• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సౌజన్య ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

​PPM: మందుల చీటి తెలుగులో అర్థమైయేలా వ్రాయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం. ప్రభాకర్ రెడ్డి అన్నారు. పార్వతీపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం. ప్రభాకర్ రెడ్డి బుధవారం పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. ఇందులో భాగంగా బైపాస్ రోడ్డులో ఉన్న సౌజన్య ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా సందర్శించి, అక్కడ అందుతున్న వైద్య సేవలను స్వయంగా పరిశీలించారు.

April 1, 2026 / 01:20 PM IST

‘జ‌ర్న‌లిస్టులు త‌మ ఆరోగ్యంప‌ట్ల శ్ర‌ద్ద వ‌హించాలి’

VZM: జిల్లాలోని పాత్రికేయులంతా త‌మ ఆరోగ్యంప‌ట్ల శ్ర‌ద్ద వ‌హించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి కోరారు. జిల్లా స‌మాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వ‌ర్యంలో స్థానిక తిరుమ‌ల మెడిక‌వ‌ర్ ఆసుప‌త్రిలో అక్రిడేటెడ్ జ‌ర్న‌లిస్టుల‌కు గ‌త ఐదు రోజులుగా ప్ర‌త్యేకంగా నిర్వ‌హిస్తున్న ఉచిత‌ వైద్య ఆ...

April 1, 2026 / 01:20 PM IST

సీతారాముల కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రకాశం: హనుమంతునిపాడు మండలం ఉమ్మలపల్లి కొత్తూరులో సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఆలయంలో నూతన పంచలోహ విగ్రహాలకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ, సంప్రదాయాలను కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

April 1, 2026 / 01:20 PM IST

ఇబ్రహీంపట్నం ఎన్నికకు ఇన్‌ఛార్జ్‌లుగా ముగ్గురు ఎమ్మెల్యేలు

RR: ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు ముగ్గురు ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ అధిష్టానం కేటాయించింది. ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికకు పరిశీలకులు, ఇన్‌ఛార్జ్‌లుగా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, మాధవరం కృష్ణారావు, దేవిరెడ్డి సుధీర్ రెడ్డిలను నియమించింది. కాగా, ఏప్రిల్ 4వ తేదీన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్‌ఛైర్మన్ ఎన్నిక జరగనుంది.

April 1, 2026 / 01:18 PM IST

భూమి పూజలో పాల్గొన్న మంత్రి బీసీ

NDL: బనగానపల్లె పట్టణ అవుకు మెట్ట ప్రాంతంలో ఇళ్లపట్టాల పంపిణీ కోసం భూమి పూజ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొని పనులను ప్రారంభించారు. ఎస్సార్ బీసీ కార్యాలయ సమీపంలో రెవెన్యూ మ్యాప్‌లను పరిశీలించిన మంత్రి, లేఅవుట్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పేదల సొంతింటి కలని త్వరగా సహకారం చేయడమే ప్రభుత్వ లక్షమన్నారు.

April 1, 2026 / 01:16 PM IST

కొండగట్టులో దీక్షాపరుల సందడి

JGL: హనుమాన్ జయంతి పండుగ సందర్భంగా హనుమాన్ దీక్షాపరులు కొండగట్టు అంజన్న ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని, ఇరుముడులు సమర్పించుకుంటున్నారు. కొంగు బంగారంగా భావించే కొండగట్టు అంజన్న సన్నిధికి రాష్ట్ర నలుమూలల నుంచి ఇరుముడితో వచ్చిన స్వాములు మొక్కులు చెల్లించుకుంటున్నారు. వీరి సౌకర్యార్థం ఇరుముడి సమర్పించుకోవడానికి ఆలయ ఆవరణలోనే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

April 1, 2026 / 01:15 PM IST

‘బైకర్’ పెయిడ్ ప్రీమియర్స్‌కు గ్రీన్ సిగ్నల్

శర్వానంద్, దర్శకుడు అభిలాష్ రెడ్డి కాంబోలో వస్తున్న స్పోర్ట్స్ అండ్ ఫ్యామిలీ డ్రామా ‘బైకర్’ ఏప్రిల్ 3న విడుదల కానుంది. తాజాగా మేకర్స్ ఈ మూవీ పెయిడ్ ప్రీమియర్స్‌‌కు ప్లాన్ చేశారు. ఏప్రిల్ 2న AP, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. ఇక ఈ సినిమాలో మాళవిక నాయర్, రాజశేఖర్ కీలక పాత్రలు పోషించారు.

