ADB: జిల్లా బీసీ అభివృద్ధి అధికారిగా ధారావత్ సోనియా బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షిషాను బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా కార్యకలాపాలు, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు అయ్యేలా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని ఆయన సూచించారు.
WGL: నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డును మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్, కౌన్సిలర్ నవీన్ నాయక్ సందర్శించి ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నర్సంపేట సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నామని, అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని చైర్ పర్సన్ కోరారు.
AP: జగన్ అమరావతిపై మాట్లాడుతూ TG మాజీ CM KCRను ప్రశంసించారు. ‘తాత్కాలిక అసెంబ్లీ సచివాలయం పేరుతో చంద్రబాబు వందల కోట్లు వృథా చేశారు. TGలో KCR రూ.615 కోట్లతో సెక్రటేరియట్ కట్టారు. ఢిల్లీలోని పార్లమెంటును రూ.970 కోట్లతో నిర్మించారు. AP అసెంబ్లీకి రూ.1,449 కోట్లట, KCR నెంబర్‌కు డబుల్’ అని వ్యాఖ్యానించారు.
SS: ముదిగుబ్బలో ఉన్న ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల భవనాలను మరమ్మతులు చేయాలని కోరుతూ బుధవారం ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఆర్డీటీ సంస్థ ముదిగుబ్బ మండల ఏరియా టీం లీడర్ కృష్ణయ్యకు వినతి పత్రం అందజేశారు. ఆర్డీటీ కార్యాలయంలో ATL కృష్ణయ్యతో మాట్లాడుతూ.. 2007 సంవత్సరంలో TDT సంస్థ నిర్మించిన ఈ పాఠశాల గదులు చాలా వరకు శిధిలావస్థకు చేరాయని తెలిపారు.
కోనసీమ: రాజోలు ఎస్సైగా పీ.మల్లికార్జున రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అమలాపురం మహిళా పోలీస్ స్టేషన్ ఎస్సైగా పనిచేస్తున్న మల్లికార్జున రెడ్డి బదిలీపై రాజోలు వచ్చారు. రాజోలు ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన మల్లికార్జున రెడ్డిని పోలీస్ స్టేషన్ సిబ్బంది అభినందించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తానని మల్లికార్జున రెడ్డి తెలిపారు.
E.G: ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ పంపిణీ ప్రక్రియను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంలోని స్వర్ణ వార్డు, ప్రకాష్ నగర్ ప్రాంతంలో లబ్ధిదారులను ప్రత్యక్షంగా కలుసుకుని, పింఛన్ సొమ్ము సక్రమంగా ఇంటి వద్దనే అందుతున్నదా లేదా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా పాల్గొన్నారు.
RR: షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై వాట్సాప్‌లో అనుచిత పోస్టులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వీర్లపల్లి శంకర్ యూత్ డిమాండ్ చేసింది. అభిమానులు వాట్సాప్ స్టేటస్‌లు పెట్టుకున్న సందర్భంలో కొందరు వ్యక్తులు వాటికి రిప్లై ఇవ్వగా.. అసభ్యకరమైన కామెంట్లు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీర్లపల్లి యూత్ నందిగామ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
WNP: పదవీ విరమణ పొందిన అధికారులను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. పశువైద్యాధికారి వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీడీవో రవీంద్రబాబు, జెడి సీపీవో వెంకటరమణ దంపతులను వారి నివాసాల్లో శాలువాతో గౌరవించారు. వారి సేవలను ప్రశంసిస్తూ, విశ్రాంత జీవనం సుఖసంతోషాలతో గడవాలని నిరంజన్ రెడ్డి ఆకాంక్షించారు.
KKD: ప్రత్తిపాడు మండలంలోని చింతలూరు గ్రామ ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య ఏర్పడినట్లు స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ దృష్టికి రాగానే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యకు చెక్ పెట్టారు. తాగునీటి సమస్య తీర్చిన ఎమ్మెల్యే సత్యప్రభకు, సంబంధిత అధికారులకు చింతలూరు గ్రామ ఎస్సీ కాలనీవాసులు కృతజ్ఞతలు తెలియజేశారు. మళ్లీ సమస్య పునరావృతం కాకుండా చూడాలన్నారు.
KMM: పశువులకు సోకే ప్రమాదకరమైన వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు రైతులు తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని ముదిగొండ మండల పశువైద్యాధికారి అశోక్ అన్నారు. బుధవారం న్యూ లక్ష్మీపురం, ఖానాపురం, పెద్దమండవ గ్రామాల్లో పశు వైద్య శిబిరాలు నిర్వహించి పశువులకు గాలికుంటు టీకాలు వేశారు. టీకాలు వేయడం ద్వారా పశువుల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని పేర్కొన్నారు.
CTR: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమ పాలన అందిస్తోందని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. బుధవారం చిత్తూరు నగరపాలక పరిధిలో 35వ వార్డు కయనికట్టు వీధిలో కలెక్టర్ సుమిత్ కుమార్ తో కలిసి ఎన్టీఆర్ సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి వృద్ధులకు పింఛన్ సొమ్ములను అందించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు.
మంచిర్యాల జిల్లా DCC నూతన బాడీ ప్రమాణ స్వీకారం ఈనెల 3న నిర్వహించనున్నట్లు DCC అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ రానున్నారని పేర్కొన్నారు. జిల్లాలోని ముగ్గురు MLAలు మంత్రి వివేక్, ప్రేమాసాగర్ రావు, వినోద్ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.
HNK: పరకాలలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి యువకులు వినతిపత్రం అందజేశారు. లైబ్రరీ బిల్డింగ్ శిధిలావస్థకు చేరిందని, పాత మున్సిపాలిటీ బిల్డింగ్‌లోని పై-అంతస్తులో చదువుకునేందుకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యేను యువకులు కోరారు. కార్యక్రమంలో పరకాల మున్సిపల్ చైర్మన్ సునీల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
AP: కొత్తగూండెం, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు కేంద్రం సహకరించాలని ఎంపీ రఘురాం రెడ్డి కోరారు. మూసీ ప్రాజెక్టు, రీజినల్ రింగ్ రోడ్డు, కేటీపీఎస్ విస్తరణకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో కలిపిన వాటిలో 4 గ్రామ పంచాయతీలను వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ 4 గ్రామ పంచాయతీలు ఏపీ, తెలంగాణలో ఎక్కడా ఉనికిలో లేవన్నారు.