చేశారు. విద్యుత్ సవరణ బిల్లు-2022ను వెనక్కి తీసుకోవాలని కోరారు.
AKP: జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడును నోబుల్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు బుధవారం కలిశారు. పదో తరగతి మూల్యాంకన విధుల్లో 60 ఏళ్లు దాటిన ఉపాధ్యాయులకు, అనారోగ్య కారణాలచే అభ్యర్థించుకున్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల్లో సదుపాయాలు కల్పించాలని, మూల్యాంకన రుసుమును జాప్యం లేకుండా వెంటనే విడుదల చేయాలన్నారు.
JGL: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జన్మదిన సందర్భంగా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య, మున్సిపల్ ఛైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్‌లోని పెద్ద వాగుని బుధవారం జిల్లా కలెక్టర్ సందర్శించారు. వాగు నుంచి జరుగుతున్న ఇసుక రవాణా గురించి పోలీస్ సిబ్బందికి తగు సూచనలు చేశారు. అనంతరం రెబ్బెన మండలంలోని రాంపూర్ గ్రామం దగ్గర ఎలాంటి అనుమతి పత్రాలు, ట్రాక్టర్ డాక్యుమెంట్ల లేకుండా ఇసుక రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లను కలెక్టర్ హరిత సీజ్ చేశారు.
KNR: గంగాధర మండలం కురిక్యాలలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ రానున్న రోజుల్లో ఇళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలుపుతూ నూతన వస్త్రాలు అందజేశారు.
జనగామ మండలంలోని యశ్వంతపూర్ శివారులో వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై బుధవారం రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కోడిగుడ్ల లోడుతో వెళ్తున్న ఒక ఆటో రోడ్డుపై బోల్తా పడటంతో గుడ్లన్నీ చెల్లాచెదురుగా పడి పగిలిపోయాయి. ఆటో డ్రైవర్‌కు స్వల్ప గాయాలవగా, తృటిలో పెను ప్రమాదం తప్పింది. హైవేపై గుడ్లు పగిలిపోవడంతో వాహనాల రాకపోకలకు స్వల్ప అంతరాయం కలిగింది.
తన ప్రెగ్నెన్సీ వార్తలపై నటి పూనమ్ పాండే స్పందిస్తూ, తాను గర్భవతిని కాదని తేల్చి చెప్పింది. ఇదంతా కేవలం ‘ఏప్రిల్ ఫూల్ ప్రాంక్’ అని, ఆ ఫొటోలు AI జనరేటెడ్ అని వెల్లడించింది. ప్రపంచ పరిస్థితుల మధ్య కాసేపు అలరించాలనే ఇలా చేశానని, తనను సీరియస్‌గా తీసుకోవద్దని కోరింది. లైఫ్‌ని చిల్ చేయాలంటూ అభిమానులకు తెలిపింది. దీంతో నెటిజన్లు ఆమెపై ఫైరవుతున్నారు.
తన ప్రెగ్నెన్సీ వార్తలపై నటి పూనమ్ పాండే స్పందిస్తూ, తాను గర్భవతిని కాదని తేల్చి చెప్పింది. ఇదంతా కేవలం ‘ఏప్రిల్ ఫూల్ ప్రాంక్’ అని, ఆ ఫొటోలు AI జనరేటెడ్ అని వెల్లడించింది. ప్రపంచ పరిస్థితుల మధ్య కాసేపు అలరించాలనే ఇలా చేశానని, తనను సీరియస్‌గా తీసుకోవద్దని కోరింది. లైఫ్‌ని చిల్ చేయాలంటూ అభిమానులకు తెలిపింది. దీంతో నెటిజన్లు ఆమెపై ఫైరవుతున్నారు.
WNP: ఉద్యోగుల ఐదు నెలల డిఏ బకాయిలు, రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు ఖాదర్ పాషా డిమాండ్ చేశారు. జీపీఎఫ్ లోన్లు కూడా రాక ఉద్యో గులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించకుంటే ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
SRPT: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సెల్ ఫోన్ రికవరీ మేళాలో రూ.20 లక్షల విలువైన 106 మొబైల్ ఫోన్లను ఎస్పీ నరసింహ బాధితులకు అందజేశారు. 11వ సారి ఈ మేళా నిర్వహించి రికవరీ చేసిన ఫోన్లను పంపిణీ చేశారు. ఫోన్లలో వ్యక్తిగత సమాచారం ఉంటుందని, మొబైల్ పోగొట్టుకుంటే వెంటనే ‘CEIR’ పోర్టల్ ద్వారా బ్లాక్ చేసి, పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ ఈరోజు తెలిపారు.
గుంటూరు: కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని ఏఐటీయూసీ పిలుపు మేరకు పొన్నూరులో అంబేద్కర్ సెంటర్‌లో ఇవాళ ధర్నా నిర్వహించారు. నియోజకవర్గ కార్యదర్శి ఆరేటి రామారావు మాట్లాడుతూ.. కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా బ్లాక్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.