RR: రిటైల్ చికెన్ సెంటర్లకు ఇచ్చే మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో షాద్‌నగర్ నియోజకవర్గంలోని వందలాది చికెన్ దుకాణాలను బంద్ చేశారు. అయితే పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే మార్జిన్ తగ్గించడంతో వ్యాపారస్తులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
NZB: సిరికొండ మండలం పందిమడుగు రోడ్డు కోతకు గురై ప్రమాదకరంగా మారింది. ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు జంకుతున్నారు. గత నెలలలో గుంతలో పడి ముగ్గురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. మరమ్మతులు చేయాలని (ఆర్అండ్ బి) అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే రోడ్డును మరమ్మత్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
MBNR: మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ మీదుగా నడిచే పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే డీపీఆర్ఓ శ్రీధర్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. 17435 కాచిగూడ-కర్నూల్ సిటీ, 67787 కాచిగూడ-రాయచూరు, 67788 రైచూర్-కాచిగూడ, 17693 కాచిగూడ-రైచూర్, 17694 రాయచూర్-కాచిగూడ, 67784 గద్వాల-రాయచూర్, 67783 రాయచూరు-గద్వాల రైళ్లు ఈనెల 7వ తేదీ వరకు రద్దయ్యాయన్నారు.
కృష్ణా: పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అవనిగడ్డ గ్రామ సచివాలయం -4 ఎస్టీ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందచేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ మొత్తాన్ని పెంచి అందిస్తోందన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈనెల 7నుంచి 28వ తేదీ వరకు దివ్యాంగుల కోసం సదరం క్యాంపులను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిలో 16 కేటగిరీలలో స్లాట్ బుక్ చేసుకున్న వారికి సదరం క్యాంపులను నిర్వహిస్తామని తెలిపారు. ఏప్రిల్ 7,8,10, 15,17,21,24,28 తేదీలలో సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
NRML: జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో ప్రత్యేక గ్రామ సభలను అందరూ విజయవంతం చేయాలని స్థానిక ఎంపీడీవో ఉమర్ షరీఫ్ కోరారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం జన్నారం మండలంలోని 29 గ్రామపంచాయతీలలో ప్రత్యేక గ్రామసభలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
KNR: కరీంనగర్ నగరంలోని ఐటీ టవర్లో గల టాస్క్ ఆఫీసులో అడ్వాన్స్డ్ ఎక్సెల్, బేసిక్ ఐటీ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రతినిధులు తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి గల వారు ఈనెల 10వ తేదీలోపు ఐటీ టవర్ మొదటి అంతస్తులోని టాస్క్ కార్యాలయంలో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
VKB: తాండూరు పట్టణంలోని వీరశైవ సమాజం నూతన కార్యవర్గ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 8 నుంచి 12 వరకు నామినేషన్ల స్వీకరణ, 14న ఉపసంహరణ ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఏప్రిల్ 26న ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
MHBD: నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని తొర్రూరులో కార్మిక సంఘాల నేతలు నిరసన చేపట్టారు. నేతలు విశ్వేశ్వరరావు, రవి మాట్లాడుతూ… కార్మిక వ్యతిరేక విధానాలను ప్రభుత్వాలు వెంటనే ఉపసంహరించుకోవాలని, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతూ కార్మికులను ఆదుకోవాలని అన్నారు.
KMM: రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఈరోజు నుంచి జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాల్లో ఈ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో 748 దుకాణాల పరిధిలో 4,69,865 కార్డుదారులు ఉండగా, 13,28,400 మంది లబ్ధి పొందుతున్నారు. లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ నెలకు ఆరు కేజీల చొప్పున పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
కోనసీమ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతీ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తెలిపారు. బుధవారం మండపేట పట్టణంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మండపేట లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన స్పౌస్ పింఛన్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు.
కృష్ణా: ఎన్‌హెచ్-16 పై గన్నవరం సమీపంలోని పొట్టిపాడు టోల్ ప్లాజాను మూసివేసి మంగళవారం అర్ధరాత్రి నుంచి వాహనదారులకు టోల్ ఫ్రీ చేశారు. అదే సమయంలో విజయవాడ వెస్ట్ బైపాస్‌లో సూరంపల్లి వద్ద కొత్త టోల్ ప్లాజాను ప్రారంభించారు. టెండర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు తాత్కాలికంగా జాతీయ రహదారుల అధికారులు నిర్వహణ చేపట్టినట్లు సమాచారం.
TG: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎండల తీవ్రత దృష్ట్యా అంగన్వాడీ కేంద్రాలకు ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 30 వరకు ఒంటిపూట బడులు అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలు నడవనున్నాయి. సెలవుల్లోనూ అంగన్వాడీ పిల్లలకు రేషన్ పంపిణీ చేయనుంది.
WGL: ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం వరంగల్ జిల్లాలోని 317 గ్రామాల్లో గ్రామ సభ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. సత్య శారద తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సందేశం, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు, భవిష్యత్తులో అమలు చేయనున్న పథకాలను ప్రజలకు వివరించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
‘పెద్ది’ సెట్స్‌లో రామ్ చరణ్ గాయపడిన విషయం తెలిసిందే. డూప్ లేకుండా స్టంట్స్ చేస్తుండగా ఆయన కంటిపై గాయం కావడంతో యూనిట్ చికిత్స అందించింది. అయితే, మార్చి 27న ఆయన పుట్టినరోజు కావడంతో గాయంతోనే సెట్స్‌లో వేడుకలు జరుపుకున్నాడు. ఎల్లో శాలువా, రగ్గడ్ లుక్‌లో కంటిపై కుట్లతో ఉన్న చరణ్ ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.