SRD: హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లాలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. హనుమాన్ జయంతి వేడుకలు ర్యాలీలను భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ జరుగుతుందన్నారు. ఊరేగింపు ప్రాంతాలు, రద్దీ మార్గాల్లో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించినట్లు తెలిపారు.
BDK: భద్రాచలం ఐటీసీ కార్మికుల రిలే నిరాహార దీక్ష నేటితో ఏడవ రోజుకు చేరుకుంది. బుధవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లెల వీరనారాయణ సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా వీరనారాయణ మాట్లాడుతూ.. కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని, కార్మికులకు పార్టీ ఎల్లప్పుడు మద్దతుగా నిలుస్తుందని తెలిపారు.
HNK: కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల నిర్వహణలో కొత్త ఒరవడి ప్రారంభమైంది. ఇకపై విద్యార్థుల సమాధాన పత్రాలను ఆన్‌లైన్‌లోనే మూల్యాంకనం చేయనున్నారు. ఈ నెలలో జరిగే 2, 4, 6వ సెమిస్టర్ పరీక్షల నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని అధికారులు వెల్లడించారు. సుమారు 1.20 లక్షల మంది విద్యార్థుల 8 లక్షల సమాధాన పత్రాలను ఆన్‌లైన్ ద్వారా కరెక్షన్ చేయనున్నారు.
KRNL: పెద్దకడబూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ఇవాళ అట్టహాసంగా జరిగింది. టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నరవ శశిరేఖ అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నెలకు పింఛన్ల కోసం రూ.3వేల కోట్లు ఖర్చవుతుందన్నారు.
NLG: దేవరకొండలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో “యుద్దాన్ని ఆపండి ప్రపంచం శాంతిని కాపాడండి” అంటూ బుధవారం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. పూజారి సురభి కృష్ణమూర్తి, మొహమ్మద్ అబ్దుల్ జబ్బార్, పాస్టర్ ప్రవీణ్‌లు వారి వారి మతానుసారంగా ప్రపంచం శాంతిని కోరుతూ ప్రార్ధనలు చేశారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య యుద్ధం వల్ల ప్రపంచ శాంతికి భంగం కలుగుతుందన్నారు.
ASF: ఏప్రిల్ 2న జరగనున్న హనుమాన్ జయంతి వేడుకల దృష్ట్యా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ నితిక పంత్, IPS పటిష్ట బందోబస్తుకు ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉంచామని, డయల్ 100 కాల్స్ పై సిబ్బంది తక్షణమే స్పందించాలని సూచించారు.
HYD: రాష్ట్రంలో చికెన్ షాపుల బంద్ నేపథ్యంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు నిల్వ ఉంచిన మాంసాన్ని వాడే ప్రమాదం ఉందని, దానివల్ల బ్యాక్టీరియా చేరి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు. తాజా చికెన్ లభించని ప్రస్తుత పరిస్థితుల్లో నాన్-వెజ్ ప్రియులు జాగ్రత్తగా ఉండటం శ్రేయస్కరమని సూచిస్తున్నారు.
NZM: ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి ఎక్స్ రోడ్డు సమీపంలో సుమారు 5 ఏళ్ల వయస్సు గల ఒక బాలుడు తప్పిపోయి ఒంటరిగా తిరుగుతూ కనిపించాడు. స్థానికుల సమాచారంతో ప్రస్తుతం ఆ బాలుడు ఆర్మూర్ పోలీసు స్టేషన్‌లో భద్రంగా ఉన్నాడు. ఆ బాలుడు తన పేరు డి. ప్రణయ్ అని, తల్లి పేరు శిరీష అని చెప్పాడు. ఈ సమాచారాన్ని బాలుడు సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేరేందుకు షేర్ చేయండి.
MLG: తాడ్వాయి మండలం ఉరట్టం పంచాయతీ పరిధిలోని జంపంగావాయి కొత్తూరులో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఇవాళ ఉప సర్పంచ్ కాక రంజిత్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ మాట్లాడుతూ.. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.
MNCL: భీమిని మండలం పెద్దపేట గ్రామ పంచాయతీకి చెందిన పర్థన్ రామకృష్ణ అధికంగా నాటు సరకు (మద్యం) తాగడం వల్ల కాలేయం దెబ్బతిని మృతి చెందాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడిని తండ్రి అశోక్ మంగళవారం రాత్రి ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ప్రాణాలు విడిచాడు. చేతికి ఎదిగిన కొడుకు కళ్లముందే మరణించడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది.
ADB: ఉట్నూర్‌లోని శ్రీ రామాలయంలో గత తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న చండీ యాగం బుధవారంతో ముగిసింది. ముగింపు వేడుకల్లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. యాగ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందజేసి పీవోను సన్మానించారు. చండీ యాగంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
NDL: మిడుతూరు మండలం చెరుకుచెర్లలో ఇవ్వాల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి MLA గిత్త జయసూర్య హాజరై, స్వయానా ఇంటికి వెళ్లి వృద్ధులు, వికలాంగు పింఛన్లు పంపిణీ చేసి, వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు పాల్గొన్నారు.
AP: చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నందుకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి సవిత ధన్యవాదాలు తెలిపారు. ఈ ఉచిత విద్యుత్ పథకంతో ఏడాదికి మగ్గం నేతన్నలకు రూ.8,640.. మరమగ్గం నేతన్నలకు రూ.21,600 వరకు ఆదా అవుతుందని ఆమె పేర్కొన్నారు. చేనేతలకు గౌరవప్రదమైన జీవనమే తమ కూటమి ప్రభుత్వం లక్ష్యమని సవిత చెప్పారు.
ప్రకాశం: వెలిగండ్ల మండలంలో 5 ఏళ్ల బాలికపై అత్యాచారం యత్నానికి పాల్పడిన నిందితుడికి ఒంగోలు POCSO కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధించింది. బాధితురాలికి రూ.75,000 పరిహారం DLSA ద్వారా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. పోలీసుల సమర్థవంతమైన దర్యాప్తుతో నేరం నిరూపితమై శిక్ష పడిందని జిల్లా SP హర్షవర్ధన్ రాజు తెలిపారు.
ASR: జిల్లాలో డోలి మోతలు తప్పడంలేదు. డుంబ్రిగుడ మండలం, కొల్లాపుట్టు పంచాయితీ డొకిరిపాడు గ్రామానికి చెంది పాంగి డొమినికి బుధవారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి. సరైనరోడ్డు లేక పురిటినొప్పిలతో ఉన్న డొమిని ని కుటుంబ సభ్యులు, బందువులు 3kmలు డోలీ మోశారు. ఆంబులెన్స్ అందుబాటులో లేక, ఆటోలో అరకు ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు.