AP: రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి అని, దీన్ని ఎవరూ ఒక్క ఇంచ్ కూడా కదిలించలేరని CM చంద్రబాబు తెలిపారు. అమరావతికి చట్టబద్ధత కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తే YCP సభ్యులు రాలేదని.. ఆ పార్టీది 3 ముక్కలాట-3 రాజధానుల నినాదమని విమర్శించారు. YCP అని చెప్పుకోవడానికి కూడా ఆ పార్టీ నేతలు సిగ్గుపడాలంటూ దుయ్యబట్టారు.
ELR: ద్వారకా తిరుమలలోని వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం కియోస్క్ మెషిన్‌లు ఆలయ అధికారులు ఇవాళ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం-కరూర్ వైశ్యా బ్యాంక్ సహకారంతో ఏర్పాటైన ఈ సదుపాయాన్ని ఆలయ ఈవో వై.భద్రాజి, బ్యాంక్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. యూపీఐ, కార్డుల ద్వారా దర్శనం, ప్రసాదం టికెట్లు సులభంగా పొందవచ్చన్నారు.
NGKL: నల్లమల అటవీ ప్రాంతంలోని సలేశ్వరం జాతర చైత్ర పౌర్ణమి పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడుతుంది. 200 అడుగుల ఎత్తు నుంచి జలపాతం జాలువారే ప్రకృతి ఒడిలో వెలసిన శివయ్యను దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. “శివయ్య వస్తున్నాం” అనే నినాదాలతో దట్టమైన అడవి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
E.G: నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ బుధవారం ఢిల్లీ వెళ్ళనున్నారు. ఈ పర్యటనలో భాగంగా గురువారం కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న పర్యాటక, సాంస్కృతిక ప్రాజెక్టులపై చర్చించి వాటిని ఆమోదింప చేసుకునే దిశగా కృషి చేస్తారని వెల్లడించారు.
MLG: మేడారం సమ్మక్క పూజారి రాణా రమేష్ కుమారుడు ప్రమాదవశాత్తు గాయపడి హన్మకొండలోని గార్డియన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క బుధవారం ఆసుపత్రికి వెళ్లి బాధితుడుని పరామర్శించారు. అనంతరం మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. మంత్రి వెంట DCC అధ్యక్షుడు అశోక్ తదితరులు ఉన్నారు.
NRPT: ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన జాతీయ నెట్ బాల్ పోటీల్లో కొండాపూర్ గురుకుల విద్యార్థులు కిషన్, మోహన్, హర్షవర్ధన్ రజత పతకం సాధించారు. తెలంగాణ జట్టు తరపున ఆడి పతకం గెలిచిన వీరిని పీఈటీ అంజనేయులు, గురుకుల నిర్వాహకులు అభినందించారు. జాతీయ స్థాయిలో రాణించి గ్రామానికి, పాఠశాలకు పేరు తెచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు.
ATP: రాప్తాడు నియోజకవర్గం కట్టకిందపల్లిలో పెద్దమ్మ తల్లి విగ్రహం, బొడ్రాయి ప్రతిష్ఠా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. గ్రామంలో ఏర్పాటు చేసిన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా ప్రకాష్ రెడ్డి కోరుకున్నారు.
AP రాజధాని, ప్రత్యేక హోదాపై సమాజ్‌వాది పార్టీ MP ధర్మేంద్ర యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి పేరిట రైతులు నుంచి భూములు తీసుకుంటున్నారని, విశాఖను రాజధాని చేసి ఉంటే ఇంత ఖర్చయ్యేది కాదన్నారు. అయినా రాష్ట్రాల హక్కుల కోసం అమరావతి రాజధాని బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. APని BJP మోసం చేస్తోందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
MDK: IPL మ్యాచ్‌లు చూసేందుకు ఎవరైన బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చిన్నశంకరంపేట SI నారాయణ గౌడ్ హెచ్చరించారు. గ్రామాలలో ఎక్కడైనా స్క్రీన్లు ఏర్పాటు చేసినా, బెట్టింగ్ నిర్వహించిన తమకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. బెట్టింగ్‌లకు పాల్పడి యువత జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు.
అనకాపల్లి శారదానదిపై వినాయక ఘాట్ వద్ద కాలుష్యాన్ని నివారించేందుకు ఐరన్ డస్ట్ బిన్లు ఏర్పాటు చేయాలని వినాయక నిమజ్జనోత్సవ కమిటీ అధ్యక్షుడు ఆడారి కుమారస్వామి, ప్రతినిధులు బుధవారం జోనల్ కమిషనర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల నది కాలుష్యం పెరుగుతోందని, డస్ట్ బిన్లు ఏర్పాటు చేస్తే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని వివరించారు.
విశాఖలో నూతన కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ బుధవారం బాధ్యతలు చేపట్టకముందే సింహాచలం అప్పన్న స్వామి ఆశీస్సులు పొందారు. సంప్రదాయంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలో పరిపాలన వేగవంతం చేసి పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పరిష్కరిస్తారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
PPM: మందుల చీటి తెలుగులో అర్థమైయేలా వ్రాయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం. ప్రభాకర్ రెడ్డి అన్నారు. పార్వతీపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం. ప్రభాకర్ రెడ్డి బుధవారం పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. ఇందులో భాగంగా బైపాస్ రోడ్డులో ఉన్న సౌజన్య ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా సందర్శించి, అక్కడ అందుతున్న వైద్య సేవలను స్వయంగా పరిశీలించారు.
VZM: జిల్లాలోని పాత్రికేయులంతా తమ ఆరోగ్యంపట్ల శ్రద్ద వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి కోరారు. జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో స్థానిక తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో అక్రిడేటెడ్ జర్నలిస్టులకు గత ఐదు రోజులుగా ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఉచిత వైద్య ఆ...
ప్రకాశం: హనుమంతునిపాడు మండలం ఉమ్మలపల్లి కొత్తూరులో సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఆలయంలో నూతన పంచలోహ విగ్రహాలకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ, సంప్రదాయాలను కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
RR: ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు ముగ్గురు ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ అధిష్టానం కేటాయించింది. ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికకు పరిశీలకులు, ఇన్‌ఛార్జ్‌లుగా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, మాధవరం కృష్ణారావు, దేవిరెడ్డి సుధీర్ రెడ్డిలను నియమించింది. కాగా, ఏప్రిల్ 4వ తేదీన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్‌ఛైర్మన్ ఎన్నిక జరగనుంది.