April 1, 2026 / 01:15 PM IST

‘కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి’

KMM: కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఉన్న లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు వీరబాబు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం బోనకల్ మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలని పేర్కొన్నారు.

April 1, 2026 / 01:14 PM IST

అంతర్ రాష్ట్రా చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్: సీపీ

WGL: కమిషనరేట్ పరిధిలో ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన నిందితులను వరంగల్ CCS, హన్మకొండ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేసినట్లు సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.15.20 లక్షల నగదు, 95 గ్రాముల బంగారం, ఒక ద్విచక్ర వాహనం, రెండు సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.

April 1, 2026 / 01:12 PM IST

ఉణుదుర్రులో ఫించన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

W.G: ఉండి మండలం ఉనుదుర్రు, సాగపాడులో ఇవాళ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు పింఛన్లు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు క్రమం తప్పకుండా, ఆలస్యం లేకుండా ఫించనులు అందజేస్తుంది అన్నారు. గ్రామ సర్పంచ్ పిన్నంరాజు నాగలక్ష్మి, MPDO శ్రీనివాస్ పాల్గొన్నారు.

April 1, 2026 / 01:12 PM IST

ఆకర్షణీయంగా మారనున్న PVNR మార్గ్

HYD: PVNR మార్గమ్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు HMDA రూ.1.13 కోట్లతో పనులు చేపట్టింది. ఇందులో భాగంగా చిన్నారుల కోసం అత్యాధునిక ఆట పరికరాలు, ఫిట్‌నెస్ ప్రియుల కోసం ఓపెన్ జిమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే సందర్శకులు సేద తీరేందుకు అందమైన బెంచీలు, పెర్గోలాలు అందుబాటులోకి వస్తాయి. నగరవాసుల ఆరోగ్యం, ఉల్లాసమే లక్ష్యంగా ఈ సుందరీకరణ పనులు జరుగుతున్నాయి.

April 1, 2026 / 01:10 PM IST

అమరావతి బిల్లును వ్యతిరేకిస్తూ YCP వాకౌట్

AP: రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును వ్యతిరేకిస్తూ YCP సభ్యులు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. ‘కూటమి నేతలకు అమరావతి రైతులంటే పట్టింపు లేదు. ఈ బిల్లుతో రాష్ట్రానికి ప్రయోజనాలు ఏం లేవు. మేం అమరావతికి వ్యతిరేకం కాదు. కానీ ఈ తరహా బిల్లు సరికాదు, దీనికి మేం వ్యతిరేకం’ అంటూ మిథున్ రెడ్డి సహా ఇతర సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు.

April 1, 2026 / 01:09 PM IST

ఎమ్మెల్యే వాఖ్యలను ఖండిచిన కటా శ్రీనివాస్ గౌడ్

SRD: పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌‌ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. బుధవారం అమీన్ పూర్ నివాసంలోని ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

April 1, 2026 / 01:09 PM IST

జిల్లాలో తాగునీటి సమస్య రానివ్వం: కలెక్టర్

వికారాబాద్: జిల్లా జనాభాకు సరిపడా తాగునీరు అందుబాటులో ఉంది. జిల్లాలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని వేసవిలో తాగునీటి సమస్యకు తావులేకుండా ప్రయత్నం చేస్తున్నామని కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసి ఉంచాం అని ఆయన పేర్కొన్నారు.

April 1, 2026 / 01:09 PM IST

రెండు రోజులు చికెన్ సెంటర్లు మూసివేత

MDK: రామాయంపేట మండల వ్యాప్తంగా గురువారం నుండి రెండు రోజులపాటు చికెన్ సెంటర్లు మూసివేస్తున్నట్టు చికెన్ సెంటర్ యజమానులు పిలుపునిచ్చారు. కార్పొరేట్ సంస్థలతో తాము ఇబ్బంది పడుతున్నామని, కమిషన్ తగ్గించడంతో అప్పుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపుమేరకు రెండు రోజులపాటు చికెన్ సెంటర్లు మూసివేస్తున్నట్లు వారు ప్రకటించారు.

April 1, 2026 / 01:08 PM IST