PDPL: వేసవికాలం దృష్ట్యా గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపడుతున్నట్లు కొత్తపల్లి గ్రామ సర్పంచ్ సంతోశ్ తెలిపారు. బుధవారం గ్రామంలో మంచి నీటి బావికి నూతన మోటర్ బిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. వేసవి దృష్ట్యా తాగు నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు
MBNR: మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 12వ వార్డులో ఉన్న స్మశాన వాటికలో అన్ని రకాల వసతులు కల్పిస్తామని డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన 12వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రజలు ఆయన దృష్టికి పలు సమస్యలను తీసుకొచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కురువ సత్యం, నాయకులు మైత్రి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
KNR: సైదాపూర్ మండలంలోని లస్మన్నపల్లి అంగన్వాడీ కేంద్రంలో బుధవారం సర్పంచ్ మ్యాకల స్వప్న బాలామృతం ప్యాకెట్లు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్ఠిక ఆహారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త అబ్బిడి స్వరాజ్యం, గ్రామపంచాయతీ పాలకవర్గం పాల్గొన్నారు.
JN: జఫర్గడ్ మండలంలోని సాంఘీక సంక్షేమ బాలికల పాఠశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటకు ఉపయోగించే సామాన్లను, సరుకుల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థినులకు అందిస్తున్న భోజనం పరిశుభ్రంగా ఉండాలని, పోషకాహారం అందించాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్న వారి దృష్టికి తీసుకురావాలన్నారు. వారితో జిల్లా అధికారులున్నారు.
SRPT: తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన తడకమల్ల లాలమ్మ ఇటీవల మరణించడంతో బుధవారం ఆమె చిత్రపటానికి ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు రాంబాబు, సుదర్శన్, రాములు, రమేష్ పాల్గొన్నారు.
GNTR: ఫిరంగిపురం మండలం నుదురుపాడులో బుధవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ జరిగింది. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
SS: నల్లమాడ (మం) రెడ్డిపల్లి పంచాయతీలో జల్లెని సూర్యనారాయణ గత ఆరు నెలలుగా డయాలసిస్ బారిన పడ్డాడు. కుటుంబం పెద్ద డయాలసిస్‌తో బాధపడుతుండటంతో కుటుంబం పోషణ ఇబ్బందికరంగా మారింది. దీంతో ఏప్రిల్ ఒకటో తారీకు నూతనంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ రూ.10000 అందింది. ఈ మేరకు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
కోనసీమ: అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామంలో ‘వికసిత్ భారత్ జీరామ్ జీ’ పనులను గ్రామ సర్పంచ్ మేడిశెట్టి ఉషారాణి, జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు, మండల బీజేపీ అధ్యక్షులు యనమదల వెంకటరమణ బుధవారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా 125 రోజులు పని దినాలుగా మార్చడంతో పాటు, నీటి భద్రత, రైతులకు మేలు జరుగుతుందన్నారు.
MDCL: చికెన్ కంపెనీలు మార్జిన్లను పెంచాలని, వ్యాపారులకు సరైన లాభాలు కల్పించాలని, చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలని అల్వాల్ చికెన్ షాప్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఇవాళ అల్వాల్ పట్టణంలో చికెన్ షాపులు బందు చేసి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
TG: విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఎంపీ రఘురాం రెడ్డి గుర్తు ఆరోపించారు. AP విభజన చట్టంలో TGకి పలు హామీలు ఇచ్చారని తెలిపారు. NIT, IIM వంటి విద్యా సంస్థలు ఇస్తామన్నారని గుర్తు చేశారు. HYDని IT హబ్‌గా.. ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ వంటి వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి చేస్తామన్నారని చెప్పారు. AP తరహాలోనే TGకి అదనపు నిధులు ఇవ్వాలని కోరారు.
GDWL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రేపు నిర్వహించే గ్రామ, వార్డు సభలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులకు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లాలోని అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, తహసీల్దారులు, పురపాలక సంఘాల కమిషనర్లు, తదితరులతో జిల్లా కలెక్టర్ గూగుల్ మీట్ ద్వారా గ్రామసభల నిర్వహణపై మాట్లాడారు.
SRCL: ఇల్లంతకుంట మండలం ఓబులాపూర్‌లో శ్రీకృష్ణ యాదవ సంఘం నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నామని కార్యవర్గ సభ్యులు తెలిపారు. అధ్యక్షుడిగా నూకల పర్ష రాములు, ఉపాధ్యక్షుడిగా మేడకొక్కల కనుకయ్య, ప్రధాన కార్యదర్శిగా ఆత్మకూరు రాకేష్, క్యాషియర్‌గా నూకల శ్రీశైలం, డైరెక్టర్లుగా గడ్డి రంగయ్య, మెడ కొక్కుల ఎల్లయ్యను ఎన్నుకున్నామన్నారు.
VKB: కల్తీ వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ స్నేహ మెహ్రా బుధవారం హెచ్చరించారు. పోలీసుల సమావేశంలో వేసవి కాలాన్ని ఆసరాగా చేసుకుని లాభాల కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. జిల్లా వ్యాప్తంగా కల్తీ వ్యాపారాలపై నిరంతరం నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.
MHBD: డోర్నకల్ మండలం ముల్కలపల్లి విలేజ్‌లోని అంగన్వాడి కేంద్రంలో బుధవారం గర్భిణీలకు పౌష్టికహారం పంపిణి కార్యక్రమం జరిగింది. స్థానిక సర్పంచ్ డీఎస్ కళావతి- జగదీష్ ముఖ్యఅతిథిగా హాజరై గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. గర్భిణీ స్త్రీలు పోషకాలతో ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని, సరైన జాగ్రత్తలు పాటించాలని సర్పంచ్ సూచించారు.
BHPL: జిల్లాలో SC యాక్షన్ ప్లాన్ (SCAP) 2025-26 కింద నిరుద్యోగ ఎస్సీ యువతీ యువకుల స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగించినట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం కార్యనిర్వాహక సంచాలకులు ఇందిరా తెలిపారు. ఇప్పటి వరకు ఏప్రిల్ 2 వరకు ఉన్న గడువు ఇప్పుడు ఏప్రిల్ 8 వరకు పోడిగించారని అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.